ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై ఆధార్‌ కార్డు డిజిటల్‌ అయినా ఓకే! | APSRTC Senior Citizen Ticket Fare Concession Allows Aadhaar Digital Format | Sakshi
Sakshi News home page

ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఆధార్‌ కార్డూ గుర్తింపు కార్డే

Published Tue, Jul 12 2022 11:42 AM | Last Updated on Tue, Jul 12 2022 2:46 PM

APSRTC Senior Citizen Ticket Fare Concession Allows Aadhaar Digital Format - Sakshi

సాక్షి, అమరావతి: సీనియర్‌ సిటిజన్లకు బస్‌ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్‌ ఆధార్‌ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్‌ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్‌ కార్డు, సీనియర్‌ సిటిజన్‌ ఐడీ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్‌ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement