RTC busses
-
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై ఆధార్ కార్డు డిజిటల్ అయినా ఓకే!
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అంతా తల్లకిందులు.. అగ్గువ ఏడ దొరుకుతది?
సాక్షి, హన్మకొండ: డీజిల్ టోకు లెక్కన కొనే ఆర్టీసీకి కొత్త చిక్కొచ్చిపడ్డది. ఆయిల్ కంపెనీలు బల్క్ విక్రయాల రేట్లు పెంచాయి. దీంతో తక్కువ ధరకు డీజిల్ అందించే ప్రైవేట్ బంకుల కోసం ఆర్టీసీ వేట ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో డిపోలో వందకు పైగా బస్సులున్నాయి. టీఎస్ ఆర్టీసీ డిపోలోనే సొంతంగా డీజిల్ బంక్‌లు ఏర్పాటు చేసుకుంది. బయటి మార్కెట్లో బంకులకు సరఫరా చేసినట్లుగానే హోల్‌సేల్ ధరలకు ఆయిల్ కంపెనీలు ఆర్టీసీకి డీజిల్ అందించేవి. కానీ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బల్క్ డీజిల్ కొనుగోలు చేస్తున్న సంస్థలకు ఆయిల్ కంపెనీలు ధరలు అమాంతం పెంచాయి. బల్క్ ధర లీటర్‌కు రూ.96.50కి పెంచినట్లు సమాచారం. బయటి బంకుల్లో రిటైల్ ధర లీటర్‌కు రూ.94.14 ఉంది. మన దగ్గర ఇలా.. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 9 డిపోలున్నాయి. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ డిపోల ఆధ్వర్యంలో రిటైల్ డీజిల్ బంకులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడు డిపోల బస్సులు ఆర్టీసీ నిర్వహిస్తున్న రిటైల్ డీజిల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకుంటున్నాయి. మిగతా వరంగల్–1, వరంగల్–2, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, తొర్రూరు డిపోల బస్సుల్లో ఇంధనాన్ని నింపేందుకు ఈ డిపోల పరిధిలో బంకులను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆలస్యమైతే ఆర్టీసీపై భారం పడనుండడంతో వీలైనంత త్వరగా ప్రైవేట్ బంకులను ఎంపిక చేసే పనిలో కమిటీ ముందుకు సాగుతోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డివిజనల్ మేనేజర్ల ఆధ్వర్యంలో కమిటీ ప్రైవేటు బంకులను గుర్తించే పనిలో ఉంది. వరంగల్ రీజియన్‌లో 952 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఇందులో సంస్థ సొంత బస్సులు 584, అద్దె బస్సులు 368 ఉన్నాయి. (చదవండి: డబ్బు ఇవ్వలేదని.. జబ్బు అంటగట్టింది) 952 బస్సులకు ఆయా డిపోల్లోని సంస్థ సొంత బంకుల్లోనే డీజిల్ నింపేవారు. వరంగల్ రీజియన్‌లో దాదాపు రోజుకు 67,500 లీటర్ల డీజిల్ అవసరం. లీటర్‌కు రూ.2.36 మిగిలితే. 67,500 లీటర్లకు రూ.1,59,300 సంస్థకు ఆదా కానుంది. బల్క్ కొనుగోలుదారులకు ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో సంస్థ సొంత బస్సులతోపాటు అద్దె బస్సులకు కూడా ప్రైవేట్ బంకులే దిక్కయ్యాయి. గతంలోనూ ఇదే పద్ధతి.. 2011–12 ఆర్థిక సంవత్సరం చివర్లో ఆయిల్ కంపెనీలు బల్క్ డీజిల్ ధరలు పెంచాయి. దీంతో ఆరు నెలలపాటు ప్రైవేటు డీజిల్ బంకుల్లో ఆర్టీసీ ఇంధనాన్ని నింపుకుంది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేట్ బంకుల వైపు ఆర్టీసీ చూస్తోంది. రిటైల్ ధరలోనూ కాస్త తగ్గించి ఆర్టీసీకి డీజిల్ అందించే బంకుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు బంకుల యజమానులను కలిసి మాట్లాడుతున్నారు. డివిజనల్ మేనేజర్, రీజినల్ అకౌంట్స్ ఆఫీసర్, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఎస్ఎస్ఐ, సంబంధిత డిపో మేనేజర్‌తో కూడిన కమిటీ ప్రైవేట్ డీజిల్ బంకులను ఎంపిక చేయనుంది. ఈ కమిటీ ఆయా డిపోల పరిధిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తుంది. వారం రోజుల్లోపు ప్రైవేట్ బంకులను ఖరారు చేసే పనిలో కమిటీ నిమగ్నమైంది. (చదవండి: ఇబ్రహీంపట్నంలో కాల్పుల ఘటన: ఇద్దరి మృతి) -
మహిళలకు ఉచిత బస్సు టికెట్లు.. ఎందుకంటే!
వేలూరు/తమిళనాడు: మహిళలకు సురక్షిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయాలని, ఆర్థికాభివృద్ధిని పెంచాలని మే 8వ తేదీ నుంచి ప్రభుత్వ టౌన్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అన్ని టౌన్ బస్సుల్లోను ప్రస్తుతం ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకంలో విల్లుపురం రీజినల్ పరిధిలో వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలో నడుస్తున్న 227 ప్రభుత్వ టౌన్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ప్రభుత్వ టౌన్ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల సంఖ్య పెరిగింది. వేలూరు, తిరుపత్తూరు జిల్లాలో టౌన్ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలకు ఈనెల 12 నుంచి ఉచిత బస్సు టికెట్లను అందజేస్తున్నారు. సహజంగా బస్సు టికెట్లో ధర పట్టికలో ఉచిత ప్రయాణం అని ప్రింట్ చేసి ఉంది. ఉచిత ప్రయాణ టికెట్‌ను అందజేయడం ద్వారా ఒక బస్సులో రోజుకు ఎంత మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. -
భారత్ బంద్.. స్తంభించిన విజయవాడ
-
నగదు లేకున్నా ఆర్టీసీలో ప్రయాణం!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి పైలెట్ ప్రాజెక్టును ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు విజయవాడలో బుధవారం ప్రారంభించారు. దానిలో భాగంగా ఆర్టీసీ వైఎస్ చైర్మన్, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఛలో మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. 2.5 లక్షల ప్రయాణికులకు ఛలో యాప్ ఉపయోగకరంగా మారనుంది. యాప్‌తో పాటు స్మార్ట్ కార్డులను కూడా ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. టిమ్ మిషన్ ద్వారా స్మార్ట్ కార్డులను ఉపయోగించకోవచ్చని ఆర్టీసీ ఎండీ ప్రతాప్ తెలిపారు. ప్రయోజనాలివి.. చిల్లర సమస్య ఎదురుకాదు. ఆర్టీసీ సిబ్బందికి సమయం ఆదా అవుతుంది. నగదు లేకపోయినా కార్డు ద్వారా ప్రయాణం చేయొచ్చు. ప్రతిరోజు ప్రయాణం చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఉపయుక్తంగా ఉటుంది. -
బతుకు బస్టాండు
కదిరి అర్బన్: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనతో ఆర్టీసీ ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కదిరి ఆర్టీసీ డిపోలో దాదాపు 104 బస్సులు ఉంటే అందులో 60 బస్సులను సీఎం సభకు తరలించారు. దీంతో పలు సర్వీసుల రద్దయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు ఆశ్రయించారు. మరికొందరు మాత్రం బస్టాండుల్లోనే గంటల తరబడి వేచి చూశారు. ముఖ్యమంత్రి ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా తమకీ పాట్లు తప్పడం లేదని ప్రయాణికులు వాపోయారు. -
కర్ణాటక వెళ్లే బస్సులను వదిలిపెట్టడం లేదు!
సాక్షి, విజయవాడ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశముందని సర్వేలు చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అగ్రనేతలను బరిలోకి దింపి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య, మాజీ కేంద్రమంత్రులు, సీనియర్ నేతలు ప్రచారం చేస్తుండగా.. అటు బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు, యడ్యూరప్ప తదితరులు జోరుగా ప్రచారంలో మునిగిపోయారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ప్రచారం హోరాహోరీగా సాగుతుండగా.. కన్నడలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగారు. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పేరొందిన నాయకులు ప్రచారం చేశారు. మధ్యలో ఉద్యోగ సంఘాల నేత అశోక్‌బాబు లాంటివాళ్లు కూడా హంగామా చేశారు. కర్ణాటకలో ఉన్న తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లే బస్సులను వదిలిపెట్టడం లేదు. తాజాగా విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కర్ణాటకకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సుల్లో బీజేపీ నేతలు ప్రచారం చేశారు. కర్ణాకటలో బీజేపీకే ఓటు వేయాలని ప్రయాణికులను వారు కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రయాణికులు వివరించారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయి.. బీజేపీని ఓడించాలని చూస్తున్నారని, ప్రజలు దీనిని గమనించాలని బీజేపీ నేతలు తెలిపారు. -
మెట్రో ఇరువైపులా కాలనీలకు ఆర్టీసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మార్గాల్లో ఇరువైపుల కాలనీల్లోకి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో తొలి కారిడార్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 24 మెట్రో రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తూ ఇరువైపుల 22 కాలనీలకు 212 ట్రిప్పుల్లో బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా ఐటీ కారిడార్‌కు 10 రూట్లలో 50 బస్సులు నడపనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి గీతం విద్యాలయ విద్యార్థులు సర్వే చేసినట్టు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన సచివాలయంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్నాయక్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో మెట్రోరైలు అన్ని కారిడార్లలో ఆర్టీసీ అనుసంధానమవుతుందని మంత్రి పేర్కొన్నారు. మెట్రో రైలుతో కలసి ఆర్టీసీ సంయుక్త టికెట్ విధానంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. త్వరలో 1,400 కొత్త బస్సులు: భవిష్యత్తులో మినీ బస్సులను మరింతగా అనుసంధానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో మరో 1,400 కొత్త బస్సులు కొనే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. కొత్త బస్సుల కొనుగోలులో కాలుష్య అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఉన్నంతలో ఎలక్ట్రిక్ బస్సులు వాడతామన్నారు. ముంబై, బెంగళూరు తరహాలో ఆర్టీసీ సేవలను మెరుగుపరుస్తామన్నారు. హైదరాబాద్‌లో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సు కోసం వచ్చే ప్రతినిధులకు ఆర్టీసీ గరుడ, మినీ ఏసీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. -
రేపు ఆర్టీసీ బస్సులూ ఉండవు!
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నందున ఆ రోజు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వే రోజున సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు, బ్యాంకులు కూడా సెలవు ప్రకటించేశాయి. హోటళ్లు, సినిమా థియేటర్లు సైతం తెరుచుకోవు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేకపోవటంతో బస్సులు నడపకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. సర్వేలో పాల్గొనే ఉద్యోగుల తరలింపు కోసం ఆర్టీసీ బస్సులనే వినియోగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరువేల బస్సులు ఉపయోగించే అవకాశం ఉంది. మిగిలిన 4 వేల బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తే పరిమితంగా బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. అద్దె చెల్లిస్తేనే ఏర్పాట్లు... తెలంగాణవ్యాప్తంగా బస్సులు తిరగని పక్షంలో ఆర్టీసీ రోజుకు దాదాపు రూ.12 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుంది. డీజిల్ రూపంలో దాదాపు రూ.5 కోట్లు, మెయింటెనెన్స్ ద్వారా రూ.2 కోట్ల మేర పొదుపు నమోదైనా రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో సర్వే కోసం ఆర్టీసీ బస్సులను విగినియోగిస్తే అందుకు అద్దె చెల్లించాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు సంస్థ తేల్చి చెప్పింది. ఒక్కో బస్సుకు రూ.11,200 చొప్పున అద్దె చెల్లించాలని పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకు 1,100 బస్సుల కోసం కలెక్టర్ల నుంచి విజ్ఞాపనలు అందాయి. సోమవారం మధ్యాహ్నానికి ఐదు నుంచి ఆరు వేల బస్సులు బుక్కయ్యే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం పాఠశాలల బస్సులను బుక్ చేసుకుంటున్నాయి. కాగా, 19న బస్సులు తిప్పకూడదని ఆర్టీసీ నిర్ణయించినా.. డ్రైవర్లు, కండక్టర్లు విధులకు రావాల్సి ఉంటుందని సంస్థ అధికారులు చెబుతున్నారు. అత్యవసర సేవల పరిధిలో ఆర్టీసీ ఉన్నందున వారు ఇళ్ల వద్ద లేకున్నా సర్వేకు ఇబ్బంది ఉండదని, సర్వే సిబ్బంది దాన్ని పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. మరీ అంత అవసరమైతే అత్యవసర విధుల్లో ఉన్నట్టుగా కలెక్టర్ల నుంచి పత్రాలు తెప్పించి జారీ చేస్తామని పేర్కొంటున్నారు.