
కదిరి బస్టాండులో బస్సులు లేక ప్రయాణికుల నిరీక్షణ
కదిరి అర్బన్: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనతో ఆర్టీసీ ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కదిరి ఆర్టీసీ డిపోలో దాదాపు 104 బస్సులు ఉంటే అందులో 60 బస్సులను సీఎం సభకు తరలించారు. దీంతో పలు సర్వీసుల రద్దయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు ఆశ్రయించారు. మరికొందరు మాత్రం బస్టాండుల్లోనే గంటల తరబడి వేచి చూశారు. ముఖ్యమంత్రి ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా తమకీ పాట్లు తప్పడం లేదని ప్రయాణికులు వాపోయారు.

సీఎం సభ నిర్వహించిన తురకలాపట్నంలో ఉన్న ఆర్టీసీ బస్సులు