
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించడానికి 48 గంటల ముందు టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్ జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈ రాయితీ సౌకర్యం విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుందన్నారు.
మాట్లాడుతున్న జితేంద్రనాథ్‌రెడ్డి
రాయితీ పొందేందుకు 48 గంటల ముందు రిజర్వు చేసుకోవాలని తెలిపారు. తొలి నాలుగైదు సీట్లకు మాత్రమే రాయితీ ఉంటుందని తెలిపారు. డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, అమరావతి బస్సులో 49 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, ఇంద్ర బస్సులో 40 సీట్లు ఉంటే నలుగురు, సూపర్ లగ్జరీలో 35 సీట్లకుగాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకుగాను నలుగురు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 49 సీట్లు ఉంటే ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశం మార్చి 31వ తేది వరకు అమలులో ఉంటుందని ఆయన వివరించారు.
చదవండి: తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు
Comments
Please login to add a commentAdd a comment