Bus fare
-
Tsrtc: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ రూట్లలో 10 శాతం రాయితీ
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగుళూరు, విజయవాడ రూట్లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో ఆదివారం(జులై 2) నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. ''విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. రానూపోను ఒకే సారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుంది. ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్యాసింజర్‌కు ఆదా అవుతుంది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.com ను సంప్రదించాలని సూచించారు. చదవండి: గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్ -
అదనపు చార్జీల భారం లేదు.. ప్రయాణికులకు పండుగే
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పండుగ సమయాల్లో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రయాణికులకు జగన్ సర్కార్ ఊరటనిచ్చింది. గతంలోలా అదనపు చార్జీల భారం మోపుతూ జేబులు గుల్ల చేయడం లేదు. ఇది వరకు ప్రతి పండుగ సమయంలో, వరుస సెలవులప్పుడు, దాదాపు రద్దీ సమయాల్లో ప్రయాణికుల నుంచి ఏపీఎస్ఆర్టీసీ సాధారణ చార్జీలకు మించి 50 శాతం వరకు అదనంగా వసూలు చేసేది. దూరాన్ని బట్టి సగటున ఒక్కో కుటుంబం రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అదనంగా చెల్లించి ప్రయాణించాల్సి వచ్చేది. ‘సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల పేరిట వారి నుంచి అదనంగా టికెట్ వసూలు చేయడం తగదు. ఈ విషయంలో సహేతుక నిర్ణయాలు తీసుకోండి’ అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు 3000 సర్వీసుల్లోని 1.40 లక్షల సీట్లకు సంబంధించి అదనపు చార్జీల వసూళ్ల జోలికి వెళ్లడం లేదని ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లిఖార్జునరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. గతంలో మనుగడ కోసం అంటూ ఆర్టీసీ ఫక్తు వ్యాపార ధోరణిలో కార్యకలాపాలను నిర్వర్తించేది. డిమాండ్ ఆధారంగా రెగ్యులర్ చార్జీలపై 10, 20 శాతం పెంచి వసూలు చేసేది. స్పెషల్ బస్సుల్లో 50 శాతం వరకు వసూలు చేసే వారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ బస్సులో నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి సాధారణ టికెట్ రూ.4,440 అవుతుంది. 50 శాతం పెంపుతో రూ.6,520 అవుతుంది. ఈ లెక్కన అదనపు భారం రూ.2,080. అమరావతి ఏసీ బస్సులో అయితే రూ.3,200 అదనపు భారం పడుతుంది. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం వల్ల ఇప్పుడు ఏ బస్సులోనూ ఇలా అదనపు భారం ఉండదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల అదనపు ఆదాయం ఉండక పోయినా, సీఎం ఆదేశాల మేరకు ప్రజలకు మేలు కలుగుతోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు తెలిపారు. 4 టికెట్లపై రూ.3,600 మిగులు గతంలో హైదరాబాద్ నుంచి అమలాపురం రావాలంటే టికెట్ రేట్లు చూసి భయపడేవాళ్లం. ప్రయివేటు ట్రావెల్స్ వారి తరహాలో ఆర్టీసీ కూడా అదనంగా వసూలు చేసేది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఒక టికెట్‌పై రూ.450 వరకు అదనపు భారం లేదు. మా కుటుంబంలో నలుగురికి రానుపోను కలిపి ఇప్పుడు రూ.3,600 అదనపు భారం తప్పినట్లే. ఇది పండుగ ఖర్చుకు కలిసి వచ్చినట్లే. – కోడూరి సత్య మణికంఠ, ప్రయాణికుడు, అమలాపురం -
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై ఆధార్ కార్డు డిజిటల్ అయినా ఓకే!
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘డైనమిక్’గా టీఎస్ఆర్టీసీ.. డీజిల్ ధర తగ్గితే బస్సు చార్జీలు తగ్గిస్తారా?
సాక్షి, హైదరాబాద్: డైనమిక్ ఫేర్ విధానం.. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుకోవడం ఎయిర్‌లైన్స్ సంస్థల్లో చూస్తుంటాం. పండుగల సమయాల్లో చార్జీలు రెట్టింపు చేసి వసూలు చేయటం ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ కొట్టినపిండే. ఇప్పుడు డీజిల్ ధరల విషయంలో ఆ తరహా విధానాన్ని అనుసరించే దిశలో టీఎస్ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే డీజిల్ సెస్ కొత్త చార్జీల పెంపు విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. టికెట్‌పై బస్సు కేటగిరీ వారీగా రూ.5, రూ.10 చొప్పున సెస్ విధించింది. ఇప్పుడు ఇందు లో ‘డైనమిక్’ విధానాన్ని తేవాలని భావిస్తోంది. డీజిల్ ధర భారీగా పెరిగినప్పుడల్లా ఈ సెస్‌నూ తదనుగుణంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ ధర స్థిరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం వారంలో మూడునాలుగు పర్యాయాలు పెరిగింది. మళ్లీ ఆ పరిస్థితి వస్తే డీజిల్ సెస్‌ను సవరించే లా ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. చదవండి👉 ఆల్‌నైన్ నెంబర్ @ రూ.4.49 లక్షలు సెస్‌ను ఎంత పెంచాలన్న విషయంలో నిర్ణ యం కూడా తీసుకునట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీ కొనే బల్క్ డీజిల్ ధర రూ.119కి చేరింది. కొద్ది రోజుల్లోనే రిటైల్ ధర దానికి చేరువవుతుందన్న హెచ్చరికలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా డైనమిక్ ఫేర్ విధానంలో డిమాండ్ లేనప్పుడు టికె ట్ధర తగ్గించడం కూడా భాగమే. మరి డీజిల్ ధర లు తగ్గితే సెస్‌ను ఆర్టీసీ తగ్గిస్తుందేమో చూడాలి. చదవండి👉🏼 గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7 -
ముహూర్తం ఖరారు.. కి.మీ.కు 15 నుంచి 30 పైసలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. వారం పదిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం ఆర్టీసీ అధికారుల తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో బస్సు చార్జీల అంశం ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. డీజిల్ భారం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో చార్జీలను పెంచాలని అధికారులు సీఎంను కోరారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిపై ని ర్ణయం తీసుకుంటామని, ఈలోపు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీం తో నాలుగు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు. పెంపునకు ప్రభుత్వం కూడా సాను కూలంగానే ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని రాజకీయ కారణాలతో నెల రోజులుగా ఈ కసరత్తు పెండింగులో పడింది. తాజాగా మరో సారి ఈ అంశంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి భేటీ పిలుపు కో సం ఎదురుచూస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఉన్నతాధికారులతో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. వా రం పది రోజుల్లో సమావేశం నిర్వహించి, ఓ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: హైదరాబాద్: సదర్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు) కి.మీ.కు 25 పైసల ప్రతిపాదనకు మొగ్గు రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను సవరించింది. అప్పట్లో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది. దీనివల్ల ప్రజలపై ఏటా రూ.550 కోట్ల భారం పడుతోంది. చార్జీలు పెంచిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.68గా ఉంది. ఇప్పుడది రూ.105కు చేరుకుంది. తాజాగా కేంద్రం సుంకం తగ్గించటంతో రూ.90 దిగువకు (ఆర్టీసీకి రాయితీ ధర మేరకు) చేరింది. అయినా... గతంలో చార్జీలు పెంచినప్పటి నుంచి ప్రస్తుత ధరతో బేరీజు వేసుకుంటే లీటరుపై రూ.20కి పైనే ఎక్కువగా ఉంది. అప్పటితో పోలిస్తే నిత్యం అదనంగా రూ.1.22 కోట్ల కంటే ఎక్కువ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యమేనన్నది ఆర్టీసీ అభిప్రాయం. ఇవీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఆర్టీసీ ఇటీవల నాలుగు రకాల ప్రతిపాదనలు పంపింది. కి.మీ.కు 15 పైస లు, 20 పైసలు, 25 పైసలు, 30 పైసలు.. ఇలా దేని ప్రకారం ఎంత ఆదాయం పెరుగుతుందనే లెక్కలు అందించారు. 20 పైసలు పెంచితే రూ.625 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 25 పైసలు పెంచితే దాదాపు రూ.750 కోట్లు పెరుగుతుందని, 30 పైసలైతే రూ.900 కోట్లకు పైగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో కి.మీ.కు 25 పైసలు పెంచే ప్రతిపాదన అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 30 పైసలైతే ఆర్టీసీకి మ రింత మెరుగ్గా ఉండనున్నా.. ప్రజలు భారం గా భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా 25 పైసల పెంపుపై సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. తాజా తగ్గింపుతో రోజుకు రూ.90 లక్షలు ఆదా కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకంపై తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు కొంతమేర తగ్గాయి. లీటరు డీజిల్‌పై రూ.10 తగ్గడంతో ఆర్టీసీకి పెద్ద ఊరటగానే మారింది. దీంతో రోజువారీ వినియోగిస్తున్న 6.50 లక్షల లీటర్ల డీజిల్‌పై లెక్కగడితే రూ.65 లక్షలు నేరుగా ఆదా అవుతుంది. ఆర్టీసీ వినియోగిస్తున్న అద్దె బస్సులపై వచ్చే ఆదాను కూడా జోడిస్తే అది రూ.90 లక్షల వరకు చేరుకుంటుంది. (చదవండి: TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్ఎస్ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500) -
ఆర్టీసీ గల్లాపెట్టె గలగల
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచుతూ కొత్త చార్జీలను అమలులోకి తెచ్చిన వారంలోనే రూ.12 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది. వాస్తవానికి ఈ మొత్తం ఇంకా ఎక్కువుండాల్సి ఉంది. నెల రోజులు గడిస్తే ఈ పెరుగుదల మరింత మెరుగ్గా ఉంటుందని అధికారులు అంటున్నారు. నగరంలో మాత్రం పెం పు ఫలితం అనూహ్యంగా ఉంది. 22 శాతం వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేయగా, అది 25 శాతాన్ని మించుతోంది. రాష్ట్రం మొత్తంగా చూస్తే 15 శాతంగా ఉంది. నెల తర్వాత ఈ సగటు 22 శాతానికి పెరుగుతుందని అంచనా. నగరంలో ప్రధాన డిపోలకు రోజువారీ అదనపు ఆదాయం రూ.4 లక్షలు, చిన్న డిపోల్లో రూ.2 లక్షలుగా ఉంది. ఆర్టీసీ సగటు రోజువారీ ఆదాయం రూ.10.20 కోట్లు. వారం రోజుల సగ టు రూ.11.70 కోట్లుగా నమోదైంది. 38 కుటుంబాలకు ‘కారుణ్య’ లబ్ధి సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు అమలు చేయటంలో అధికారులు రి కార్డు సృష్టించారు. నిర్ణయం తీసుకున్న వారంలోనే అన్ని కు టుంబాలకు ఆ లబ్ధి కలిగించారు. సమ్మె కాలంలో 38 మంది ఉద్యోగులు చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్ర మంలో తొలుత 25 కుటుంబాలకు, ఆపై మిగతా కుటుంబా లకు కారుణ్య నియామకాల కింద లబ్ధి చేకూర్చారు. -
ప్రయాణికులపై లాఠీ‘చార్జి’!
ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీ - ఆర్టీఏ దాడుల నేపథ్యంలో చార్జీలు రెట్టింపు సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బస్సుల దారి దోపిడీ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్ ఆపరేటర్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లో రిజిస్టరై తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లేకుండా తిరుగుతున్న సుమారు 300 బస్సులను నిలిపేయడం, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మరో 50కిపైగా ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేయడంతో బస్ టికెట్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాలకు తగినన్ని సర్వీసులు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఎడాపెడా చార్జీలు పెంచేశాయి. అరుణాచల్ బస్సులకు బ్రేక్.. పర్యాటక రాష్ట్రాలైన అరుణాచల్, నాగాలాండ్, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో జాతీయ పర్మిట్లకు అతి తక్కువ ఫీజులు అమలవుతున్న దృష్ట్యా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తమ బస్సులను ఆయా రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు 300 వరకు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు మరో 600 వరకూ ఉంటాయి. వీటిలో కొన్ని బస్సులు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుండగా.. మరికొన్ని బెంగళూరు, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఇటీవల అరుణాచల్‌లో ఈ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో వాటిని పట్టుకునేందుకు రవాణా శాఖ కొరడా ఝళిపించింది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు ఎక్కడి బస్సులను అక్కడే నిలిపేశారు. మరోవైపు కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదై స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్న 50 బస్సులను అధికారులు సీజ్ చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు నిలిచిపోయాయి. అదనపు బస్సులు వేయని ఆర్టీసీ ప్రైవేట్ బస్సులపై దాడుల నేపథ్యంలో వంద బస్సులు అదనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆర్టీసీ.. ఏఒక్క రూట్లోనూ ఒక్క బస్సునూ వేయలేదు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు.. బస్సుల కొరతను సాకుగా చూపి చార్జీలను రెట్టింపు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చార్జీలు భారమైనా ప్రైవేట్ బస్సులనే ఆశ్రయించాల్సి వస్తోంది. నిలిచిపోయిన అరుణాచల్ సర్వీసులు 300 ఆర్టీఏ సీజ్ చేసిన బస్సులు 50 -
ప్చ్....చార్జీలు పెంచినా...
⇒ ఆర్టీసీని వెంటాడుతున్న నష్టాలు ⇒ గతేడాది జూన్‌లో చార్జీలు పెంచినా మారని పరిస్థితి ⇒ జనవరి నాటికి రూ.506.67 కోట్లుగా నమోదు సాక్షి, హైదరాబాద్: నష్టాల నుంచి కొద్దోగొప్పో గట్టేందుకంటూ గతేడాది ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినా పరిస్థితి మాత్రం మారలేదు. తాజాగా జనవరి నెల నష్టాలు చూసి అధికారులే నివ్వెరపోవాల్సి వచ్చింది. ఆ ఒక్క నెలలోనే ఏకంగా రూ.67.89 కోట్ల నష్టాలు నమోదైనట్టు తేలింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి నష్టాల మొత్తం రూ.506.67 కోట్లకు చేరింది. గతేడాది జనవరి నెలలో నష్టాలు రూ.41.53 కోట్లు నమోదుకాగా, ఈసారి రూ.26 కోట్ల మేర అదనంగా నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కంటే ఈసారి నష్టాలు ఎక్కువే ఉంటాయని ముందస్తు అంచనాకొచ్చిన ఆర్టీసీ యాజమాన్యం.. అవి రూ.900 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలల నష్టాలు మాత్రమే జోడించాల్సిన తరుణంలో.. ఆ మొత్తం రూ.506 కోట్ల వద్దే ఉండటం కాస్త ఊరట కలిగిస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ మొత్తానికి మరో రూ.100 కోట్ల వరకు నష్టాలు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆదాయం ఎటు పోతోంది..? గతేడాది జూన్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలను స్వల్పంగా పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో 5 శాతం, ఇతర కేటగిరీ బస్సుల్లో 10 శాతం పెంచింది. ఈ రూపంలో వార్షికంగా రూ.286 కోట్ల మేర అదనపు ఆదాయం నమోదవుతుందని ప్రకటించింది. ఆ ప్రకారం నష్టాలు తగ్గాలి. గతేడాది జనవరి నాటికి రూ.545.87 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. జూన్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చినందున.. ఆరు నెలల కాలానికి కనీసం రూ.145 కోట్లు అదనపు ఆదాయం రావాల్సి ఉంది. ఆ లెక్కన ఈ ఏడాది జనవరి నాటికి నష్టాలు రూ.400 కోట్ల వద్దే ఆగిపోవాల్సి ఉన్నా.. రూ.506 కోట్లకు చేరుకున్నాయి. ఉద్యోగులకు వేతన సవరణ జరిగినందున వాటి పెండింగ్ బకాయిలను చెల్లిస్తుం డటంతో కొత్త చార్జీల ద్వారా రావాల్సిన ఆదాయం కనిపించటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వేతన బకాయిలకు గాను ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక విడత మాత్రమే చెల్లించారు. అది కూడా రూ.80 కోట్లకే పరిమితమైంది. ఆ మొత్తాన్ని కలిపి చూసినా మరో రూ.60 కోట్ల అదనపు ఆదాయం ఉంటుంది. అదీ కనిపించటం లేదు. -
ఇష్టా రాజ్యం
♦ పండగకు బస్ చార్జీల బాదుడు ♦ రవాణాశాఖ మంత్రి హామీ నీటి మూటలే ♦ ప్రైవేటు బస్సుల్లో 200 శాతం పెంపు ♦ ఆర్టీసీలో 50శాతం అదనం ♦ హడలిపోతున్న ప్రయాణికులు పండగలకు ప్రయాణమంటేనే సామాన్య ప్రజలు హడలెత్తిపోతున్నారు. సంక్రాంతి పండగకు ఆర్టీసీ చార్జీలు పెంచబోమని సాక్షాత్తు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. అరుుతే మంత్రి హామీ ప్రకటనలకే పరిమితమైంది. ప్రైవేటు బస్సుల యజమానులు సాధారణ టికెట్‌పై 200 శాతం అదనంగా చార్జీని పెంచేశారు. మేము ఏమి తక్కువ కాదన్న చందంగా ఆర్టీసీ సాధారణ టికెట్‌పై స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా 50 శాతం పెంచేసింది. నెల్లూరు(టౌన్): పండగకు బస్సు చార్జీలు అమాంతంగా పెరగడంతో దూర ప్రాంతాల నుం చి జిల్లాకు వచ్చే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉపాధి కో సం సుదూర ప్రాంతాలకు వెళ్లి సంపాందించుకున్న మొత్తంలో కొంత మొత్తం బస్ టికెట్లకు పోతుందని పలువురు ప్ర యాణికులు వాపోతున్నారు. ఇతర ప్రాం తాల నుంచి నెల్లూరుకు ఈ నెల 10 నుం చి 12 తేదీ వరకు, మళ్లీ నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాలకు 15 నుంచి 17వ తేదీ వరకు ప్రయాణానికి డిమాండ్ ఉంటుంది.ఇప్పటికే ఆయా ప్రాంతాలకు బస్సులు సీట్లు ఫుల్ అరుునట్లు చెబుతున్నారు. నెల్లూరు నుంచి ప్రైవేటు బస్సులు సుమారు 70కు పైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ తిరుగుతుంటారుు. వీటితో పాటు విజయవాడ, గుంటూరు, వైజాగ్ నుంచి చెన్నై, బెంగళూరులకు పదుల సంఖ్యలో బస్సులు ప్రయాణికులను చేరవేస్తుంటారుు. జిల్లా నుంచి ఉద్యోగం, వ్యాపారం, బతుకుదెరువు కోసం ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రధాన పండగలకు సొం త గ్రామాలుకు రావడం పరిపాటిగా మా రింది. అరుుతే సంక్రాంతి మూడు రోజులు పండగ కావడంతో ప్రతి ఒక్కరూ సొంత ఊరికి రావాలన్న ఆశను ప్రైవేటు, ఆర్టీసీ యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నారుు. ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సులు ఏసీ, స్లీపర్ పేరుతో సాధారణ టికెట్‌పై అదనంగా 200శాతం చార్జీలు పెంచగా, ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో టికెట్‌పై అదనంగా 50శాతం చార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి అడ్డంగా దోచేసుకుంటున్నారనే ఆరోపణలున్నారుు. చోద్యం చూస్తున్న అధికారులు ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు పెంచిన టికెట్ ధరలను ఆన్లైన్లో ఉంచినా చర్యలు తీసుకోవాల్సిన రవాణా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నారుు. కాంట్రాక్టు పద్ధతిన పర్మిట్ పొందిన ప్రైవేటు యాజమాన్యం స్టేజి క్యారేజీలుగా తిరుగుతున్నా చర్యలు నామమాత్రంగా ఉన్నారుు. నెలవారి అందుతున్న ముడుపులు కారణంగానే మిన్నకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నారుు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే అధికశాతం ప్రైవే టు బస్సులను నడుపుతుండటంతో వాటి జోలికి వెళితే ఎలాంటి పరిస్ధితి ఎదుర్కొవాల్సి వస్తుందొనన్న భయంతో మామూళ్లతో సరిపుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నారుు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అధిక చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. మార్గదర్శకాలు రావాల్సి ఉంది ఇటీవలే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో సమావేశం నిర్వహించి వారికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. కమిషనర్ నుంచి మాకు కూడా గైడ్లైన్స రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే వాటి ప్రకారం చర్యలు తీసుకుంటాం. నాలుగు రోజులక్రితం ప్రైవేటు బస్సులపై తనిఖీలు నిర్వహించి 30 కేసులు నమోదు చేశాం. - ఎన్.శివరాంప్రసాద్,ఉపరవాణా కమిషనర్, రవాణాశాఖ -
నిలువు దోపిడీ!
►ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యం ►ప్రయాణికులపై అదనపు బాదుడు ►సంక్రాంతి నేపథ్యంలో బస్ చార్జీల పెంపు ►ఒక్కో టికెట్‌పై రూ.400 నుంచి రూ.800 వరకు దోపిడీ ►చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ప్రత్తిపాడు: ప్రయాణికులను నిలువునా దోచుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ టిక్కెట్ల ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసిన నిర్వాహకులు అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్నారు. అధికార యంత్రాంగం కళ్లు తెరవకపోవడంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడక తప్పడం లేదు. ఒక్కో టిక్కెట్‌పై అదనంగా వందల రూపాయలు వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు. సాధారణ రోజుల్లో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ బస్సుకు ఫేర్ రూ.450, ఏసీ బస్సుకు రూ.500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.850 ఉంటుంది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్ఏసీ రూ.400, ఏసీ రూ.500, స్లీపర్ ఏసీ 800 రూపాయలు టికెట్ ధర ఉంటుంది. కానీ సంక్రాంతి నేపథ్యంలో ఈ టిక్కెట్ వెలను ఆయా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. ఒక్కో టిక్కెట్‌పై అదనంగా రూ. 400 నుంచి రూ.1000 వరకు రేటును పెంచేశాయి. ఆయా ట్రావెల్స్ వారి ఆన్లైన్ వెబ్సైట్లలో పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నాయి. హై ‘ధర’.. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు ప్రస్తుతం ఉన్న టిక్కెట్ ధరలు, సంక్రాంతికి ముందుకు, సంక్రాంతి తరువాత ఉన్న టిక్కెట్ ధరల వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి.. ఒక్కో ట్రావెల్స్ ఒక్కో రకంగా వారి వారి ధరలను కొంచెం అటు ఇటుగా ఇదే విధంగా నిర్ణయించాయి. పట్టించుకోని ప్రభుత్వం.. రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు స్వగ్రామాల నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన వారూ ఉంటారు. తెలుగునాట పెద్ద పండుగైన సంక్రాంతికి స్వగ్రామాలకు రావడం సహజం. దీంతో సంక్రాంతి సమయంలో సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలకు సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు పయనమయ్యే అవకాశాలు ఉండటంతో ట్రావెల్స్ యాజపమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. వీకెండ్ పేరిట ‘ప్రత్యేక’ దోపిడీ.. సంక్రాంతి, దీపావళి వంటి పెద్ద పండుగల సందర్భంలోనే కాకుండా ప్రతి వీకెండ్లోనూ బస్ ఫేర్‌లో తేడా ఉంటోంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు శని, ఆదివారాల్లో సెలవు కావడంతో ఇళ్లకు వస్తుంటారు. శుక్రవారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని స్వగ్రామాలకు బయలుదేరతారు. రెండు రోజులు గడిపి ఆదివారం రాత్రికి పని ప్రదేశాలకు తిరుగుపయనమవుతారు. దీనిని అదనుగా తీసుకుని శుక్రవారం హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్ ఫేర్‌ను, ఆదివారం ఆయా నగరాలకు వెళ్లే సర్వీసుల టికెట్ ధరలు రూ.200 నుంచి రూ.400 పెంచేస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రయాణికులు ఆయా రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు దోచుకుంటున్నా అధికార యంత్రాంగం కిక్కురుమనడం లేదు. -
ఏపీలో ఎంత పెంచితే అంత పెంచుదాం!
బస్సు చార్జీలపై ప్రభుత్వానికి నివేదించనున్న టీఎస్ఆర్టీసీ * 12 శాతం నుంచి 15 శాతం మధ్య పెరిగే అవకాశం? * వేతన సవరణ భారం నుంచి బయటపడేందుకు మేధోమథనం * ఉన్నతాధికారులతో ఉదయం నుంచి రాత్రి వరకు జేఎండీ మంతనాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బస్సు చార్జీలను ఎంత పెంచితే తెలంగాణలో కూడా అంత పెంచాలని టీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించబోతోంది. గతేడాదితో పోల్చితే నష్టాలు తగ్గినప్పటికీ, ఇటీవల ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచడం టీఎస్ఆర్టీసీకి భారంగా మారింది. జూలై నెలలో పుష్కరాల రూపంలో రూ.30 కోట్లు అదనపు ఆదాయం సమకూరినప్పటికీ వేతనాల పెంపు కారణంగా ఇంకా రూ.32 కోట్ల నష్టంలోనే ఉండిపోయింది. ఇక ప్రతినెలా ఇదే పరిస్థితి ఎదరుకానుండడంతో బస్సు ఛార్జీల పెంపు తప్పదని అధికారులు నిర్ణయానికొచ్చారు. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోన్న ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అక్కడ 12 నుంచి 15 శాతం వరకు చార్జీలు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీలో ఛార్జీలు ఎంత పెంచితే తెలంగాణలో కూడా అంత పెంచాలని టీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. చార్జీల పెంపులో తేడాలు ఉంటే రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు చార్జీలలో తేడాలు ఉండి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపులో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, ఆ తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. ఓఆర్ 70 శాతం ఉండాలి: అధికారులకు జేఎండీ ఆదేశాలు ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో జేఎండీ రమణరావు ఈడీలు, ఆర్ఎంలతో మేథోమథన సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ సమావేశంలో అధికారులకు కొన్ని ఆదేశాలు ఇవ్వడంతోపాటు వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరించారు. ఇకనుంచి ప్రతినెలా పరిస్థితిని సమీక్షించేందుకు ఈ తరహా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సామాజిక అవసరంగా పల్లెవెలుగు బస్సులు నిర్వహిస్తున్నందున వాటి నుంచి వచ్చే నష్టాలను ఎక్స్‌ప్రెస్, డీలక్స్, లగ్జరీ తదితర ఇతర రకాల బస్సుల ద్వారా సర్దుబాటు చేయాలని జేఎండీ పేర్కొన్నారు. ఇందుకోసం ఆ కేటగిరీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 70 శాతానికి తగ్గకుండా కచ్చితంగా చూడాలని ఆదేశించారు. అంతకంటే తక్కువ ఓఆర్ ఉన్న మార్గాలను గుర్తించి వెంటనే సమీక్షించి ఎలాంటి మార్పుచేర్పులు చేస్తే అవి 70 శాతంపైకి చేరుతాయో గుర్తించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. అతి తక్కువ ఓఆర్ ఉన్న సర్వీసులను వేరే చోటకు మళ్లించాలన్నారు. ఇంధన వృథాను అరికట్టి ఇతర ఖర్చులను నియంత్రించాలని పేర్కొన్నారు. కనీస భారం రూ.410 కోట్లు... టీఎస్ఆర్టీసీ పరిధిలో నిత్యం రూ.9.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఏడాదికి ఈ మొత్తం రూ.3,420 కోట్లు. జరుగుతున్న ప్రచారం ప్రకారం 12 శాతం చార్జీలు పెంచితే ప్రజలపై రూ.410 కోట్ల మేర భారం పడుతుంది. ఆదే 15 శాతం పెంచితే ఆ మొత్తం ఇంకా పెరుగుతుంది. ఇదిలాఉండగా, పల్లె వెలుగును పెంపునుంచి మినహాయించాలని దాదాపు నిర్ణయించారు. -
రూ. 1 తగ్గింది !
సగటున 5 శాతం మాత్రమే తగ్గిన బస్సు ఛార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలు ఇంతకంటే తగ్గించడం కుదరదన్న మంత్రి బెంగళూరు:రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థలోని నాలుగు విభాగాల బస్ చార్జీలను తగ్గిస్తూ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన బస్సు చార్జీలు అమలు కానున్నాయి. సగటున 5 శాతం కంటే తక్కువగా ఈ తగ్గింపు ఉండడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. ధరలు పెంచే సమయంలో గరిష్టంగా 20 శాతం పెంచే ప్రభుత్వం తగ్గింపులో మాత్రం ఉదారస్వభావాన్ని కనబరచకపోవడాన్ని రవాణాశాఖ అధికారులు తప్పుబడుతున్నారు. ఛార్జీల తగ్గింపు ధరలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి మీడియాకు వివరించారు. బీఎంటీసీ సంస్థలో మొదటి స్టేజ్‌కు రూ.1, అటుపై 9,12,13, 16,17,18, 19,22,23 స్టేజ్‌లకు రూపాయి చొప్పున టికెట్టు ధరలు తగ్గాయి. అంటే రెండు నుంచి ఎనిమిది స్టేజీల మధ్య ఎటువంటి తగ్గింపు లేదు. కేఎస్ఆర్టీసీ, ఎన్‌డబ్యూకేఆర్టీసీ, ఎన్ఈకేఆర్టీసీ విభాగాల్లోని ఆర్డినరీ సర్వీసుల్లో సబ్స్టేజ్ 2 (2ఎస్) రెండు రూపాయల తగ్గింపు. 4,6,7,8,12,13,14,15,16,17 స్టేజీలకు రూ.1 తగ్గించారు. సిటీ/సబ్-అర్బన్ సర్వీసుల్లో 1,2,13 స్టేజీలకు రూపాయి తగ్గించారు. స్టేజీ 3కు రెండు రూపాయలు తగ్గించారు. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కనిష్టంగా రూ.1 గరిష్టంగా రూ.11 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలవారి, వికలాంగులు, వృద్ధులు తదితర పాసు ధరల్లో మార్పులేదు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ధరలను తగ్గించామని, ఇంతకు మించి ఎక్కువ తగ్గించలేమని మంత్రి స్పష్టం చేశారు. -
మంత్రి ఇంట్లోకి చొరబాటు యత్నం
బెంగళూరు, న్యూస్‌లైన్ : బీఎంటీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర రవాణా ఖాఖ మంత్రి రామలింగారెడ్డి ఇంటి ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. బస్సు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆదివారం ఉదయం శాంతి నగర వాసులు లక్కసంద్రలోని మంత్రి రామలింగారెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. వందలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతకూ మంత్రి బయటకు రాకపోవడంతో అసహనానికి గురైన ఆందోళన కారులు మంత్రి ఇంటిలో చొరబడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 150 మందిని అరెస్ట్ చేసి, వాహనాల్లో ఆడుగోడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. -
విద్యుత్ షాక్
యూనిట్‌కు సగటున 32 పైసలు వడ్డన ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి ‘వ్యవసాయ పంపు సెట్లు, భాగ్య జ్యోతి, కుటీర జ్యోతి’కి మినహాయింపు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇటీవల బస్సు చార్జీల పెంపుతో సతమతమవుతున్న ప్రజలకు కర్ణాటక విద్యుత్ నియంత్రణ సంఘం (కేఈఆర్సీ) పెద్ద షాక్‌నిచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా విద్యుత్ చార్జీలు పెంచింది. సగటున యూనిట్‌కు 32 పైసల వంతున పెరిగింది. కేఈఆర్సీ చైర్మన్ ఎంఆర్. శ్రీనివాసమూర్తి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి యూనిట్‌కు పది పైసల నుంచి 50 పైసలు వరకు పెరిగినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం ఐదు విద్యుత్ సరఫరా కంపెనీల (ఎస్కాంలు) పరిధిలో చార్జీలు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ పంపు సెట్లతో పాటు భాగ్య జ్యోతి, కుటీర జ్యోతి పథకాలకు ఈ చార్జీల పెంపు వర్తించబోదని చెప్పారు. యూనిట్‌కు 66 పైసల వంతున పెంచాలని ఎస్కాంలు ప్రతిపాదించాయని తెలిపారు. వాటి ఖర్చులను దృష్టిలో ఉంచుకుని సగటున 32 పైసలు వంతున పెంచడానికి అనుమతినిచ్చామని చెప్పారు. గృహ వినియోగ కరెంటు చార్జీలను 30 యూనిట్ల వరకు 20 పైసలు వంతున పెంచామన్నారు. 30 యూనిట్లు పైబడితే 30 పైసలు చొప్పున పెంచినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 30 యూనిట్ల వరకు రూ.2.70 చొప్పున, 30 నుంచి వంద యూనిట్ల వరకు రూ.4, అంతకు మించితే రూ.6.25 చొప్పున చార్జీలుంటాయని వివరించారు. బెంగళూరు, మైసూరు, మంగళూరు, గుల్బర్గ, హుబ్లీ విద్యుత్ సరఫరా కంపెనీలు రూ.1,229 కోట్ల నష్టాల్లో ఉన్నందున, చార్జీల పెంపు అనివార్యమైందని తెలిపారు. కాగా పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు యూనిట్‌కు 30 నుంచి 40 పైసల వంతున పెంచామన్నారు. అపార్ట్మెంట్లకు ప్రస్తుతం రూ.4.70గా ఉన్న చార్జీని రూ.5.35కి పెంచినట్లు తెలిపారు. కాగా రాష్ట్రంలో 10 హెచ్‌పీ కలిగిన 21 లక్షల పంపు సెట్లు, 22 లక్షల భాగ్య జ్యోతి, కుటీర జ్యోతి కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. వీటికి ఏటా రూ.5,381 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. -
‘టో(తో)ల్’ తీస్తున్నారు
సాక్షి, బెంగళూరు : అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ సంస్థలు ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచేస్తూ ప్రజల తోలు తీస్తున్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొన్న బీఎంటీసీ, నిన్న కేఎస్ఆర్టీసీ బస్ చార్జీలు పెంచేసి ప్రజలపై పెను భారాన్నే మోపాయి. ఇంకా ఈ పెంపు భారం నుంచి నగర వాసులు తేరుకోక ముందే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఉన్న టోల్గేట్ చార్జీలను కూడా రాత్రికి రాత్రే పెంచేశారు. దేవనహళ్లి ప్రాంతంలో ఉన్న టోల్‌గేట్‌ను నవయుగ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం రాత్రికి రాత్రే ఆ సంస్థ టోల్గేట్ చార్జీలను సుమారు మూడు రెట్లు పెంచేసింది. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్యాక్సీలు నడిపే డ్రైవర్లు శనివారం రాత్రి నుంచే టోల్గేట్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ మార్గంలో సంచరించే ట్యాక్సీలు టోల్గా రూ.30 చెల్లిస్తుండగా ఈ మొత్తాన్ని మూడు రెట్లు పెంచడంతో ఒకసారి టోల్ ఫీజ్గా దాదాపు రూ.115 వరకు చెల్లించాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. ప్రభుత్వానికి ‘ధరల పెంపు’ రోగం ... రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ‘ధరల పెంపు’ అనే రోగం పట్టుకుందని కన్నడ చళువలి వాటాల్ పార్టీ వ్యవస్థాపకుడు వాటాల్ నాగరాజ్ విమర్శించారు. బీఎంటీసీ, కేఎస్ ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ శనివారమిక్కడి మైసూరు బ్యాంక్ సర్కిల్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంటెద్దు బండిపై ప్రయాణిస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు. రవాణా సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిరోధించి తద్వారా రవాణా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం అలా కాకుండా ప్రజలపై భారాన్ని మోపుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యను మరింత పెంచేలా బస్సు చార్జీలను కూడా పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
బాదేశారు
చార్జీలు పెంచిన కేఎస్ ఆర్టీసీ .. సామాన్యులపైనే వడ్డన అర్ధరాత్రి నుంచే అమల్లోకి ఏడాదికి రూ.123.87 కోట్ల ఆదాయం ‘వోల్వో, రాజహంస’ చార్జీలు యథాతథం సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో బస్సు చార్జీలు మళ్లీ పెంచారు. దీంతో బస్సు ప్రయాణం మరింత భారం కానుంది. కేఎస్ ఆర్టీసీతో పాటు వాయువ్య, ఈశాన్య విభాగాలకు చెందిన బస్సుల్లో టికెట్టు చార్జీలను 7.96 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ సర్వీసుల్లో ఈ పెంపు 7.66 శాతంగా ఉంది. ఈ చార్జీల పెరుగుదల శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ పెంపు వోల్వో, రాజహంస సర్వీసులకు వర్తించదు. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం సగటున నెలకు లీటరు డీజిల్‌పై 60 పైసలు పెంచుకుంటూ పోతోందని.. దీని వల్ల ఏడాదికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై రూ. 105.05 కోట్ల భారం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా జీతభత్యాలు, నిర్వహణ వ్యయం ఏడాదికి రూ.207.82 కోట్లు పెరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల సంస్థ మనుగడ కొనసాగించాలనే ఉద్దేశంతో విధిలేని పరిస్థితుల్లో చార్జీలు పెంచుతున్నట్లు కేఎస్ ఆర్టీసీ అధికారులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తాజాగా టికెట్టు చార్జీలు పెంచడం వల్ల ఏడాదికి రూ.123.87 కోట్ల ఆదాయం రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బీఎంటీసీ చార్జీలు పెంచి బాదేశారు పదిహేను రోజుల కూడా కాకుండానే ప్రభుత్వం కేఎస్ ఆర్టీసీ చార్జీలనూ పెంచింది. దీంతో అటు సిటీ సర్వీసులతో పాటు దూరప్రాంతాల ప్రయాణం కూడా మరింత ‘ప్రియం’ కానుంది. -
2013లో బెంబేలెత్తించిన ధరలు
కూర‘గాయాలు’ కూరగాయాల ధరలు చుక్కల్ని అంటడంతో ఈ ఏడాది వినియోగదారులు సర్దుకుపోవాల్సి వచ్చింది. కిలో కూరగాయలు కొనే బదులు పావుకిలోతో సరిపెట్టుకున్నారు. ఒక దశలో కూరగాయలకంటే మాంసం తినడమే సులువు అనిపించింది. సంవత్సరం మొదట్లో కిలోకు రూ.15 ఉన్న టమాట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రూ.70, వంకా య రూ.15 నుంచి రూ. 40, బెండ రూ.20 నుంచి 40, మిర్చి రూ.20 నుంచి 80, బీర రూ.25 నుంచి రూ. 40, క్యాబేజీ రూ.20 నుంచి రూ.35, క్యారెట్ రూ.24 నుంచి రూ. 60కి ఎగబాకింది. అయితే ఏడాది చివర డిసెంబర్లో కొంత తగ్గుముఖం పట్టాయి. కన్నీరు పెట్టించిన ఉల్లి ఉల్లి జనాన్ని కంటతడి పెట్టించింది. అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్ర దిగుమతుల పనే ఎక్కువగా ఆధారపడడంతో ఒక్కసారిగా ఉల్లి రేటు పెరిగిపోయింది. మరోవపు ఉద్యమ సెగలతో రవాణా వ్యవస్థకు కూడా ఆటంకం ఏర్పడుతుండడంతో వ్యాపారులు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ. 30 నుంచి ఒక దశలో రూ.70 వరకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది .పెట్రోల్, డీజిల్ దడ జనవరిలో లీటరు డీజిల్ ధర రూ.50.23 ఉండగా ప్రస్తుతం రూ. 57.97 చేరుకుంది. రూ.7.74 అదనంగా పెరగడంతో ట్రాన్స్పోర్ట్ రంగంపై పెనుభారం పడింది. నిత్యావసర సరుకుల రవాణా చార్జీలు పెరిగిపోవడంతో పరోక్షంగా సామాన్యుడిపై భారం పడింది. జిల్లాలో రోజుకు 2.20లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ఈ లెక్కన రోజుకు రూ.18లక్షల అదనపు భారం పడింది. జిల్లావ్యాప్తంగా సుమారు 120 వరకు పెట్రోలియం ఔట్‌లెట్లున్నాయి. జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.72 ఉండగా.. ప్రస్తుతం రూ.78.20కి చేరుకుంది. అంటే లీటరుకు ఏకంగా రూ.6 పెరిగింది. జిల్లాలో రోజుకు 1లక్ష 20 వేల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. పెరిగిన ధరతో రోజుకు రూ.7లక్షల 20వేల అదనపు భారం ప్రజలు మోయాల్సి వచ్చింది. బస్సు భారం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ కూడా బస్ చార్జీలను పెంచేసింది. రెండుసార్లు ఆర్టీసీ అధికారులు చార్జీలను పెంచారు. విద్యార్థుల బస్సు పాస్‌ల చార్జీలు కూడా పెంచడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. 2012 సెప్టెంబర్ 24న సాధారణ చార్జీలను 9.5 శాతం పెంచారు. జిల్లా ప్రజలపై రోజుకు రూ.5 లక్షల చొప్పున అదనపు భారం మోయాల్సి వచ్చింది. తద్వారా ఏడాదికి కోట్ల భారం ప్రజలపై పడింది. సర్‌చార్జీల పిడుగు సర్‌చార్జీల పేరుతో సర్కారు విద్యుత్ వినియోగదారులపై పెను భారమే మోపింది. బడ్డీ కొట్టు నుంచి మొదలుకుంటే పరిశ్రమల వరకు అన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ భారం పడింది. స్లాబులు విభజించి సాధారణంగా 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారిని కూడా ప్రభుత్వం విడిచిపెట్టకుండా చార్జీలను పెంచేసింది. 2013 సంవత్సరంలో జిల్లా ప్రజలపై అదనంగా సుమారు రూ.200 కోట్ల భారం పడింది. కోతల కారణంగా పరిశ్రమల యజమానులు ఇక్కట్లు పడ్డారు. పీక్ సమయాల్లో ఎవరైనా విద్యుత్ వినియోగానికి పూనుకుంటే వారికి 3 రేట్ల అపరాధ రుసుం విధించారు. గత వేసవిలో చిన్న చిన్న పరిశ్రమలు దాదాపుగా మూతబడ్డాయి. గ్యాస్ మంటలు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆధార్ తప్పనిసరి చేయడంతో సబ్సిడీ సిలిండర్‌కు మొదట వినియోగదారుడు పూర్తిస్థాయిలో ధర చెల్లించాల్సి వచ్చింది. గ్యాస్ సిలిండర్లకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ బ్యాంకులో జమ అవుతోంది. ప్రస్తుతం రూ.1,107లకు సబ్సిడీ సిలిండర్ ధర పెరిగింది. రూ.633 సబ్సిడీ బ్యాంకులో జమ అవుతోంది. కాగా ఆధార్ సీడింగ్ కాని వినియోగదారులకు రూ.419కి సిలిండర్ లభిస్తుంది. ఆధార్ సీడింగ్, సీడింగ్ కాని వినియోగదారులకు మధ్య రూ.60కి పైగా వ్యత్యాసం రావడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3 లక్షలకు పైగా సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా సబ్సిడీ సిలిండర్లను 9కి మాత్రమే పరిమితం చేయడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండర్లపై వినియోగదారుడికి పెను భారం పడుతోంది. అదనంగా తీసుకునే సిలిండర్లకు సుమారు రూ.700 వ్యత్యాసం ఉండటం గమనార్హం. బియ్యం, నూనెలతో కంగారు పేదలకు అందుబాటులో ఉండే పామాయిల్ కూడా కంగారు పెట్టించింది. ప్రస్తుతం కిలో రూ.65కు లభ్యం అవుతున్నా.. నిన్న మొన్నటి దాకా రూ.88 పలకడంతో సామాన్యులు విలవిల్లాడిపోయారు. ఇక వేరుశెనగ నూనె అయితే ఏకంగా రూ.110 వరకు చేరింది. బియ్యం ధర గుబులు పెట్టిస్తోంది. ఈ ఏడాది మొదట్లో రూ.3,800 నుంచి క్రమంగా క్వింటాలు బియ్యం ధర రూ.5 వేలకు చేరాయి. పాల ధర కూడా... ఈ ఏడాది లీటరు పాల ధర రెండు రూపాయల చొప్పున పెంచారు. సరాసరిన రోజుకు వేల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విధంగా లక్షల రూపాయల భారం ప్రజలపై పడింది.