ఆర్టీసీ గల్లాపెట్టె గలగల | 12 Crore Revenue Got To TSRTC After Increasing Bus Fare | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ గల్లాపెట్టె గలగల

Published Thu, Dec 12 2019 1:48 AM | Last Updated on Thu, Dec 12 2019 1:49 AM

12 Crore Revenue Got To TSRTC After Increasing Bus Fare - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచుతూ కొత్త చార్జీలను అమలులోకి తెచ్చిన వారంలోనే రూ.12 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది. వాస్తవానికి ఈ మొత్తం ఇంకా ఎక్కువుండాల్సి ఉంది. నెల రోజులు గడిస్తే ఈ పెరుగుదల మరింత మెరుగ్గా ఉంటుందని అధికారులు అంటున్నారు. నగరంలో మాత్రం పెం పు ఫలితం అనూహ్యంగా ఉంది. 22 శాతం వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేయగా, అది 25 శాతాన్ని మించుతోంది.

రాష్ట్రం మొత్తంగా చూస్తే 15 శాతంగా ఉంది. నెల తర్వాత ఈ సగటు 22 శాతానికి పెరుగుతుందని అంచనా. నగరంలో ప్రధాన డిపోలకు రోజువారీ అదనపు ఆదాయం రూ.4 లక్షలు, చిన్న డిపోల్లో రూ.2 లక్షలుగా ఉంది. ఆర్టీసీ సగటు రోజువారీ ఆదాయం రూ.10.20 కోట్లు. వారం రోజుల సగ టు రూ.11.70 కోట్లుగా నమోదైంది.    

38 కుటుంబాలకు ‘కారుణ్య’ లబ్ధి
సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు అమలు చేయటంలో అధికారులు రి కార్డు సృష్టించారు. నిర్ణయం తీసుకున్న వారంలోనే అన్ని కు టుంబాలకు ఆ లబ్ధి కలిగించారు. సమ్మె కాలంలో 38 మంది  ఉద్యోగులు చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్ర మంలో తొలుత 25 కుటుంబాలకు, ఆపై మిగతా కుటుంబా లకు కారుణ్య నియామకాల కింద లబ్ధి చేకూర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement