బెంగళూరు, న్యూస్‌లైన్ : బీఎంటీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర రవాణా ఖాఖ మంత్రి రామలింగారెడ్డి ఇంటి ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. బస్సు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆదివారం ఉదయం శాంతి నగర వాసులు లక్కసంద్రలోని మంత్రి రామలింగారెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. వందలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతకూ మంత్రి బయటకు రాకపోవడంతో అసహనానికి గురైన ఆందోళన కారులు మంత్రి ఇంటిలో చొరబడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 150 మందిని అరెస్ట్ చేసి, వాహనాల్లో ఆడుగోడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
మంత్రి ఇంట్లోకి చొరబాటు యత్నం
Published Mon, May 26 2014 2:49 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement