ఆధార్ కార్డు జీవితంలో ఒక భాగమైపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ప్రభుత్వ పథకాలను అప్లై చేయడానికి ఇలా.. అన్నింటికీ ఆధార్ అవసరమవుతోంది. ఆధార్ నమోదు సమయంలోనే వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్, ఐరీష్ అన్నింటినీ రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి వేలి ముద్ర వేయగానే మన డీటైల్స్ అన్నీ తెలిసిపోతాయి.
వేలి ముద్ర వేయగానే అన్ని వివరాలు తెలిసిపోతుండటం వల్ల, సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు.
ఆధార్ బయోమెట్రిక్ లాక్ & అన్‌లాక్
➤యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అభివృద్ధి చేసిన 'ఎంఆధార్' (mAadhaar) మొబైల్ యాప్‌లో ఆధార్ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం ఒక వ్యక్తి ఆధార్ వివరాలను మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా యాడ్ చేసుకోవచ్చు.
➤యూఐడీఏఐ ఎంఆధార్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత.. యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
➤ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.
➤ఓటీపీ ఉపయోగించి లాగిన్ అయిన తరువాత మీకు 'ఎంఆధార్'ను యాక్సెస్ చేసుకోవడానికి ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు.
➤ఎంఆధార్ యాప్‌ను యాక్సెస్ చేసిన తరువాత ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.
➤అయితే ఇప్పుడు బయోమెట్రిక్ లాక్ లేదా అన్‌లాక్ కోసం ఓ ప్రత్యేకమైన ఫీచర్ కనిపిస్తుంది. ఆధార్ లాక్ చేయడానికి 'బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆధార్ లాక్ అవుతుంది.
➤అన్‌లాక్ చేయడానికి బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేస్తే.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది.
ఆధార్ లాక్ వల్ల ఉపయోగాలు
వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పడకుండా ఉండటానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఉపయోగపడుతుంది. దీంతో మీరు మోసాలకు బలికాకుండా ఉండవచ్చు.
ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment