సాక్షి, అమరావతి: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్‌లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్‌ఎంఎస్/హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావాదేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్‌ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్‌ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎఫ్‌ఎంఎస్ /హెర్బ్ అప్లికేషన్స్‌లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్ ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
ఉద్యోగులకు చెల్లింపుల్లో రెండంచెల భద్రత
Published Thu, Jan 12 2023 3:56 AM | Last Updated on Thu, Jan 12 2023 3:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment