
బిహార్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సాధరణంగా అడ్మిషన్ పొందేందుకో లేక ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కోసమే కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటాం. అయితే జంతవుల కోసం దరఖాస్తు చేయడం గురించి ఇప్పటి వరకు విని ఉండం కదా. కానీ ఇక్కడ ఓ కుక్కకి కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశాడు ఒక అపరిచిత వ్యక్తి. దీన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు అధికారులు.
వివరాల్లోకెల్తే..బిహార్‌లోని గయాలో కుల ధృవీకరణ పత్రం కోసం విచిత్రమైన దరఖాస్తు వచ్చింది. టామీ అనే కుక్కకి కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. అంతేగాదు ఆశ్చర్యపోకండి ఈ టామీకి ఆధార్‌కార్డు కూడా ఉంది అంటూ ఓ ఆధార్ కార్డ్‌ని కూడా జత చేశారు. అందులో టామీ తండ్రి పేరు గిన్ని, పుట్టిన తేది ఏప్రిల్ 14, 2022 అని ఉంది. చిరునామ పందేపోఖర్, పంచాయతీ రౌనా వార్డు నంబర్ 13, గురారు సర్కిల్ అని ఉంది.
పైగా ఆ ఆధార్ కార్డుపై 'ఆమ్ కుత్తా కా అధికారం' అని రాసి ఉంది. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు గురారు సర్కిల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దరఖాస్తుపై పేర్కొన్న ఫోన్ నెంబరు ట్రూకాలర్‌లో రాజబాబు అని చూపుతుందని చెప్పారు. ఐతే అధికారులు ఈ విచిత్ర సంఘటనతో కంగుతిన్నారు. ఈ వికృత చేష్టల వెనుక ఉన్న దుండగలను పట్టుకోవడం కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
(చదవండి: అర్థరాత్రి రెండు గంటలకు దాడులు..భయాందోళనలో చిన్నారి పెళ్లికూతుళ్లు..)
Comments
Please login to add a commentAdd a comment