విద్యార్థుల కోసం ఆధార్‌ క్యాంపులు | Aadhaar camps for students Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విద్యార్థుల కోసం ఆధార్‌ క్యాంపులు

Published Tue, Feb 7 2023 3:34 AM | Last Updated on Tue, Feb 7 2023 3:34 AM

Aadhaar camps for students Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు ఆధార్‌ కార్డుల్లో బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవా­రం నుంచి 4రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 1,485 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలలో ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల నుంచి నిర్వహించనుంది. కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా  ఆధార్‌ కార్డులో బయో­మెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకో­వాలని యూఐడీఏఐ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలి­సిందే.

రాష్ట్రంలో పదేళ్ల వ్యవధిలో ఒక్కసారి కూడా తమ ఆధార్‌ కార్డులో బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌  చేసుకోనివారు దాదాపు 80 లక్షల మంది ఉన్నట్టు అధికారులు పేర్కొంటు­న్నా­రు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రతినెలా ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడానికి అవకాశం కల్పి­స్తోంది.

ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ 15 ఏళ్లలోపు వ­యసు కలిగిన విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తూ వచ్చింది. ఈ నెలలో 15నుంచి 17 ఏళ్ల వయసులోపు విద్యార్థులకు జూని­యర్‌ కాలేజీల్లో క్యాంపులు నిర్వహిస్తోంది.

సచి­వా­ల­యాల్లో నిర్వహించే ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల్లో ఆధార్‌ కార్డులో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ సేవ­లను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్ణీత రుసుం­తో అదనంగా మరో 10 రకాల ఆధార్‌ సేవ­లను పొందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బయో­మె­­ట్రిక్‌ (ఫొటో, ఐరిస్, ఫింగర్‌ ప్రింట్‌) అప్‌డేట్, పేరు మార్పు, పుట్టిన తేదీ వివరాల మార్పు, జెండర్, చిరునామా మార్పు సేవలతో పాటు కొత్తగా ఆధార్‌ వివరాల నమోదు, ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ సేవలను కూడా ఆ క్యాంపుల్లో పొందవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement