
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఈ నెల 30 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజులు పాటు ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ ఈ క్యాంపులు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది.
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ ఆధార్ కార్డులో తమ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి దాకా ఆధార్ వివరాలు అసలు నమోదు చేసుకోని పాఠశాలల విద్యార్థులు ఈ క్యాంపులో తమ వివరాలు పూర్తి ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment