కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో అనేక ఆర్థిక సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్‌పీఎస్) లాగిన్ అయ్యే విధానంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అన్ని అకౌంట్‌లు ఆధార్‌తో లింక్ అవుతున్న తరుణంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ).. ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్‌ను ప్రవేశపెట్టింది. దాంతో పాత విధానంలోకాకుండా కొత్త పద్ధతిలో ఎన్‌పీఎస్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఎలా లాగిన్ చేయాలంటే..
ఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌లో పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్‌ఏఎన్)/ ఇంటర్నెట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐపీఐఎన్)తో లాగిన్ కావాలి. తర్వాత పీఆర్‌ఏఎన్/ ఐపీఐఎన్ టాబ్‌పై క్లిక్ చేయాలి. ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద ఉండే క్యాప్చా కోడ్‌ను టైప్ చేయాలి. తర్వాత తెరుచుకునే విండోలో ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే ఎన్‌పీఎస్ ఖాతా ఓపెన్ అవుతుంది.
ఇదీ చదవండి: ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం
Comments
Please login to add a commentAdd a comment