ఆధార్ నెంబర్ల వెరిఫికేషన్‌ను ప్రైవేట్ సంస్థలకు అనుమతించాలన్న ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గడువుని ఇప్పుడు మరో 15 రోజుల పొడిగించింది. గతంలో ఈ గడువు 2023 మే 05 వరకు మాత్రమే ఉండేది, కాగా ఇప్పుడు ఇప్పుడు మే 20 వరకు పొడిగించారు.
ఇప్పటికే ఆధార్‌ను ప్రామాణీకరించడానికి ప్రభుత్వేతర రాష్ట్ర సంస్థలను అనుమతించే ప్రతిపాదన కోసం ఒక ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. దీనిపైన ప్రజల అభిప్రాయాలను తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఇతర సంస్థలు కొన్ని సందర్భాల్లో ఆధార్ ప్రామాణీకరణ కోసం అనుమతిని పొందవచ్చు. ఇది వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆధార్ ప్రామాణీకరణ కోసం కోరుతున్న ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ శాఖ ఒప్పించినట్లయితే, అటువంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఈ ప్రతిపాదనపై కొంత మంది నిపుణులు, న్యాయవాదులు గతంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది వినియోగదారులను మోసాలకు గురించి చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
(ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు)
రాష్ట్ర సంక్షేమం, నిజమైన గ్రహీతలను గుర్తించడానికి ఆధార్ నంబర్‌లను ఉపయోగించగలిగినప్పటికీ, ప్రైవేట్ సంస్థలు అలాంటి ధృవీకరణను నిర్వహించలేవని ఒక తీర్పులో పేర్కొంది. అయితే దీనిపైన ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment