ఆధునిక కాలంలో ఆధార్ కార్డు మనిషి జీవితంలో భాగమైపోయింది. ప్రస్తుతం ఆధార్ కార్డు లేకుండా ఏ ముఖ్యమైన పని జరగదనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి పనికి ఆధార్ నంబర్ కచ్చితంగా కావాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. లోన్స్ తీసుకోవాలన్నా.. ఆధార్ కార్డే ఆధారం.
భారతదేశంలో ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డుని జారీ చేస్తుంది. 2022 నవంబర్ 30 నాటికి 135 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో ప్రైవేటు కంపెనీలకు కూడా ఆధార్ అథెంటికేషన్ అప్పగించాలని చూస్తోంది. ఆధార్ అథెంటికేషన్ సేవలు ప్రభుత్వ రంగ సంస్థలు, మంత్రిత్వ శాఖల పరిధిలో మాత్రమే ఉన్నాయి. అయితే వాటి పరిధిని విస్తరించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: రిటర్నులు సమర్పించడంతోనే అయిపోదు - తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు తెలుసుకోండి..)
ఆధార్‌ను ప్రజలకు మరింత అనువైనదిగా, అనుకూలమైనదిగా మార్చడానికి మాత్రమే కాకుండా మరింత మెరుగైన సేవలు అందించడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కావున ఆధార్ అథెంటికేషన్ ప్రైవేటు చేతుల్లోకి కూడా వెళ్లనుంది.
(ఇదీ చదవండి: Kumar Mangalam Birla: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని)
ప్రభుత్వ విభాగాలు అందించే ప్రయోజనాలు, సేవలు, రాయితీల కోసం ఆధార్ అథెంటికేషన్ నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలను అనుమతిచేలా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈ సేవలను పొందాలనుకునే ప్రైవేటు సంస్థలు దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి ముందుగానే అనుమతులు తీసుకోవాలి. కేంద్రం అనుమతి పొందిన తరువాత మాత్రమే ఆధార్ అథెంటికేషన్ చేసేందుకు అర్హత పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment