
దేశంలోనే పిన్న వయస్కురాలిగా రికార్డు
నస్పూర్: దేశంలోనే ఆధార్‌కార్డు కలిగిన పిన్న వయసు్కరాలిగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఐజల్ ఫాతిమా రికార్డు సృష్టించింది. నస్పూర్ కాలనీలో నివసించే సింగరేణి ఉద్యోగి మహ్మద్ అఫ్జల్ పాషా, సమీరా తబస్సుమ్ దంపతులకు.. ఈ ఏడాది జనవరి 12న ఐజల్ ఫాతిమా జన్మించింది. చిన్నారికి ఫిబ్రవరి 21న ఆధార్ కార్డు మంజూరైంది.
దేశంలో జన్మించిన 40 రోజులకే ఆధార్‌కార్డు పొందిన తొలి వ్యక్తిగా ఐజల్ ఫాతిమా గుర్తింపు పొందినట్లు.. మహ్మద్ అఫ్జల్ పాషా తెలిపారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తమ కుమార్తె చోటు సాధించినట్లు ఆ సంస్థ నిర్వాహకులు సోమవారం తెలియజేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇదే రికార్డు.. పుట్టిన 43 రోజులకు ఆధార్ కార్డు పొందిన నిజామాబాద్ జిల్లా వాసి ఆద్య పేరిట నమోదైందన్నారు.