ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు, ఇతర పత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మన దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇది ఒక గుర్తింపు రుజువు పత్రంగా పనిచేస్తుంది. ఇందులో పౌరుల సమాచారం బయోమెట్రిక్ రూపంలో ఉంటుంది. ఇలాంటి, ఆధార్ కార్డులో మన వివరాలు సరిగా ఉండాలి. లేకపోతే గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, స్కాలర్ షిప్, వివిద పథకాలకు అనర్హులం అవుతాము.
ప్రజల కష్టాలను గుర్తించిన యుఐడీఏఐ తమ చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటి విషయాలతో పాటు ఇతర వివరాలను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే, మీ ఆధార్ కార్డులో వివరాలను మార్చడానికి కొన్ని షరతులు పెట్టింది. ఎప్పుడు పడితే అప్పుడు ఆధార్ వివరాలను మార్చకుండా ఉండటానికి కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ పై ఉన్న పేరును ఎన్నిసార్లు మార్చవచ్చు?
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఒక యూజర్ ఆధార్ కార్డుపై తమ పేరును జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. అంతకన్న ఎక్కువ సార్లు, మార్చుకునే అవకాశం లేదు.
ఆధార్ పై పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చవచ్చు?
యుఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం.. ఆధార్ కార్డుపై మీ పుట్టిన తేదీని ఎన్నడూ మార్చలేమని గుర్తుంచుకోవాలి. డేటా ఎంట్రీ సమయంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే పుట్టిన తేదీని మార్చడానికి గల ఏకైక మార్గం.
ఆధార్ పై చిరునామా, లింగాన్ని ఎన్నిసార్లు మార్చవచ్చు?
యుఐడిఎఐ మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డుపై చిరునామాను, లింగాన్ని ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు.
ఆధార్ కార్డులో పేరు, లింగం లేదా పుట్టిన తేదీని పరిమితికి మించి మార్పులు చేయాలనుకుంటే ఆధార్ కార్డుదారుడు యుఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఈ వివరాలను మార్చడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
(చదవండి: ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్‌డేట్ చేయండి?)
Comments
Please login to add a commentAdd a comment