DOB
-
ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎన్ని సార్లు మార్చవచ్చో తెలుసా?
ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు, ఇతర పత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మన దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇది ఒక గుర్తింపు రుజువు పత్రంగా పనిచేస్తుంది. ఇందులో పౌరుల సమాచారం బయోమెట్రిక్ రూపంలో ఉంటుంది. ఇలాంటి, ఆధార్ కార్డులో మన వివరాలు సరిగా ఉండాలి. లేకపోతే గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, స్కాలర్ షిప్, వివిద పథకాలకు అనర్హులం అవుతాము. ప్రజల కష్టాలను గుర్తించిన యుఐడీఏఐ తమ చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటి విషయాలతో పాటు ఇతర వివరాలను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే, మీ ఆధార్ కార్డులో వివరాలను మార్చడానికి కొన్ని షరతులు పెట్టింది. ఎప్పుడు పడితే అప్పుడు ఆధార్ వివరాలను మార్చకుండా ఉండటానికి కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ పై ఉన్న పేరును ఎన్నిసార్లు మార్చవచ్చు? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఒక యూజర్ ఆధార్ కార్డుపై తమ పేరును జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. అంతకన్న ఎక్కువ సార్లు, మార్చుకునే అవకాశం లేదు. ఆధార్ పై పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చవచ్చు? యుఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం.. ఆధార్ కార్డుపై మీ పుట్టిన తేదీని ఎన్నడూ మార్చలేమని గుర్తుంచుకోవాలి. డేటా ఎంట్రీ సమయంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే పుట్టిన తేదీని మార్చడానికి గల ఏకైక మార్గం. ఆధార్ పై చిరునామా, లింగాన్ని ఎన్నిసార్లు మార్చవచ్చు? యుఐడిఎఐ మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డుపై చిరునామాను, లింగాన్ని ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు. ఆధార్ కార్డులో పేరు, లింగం లేదా పుట్టిన తేదీని పరిమితికి మించి మార్పులు చేయాలనుకుంటే ఆధార్ కార్డుదారుడు యుఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఈ వివరాలను మార్చడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. (చదవండి: ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్డేట్ చేయండి?) -
మరో ఆధార్ నిర్వాకం: గ్రామస్తుల గగ్గోలు
ఆధార్ కార్డ్ జారీలో జరిగిన నిర్వాకం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకవైపు ఆధార్ కార్డ్ గోప్యతపై అందోళనలు కొనసాగుతుండగానే ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఒకే గ్రామంలోని 800 మందికి ఒకే పుట్టిన తేదీతో ఆధార్ కార్డ్ జారీ కావడంతో గ్రామస్తులు విస్తుపోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామ ప్రజలకు ఇటీవల జారీ చేసిన కొత్త ఆధార్ కార్డుల్లో 8వందలమందికిపైగా గ్రామస్తులకు పుట్టిన రోజు జనవరి 1 అని నమోదైంది. ఈ వ్యవహారంపై గ్రామస్తులు మండిపడితున్నారు. ఆధార్ కార్డ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందుతామని అధికారులు చెప్పారు. కానీ దీంట్లో ప్రత్యేకమైనది ఏమిటి? అని అల్ఫాదీన్ ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయిన నేపథ్యంలో తాజా వివాదంతో వాటిని నష్టపోతామని గ్రామస్తులు భయపడుతున్నారని డిప్యూటీ గ్రామ పంచాయితీ అధికారి మొహమ్మద్ ఇమ్రాన్ తెలిపారు. అయితే ఈ తప్పిదాన్ని గుర్తించడానికి నిరాకరించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇది సాంకేతిక తప్పిదమని చెబుతోంది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే పుట్టిన తేదీ తెలిసిన వారు, ధ్రువీకరణ పత్రాలు తీసుకుని అందుబాటులో ఉన్నఆధార్ కేంద్రాల ద్వారా అప్డేట్ చేసుకునే వీలుందని యూఐడీఏఐ తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై హరిద్వార్ డివిజినల్ మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందనీ, కారణాలపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ఆగస్టులో కూడా ఆగ్రా చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. గ్రామంలోని అందరి డేట్ఆఫ్బర్త్ జనవరి 1గా నమోదైందని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. కాగా ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ కచ్చితంగా తెలియనివారి వారి పుట్టినతేదీ జనవరి 1గా నమోదవుతుందని మేలో యూఐడీఏఐ ప్రకటించడం గమనార్హం. -
'ప్రధానికి చదువు లేకపోయినా ఫర్వాలేదు.. కానీ'
న్యూఢిల్లీ: తక్షణమే ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టిరోజు వివాదంపై వివరణ ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. భారతదేశ ప్రధాన మంత్రి కార్యాలయానికి విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు. పుట్టిన రోజును నిర్ధారణ చేసుకోవడానికి హై స్కూల్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి సర్టిఫికెటన్లను ప్రధాని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. చదువు రాని ప్రధాన మంత్రి అయినా మాకు ఫర్వాలేదు, కానీ ప్రధాన మంత్రి తన విద్యార్హత, పుట్టిన తేదీ విషయంలో నిజాయితీగా లేకపోతే మాత్రం మేము సహించేది లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మోదీకి రెండు పుట్టినరోజులున్నాయని ఇందులో ఏది సరైందో ఆయనే చెప్పాలని గత కొంతకాలంగా మోదీపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. విస్‌నగర్‌లోని ఎమ్మెన్ కాలేజీ రికార్డుల్లో మోదీ పుట్టిన రోజు ఆగస్టు 29, 1949 అని నమోదై ఉండగా, ప్రధాని అధికారిక వెబ్సైట్లో మాత్రం సెప్టెంబర్ 17, 1950 ఉండటంలో తీవ్రవిమర్శలు వెల్లువెత్తాయి. PM must immediately clarify the controversy about his birth date. Credibility of the office of the Ptime Minister of India is at stake. — digvijaya singh (@digvijaya_28) May 2, 2016 Why doesn't he release his mark sheet of High School/Higher Secondary/ Graduation to confirm his birth date ? — digvijaya singh (@digvijaya_28) May 2, 2016 We don't mind an illiterate PM but we do mind if the Prime Minister can't be honest about his educational qualification or his birth date — digvijaya singh (@digvijaya_28) May 2, 2016