సాధారణంగా మనం ఆధార్ కార్డుపై పేరు సరిగా లేదని, తప్పుగా ఉందనే కారణంతో మార్పులు చేసుకుంటుంటాం. అయితే తాజాగా ఆధార్ కార్డు సరిగా లేనందున ఓ బాలికకు స్కూల్ అడ్మిషన్ దక్కలేదు. అదేంటి ఇందుకేనా అని అనుకోకుండి.. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఈ విచిత్ర ఘటన యూపీలోని బుద్వాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం బిల్సీ తహసీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేష్ తన కుమార్తె ఆర్తిని చేర్పించేందుకు ప్రాథమిక పాఠశాలకు చేరుకున్నాడు.
ఆ పాఠశాల నిబంధన ప్రకారం ఆధార్ కార్డు ఉంటేనే పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వాలని అందులోని టీచర్ దినేశ్‌కు చెప్పింది. దీంతో అతని పాప ఆధార్ కార్డు వారికి ఇవ్వగా అది చూసి ఆ టీచర్ షాక్ అయ్యింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆధారు కార్డుపై ‘మధు కా పాంచ్వా బచ్చా’ ఇంగ్లీష్‌లో ‘బేబీ ఫైవ్ ఆఫ్ మధు’ అని రాసి ఉంది. పైగా ఆ కార్డుకు ఎటువంటి ఆధార్ నెంబర్ కూడా లేదు. దీంతో ఆధార్ కార్డును తప్పుగా ఉందని, అది సరిచేయాలని టీచర్ దినేష్‌కు చెప్పి వెనక్కు పంపింది.
ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దీపా రంజన్ మాట్లాడుతూ.. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్ కార్డులు తయారు చేస్తున్నామని, వారి నిర్లక్ష్యంగా కారణంగానే ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. ఇకపై వీటికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సూచించమని అన్నారు. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment