ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మరోసారి పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మరో మూడు నెలలు గడువు ఇచ్చింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఇదిలాఉండగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఆధార్‌ను తీసుకొచ్చి చాలా ఏళ్లు అయింది. అయితే ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. ఈ-ఆధార్ అంటే ఏమిటి, అది ఎలా ఓపెన్ అవుతుంది, పాస్‌వర్డ్ ఏమిటి... వంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ కొందరికి జవాబులు తెలియకపోవచ్చు. అందుకే ‘సాక్షి’ ఆధ్వర్యంలో సంబంధిత అధికారితో మాట్లాడి మీ అనుమానాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కార్యం మొదలైంది. అయితే మీ ప్రశ్నలను info@sakshi.com కు పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించే ప్రశ్నలకు మన ‘సాక్షి బిజినెస్’లోనే శనివారం సమాధానాలిస్తాం.
ఉదాహరణకు..
- ఆధార్ ఎందుకు అప్‌డేట్ చేసుకోవాలి?
- ఆధార్ అప్‌డేట్ ఎలా చేసుకోవాలి?
- ఆధార్ అప్‌డేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది?
- ఆధార్ అప్‌డేషన్‌కు ఏ డాక్యుమెంట్లు అవసరం?
- ఆధార్ అప్‌డేషన్‌కు ముందే ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి?
- ఎవరెవరు అర్హులు? ఎవరు కాదు?
- వర్చువల్ ఆధార్ అంటే ఏమిటి?
- ఆధార్ కార్డు ఏ ముఖ్యమైన అంశాలకు లింకవుతుంది?
- ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలి?
- చిన్న పిల్లలకు వయస్సు పరిమితులేమిటి?
- బ్యాంక్ ఖాతా, పాన్, ఇతర సేవలను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా?
- బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, పాన్, ఇతర సేవలకోసం ఆధార్‌తో ఎందుకు ధ్రువీకరించాలి?
- అపరిచితులకు మన ఆధార్ నంబర్ తెలిస్తే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా?
మీకు ఎదురైన, మీరు అడగాలనుకుంటున్న ఆధార్‌కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలనైనా info@sakshi.com కు పంపి సమధానాలు పొందగలరు.
ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’
Comments
Please login to add a commentAdd a comment