ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్‌ తరహా వెరిఫికేషన్‌.. కానీ.. | Passport-Like Verfication For New Aadhaar Card - Sakshi
Sakshi News home page

ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్‌ తరహా వెరిఫికేషన్‌.. కానీ..

Published Sat, Dec 23 2023 11:48 AM | Last Updated on Sat, Dec 23 2023 1:30 PM

Verfication Like Passport For New Aadhaar Card - Sakshi

కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకునేవారిని పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వెరిఫికేషన్ మాదిరే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై  చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఆధార్ ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించిన ఏ అంశాన్నైనా యూఐడీఏఐ నిర్వహిస్తోంది. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌‌‌‌ను యూఐడీఏఐకి బదులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్‌ కేంద్రాల్లోకి వెళ్లి ఈ సర్వీస్‌ పొందొచ్చు.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో  వెరిఫికేషన్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ను పూర్తి చేసే ముందు అన్ని ఆధార్ అప్లికేషన్లలోని డేటాను క్వాలిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సబ్‌‌‌‌డివిజన్‌‌‌‌ మేజిస్ట్రేట్‌ ఈ వెరిఫికేషన్ విధానాన్ని పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తే 180 రోజుల్లో ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డును ఇష్యూ చేస్తారు.

ఇదీ చదవండి: ఫోన్‌పే క్రెడిట్‌సెక్షన్‌, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..!

తాజాగా యూఏడీఏఐ తీసుకొచ్చిన మార్పులపై సంస్థ లక్నో రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్‌‌‌‌ కుమార్ సింగ్ స్పందించారు. ఒక్కసారి ఆధార్ కార్డు ఇష్యూ అయితే ఆ తర్వాత  ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే  యథావిధిగా పాత పద్ధతినే పాటించాలన్నారు. కానీ ఇప్పటివరకు ఆధార్‌ కార్డు తీసుకోనివారు మాత్రం ఈ కొత్త విధానాన్ని అనుసరించాలని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement