సాక్షి, అమరావతి: పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూ టీ డైరెక్టర్ ప్రభాకరన్ ఆదేశాలు జారీ చేశారు.
వయసును బట్టి దరఖాస్తు ఫారం
► ఐదేళ్లలోపు పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డుల జారీ లేదా ఆధార్‌లో వారి వివరాల అప్‌డేట్ చేసేందుకు ఒక రకమైన దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
► ఐదు ఏళ్లకు పైబడి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వేరే దరఖాస్తు ఫారం నమూనాను యూఐడీఏఐ సంస్థ విడుదల చేసింది.
► 18 ఏళ్ల పైబడిన వారికి మరో ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుందని పేర్కొంది.
► ఈ మేరకు మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను యూఐడీఏఐ తాజాగా జారీ చేసిన ఆదేశాలతో పాటే విడుదల చేసింది.
► ఈ నెల 15వ తేదీ నుంచి ఈ మూడు రకాల దరఖాస్తు ఫారాల విధానం అమలులోకి రాగా.. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
పిల్లల ఆధార్ నమోదుకు కొత్త నిబంధన.. యూఐడీఏఐ ఆదేశాలు జారీ
Published Sun, Feb 19 2023 4:54 AM | Last Updated on Sun, Feb 19 2023 10:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment