సూరి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆధార్ కార్డుతో పనిలేకుండానే సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. బిర్భూమ్ జిల్లా సూరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడారు. ‘జాగ్రత్తంగా ఉండండి. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌లోని చాలా జిల్లాల్లో ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉచిత రేషన్, లక్షీభండార్ వంటి పథకాలను ప్రజలకు అందకుండా చేసేందుకు ఇలాంటి చర్యలకు దిగుతోంది.
ఆధార్ లేదనే కారణంతో పథకాలను ప్రజలకు అందకుండా నిలిపివేయవద్దని అధికారులను ఆదేశించాను. బెంగాల్ ప్రజలు భయపడొద్దు. మీకు అండగా నేనున్నాను’ అన్నారు. ఆధార్ కార్డుల తొలగింపు వెనుక కుట్ర ఉందని తెలిస్తే ఒక్క కూడా దాన్ని లింక్ చేయడానికి అనుమతించబోనన్నారు. ఆధార్ కార్డులు తొలగించిన వారి వివరాలతో పోర్టల్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డులు లేని కారణంగా బ్యాంకులు లావాదేవీలను నిరాకరించినట్లయితే సహకార బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సేవలను వాడుకోవాలని ప్రజలకు ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment