Aadhaar card update: ఆధార్ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. | Aadhaar card update UIDAI extends last date for free update | Sakshi

Aadhaar card update: ఆధార్ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌..

Sep 7 2023 3:56 PM | Updated on Sep 7 2023 4:45 PM

Aadhaar card update UIDAI extends last date for free update - Sakshi

Aadhaar card free update: ఆధార్ (Aadhaar) కార్డుల్లో తప్పులుంటే ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గడువును పొడిగించింది. ఇందుకు సంబంధించిన డా​క్యుమెంట్లను ఫ్రీగా అప్‌డేట్‌ చేసేందుకు విధించిన సెప్టెంబర్ 14తో ముగియనుండగా.. ఇప్పుడు దానిని మరో 3 నెలలు అంటే డిసెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది.

ఈ మేరకు యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘వీలైనంత ఎక్కువ మంది ఆధార్‌లో తమ డాక్యుమెంట్లు అప్‌డేట్‌ చేసుకునేలా ప్రోత్సహించడానికి సెప్టెంబర్ 14 వరకు మై ఆధార్‌ (myAadhaar) పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్‌లో డాక్యుమెంట్లు అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించాం. 

(పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్‌లో పడుతుందా?)

దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సదుపాయాన్ని మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు పొడిగించాలని నిర్ణయించాం. https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫ్రీగా డాక్యుమెంట్ అప్‌డేట్ చేసుకోవచ్చు’ అని యూఐడీఏఐ పేర్కొంది. అలాగే ఆధార్‌ కార్డు పొంది పదేళ్లు దాటిపోయినవారు కూడా అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement