India's laptop import ban not effective immediately; check this details - Sakshi
Sakshi News home page

Laptop Import Norms: ల్యాప్‌టాప్ దిగుమతి నిబంధనలకు సమయం ఉంది - ఇదిగో క్లారిటీ!

Published Fri, Aug 4 2023 9:16 PM | Last Updated on Sat, Aug 5 2023 9:59 AM

India laptop import ban not effective immediately check this details - Sakshi

Laptop Import Norms: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్‌లు, అల్ట్రా స్మాల్ కంప్యూటర్‌ల దిగుమతిపై విధించిన ఆంక్షలు వెంటనే అమలులోకి రావని, వీటిని అమలు చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్‌..
తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం, రవాణాలో ఉన్న లేదా ఇప్పటికే ఆర్డర్ చేసిన షిప్‌మెంట్‌లను దృష్టిలో ఉంచుకుని, ఈ పరివర్తన వ్యవధి ఎంత వరకు ఉంటుందనేది ఖచ్చితంగా త్వరలోనే వెల్లడవుతుంది కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' ఒక ట్వీట్‌లో తెలిపారు.

ఐటి హార్డ్‌వేర్ కోసం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) స్కీమ్ కింద దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగానే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతికి ప్రభుత్వం గురువారం లైసెన్సింగ్ అవసరమని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. వీరికి తిరుగులేదండోయ్!

చైనా, కొరియా నుంచి ఈ వస్తువుల దిగుమతులను తగ్గించడానికి కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే మన దేశంలో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లను అమ్మకానికి తీసుకురావాలని యోచిస్తున్న కంపెనీలు తమ ఇన్‌బౌండ్ షిప్‌మెంట్‌ల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందటం తప్పనిసరి.

ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ ప్రకారం, ఏడు రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై HSN కోడ్ 8471 కింద పరిమితులు విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంక్షలు విధించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని, ప్రాథమికంగా మన పౌరుల భద్రత పూర్తిగా రక్షించబడటానికని ఒక అధికారి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement