DGFT
-
దేశంలో తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్.. త్వరలో కార్యకలాపాలు
దేశీయంగా తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్ ( E-Commerce Export Hub) ఈ ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసేందుకు అయిదు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.ఢిల్లీలో లాజిస్టిక్స్ అగ్రిగేటర్ షిప్‌రాకెట్, ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్ సంస్థ కార్గో సర్వీస్ సెంటర్; బెంగళూరులో డీహెచ్ఎల్, లెక్స్షిప్; ముంబైలో గ్లోగ్లోకల్ ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ హబ్‌ల నిర్వహణ విధి విధానాలను రూపొందించడంపై వాణిజ్య, ఆదాయ విభాగాలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) కలిసి పని చేస్తున్నాయని సారంగి చెప్పారు.గేట్‌వే పోర్టుల్లో కస్టమ్స్ పరిశీలన నుంచి మినహాయింపులు, రిటర్నుల కోసం సులభతరమైన రీఇంపోర్ట్ పాలసీ మొదలైన ఫీచర్లు ఈ హబ్‌లలో ఉంటాయి. ఈ–కామర్స్ ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వీటి ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ ఈ–కామర్స్ ఎగుమతులు 5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి వీటిని 100 బిలియన్ డాలర్లకు పెంచుకునే సామర్థ్యాలు ఉన్నాయనే అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ కనెక్ట్ ఈ-ప్లాట్‌ఫామ్ రెండవ దశను ప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కృషి చేస్తోందని సారంగి ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన మొదటి దశ ఎగుమతులు, దిగుమతులపై అవసరమైన సమాచారాన్ని అందించింది. రెండవ దశతో వాణిజ్య వివాదాలకు పరిష్కారం, వాణిజ్య విశ్లేషణలు, విదేశీ మిషన్ల నుండి ఇంటెలిజెన్స్ నివేదికలు, వాణిజ్య ఫైనాన్స్, బీమా ఎంపికలు వంటి అదనపు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఏప్రిల్ 1 నుంచి డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ మరోవైపు డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ (DIA) పథకం ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికలను కూడా డీజీఎఫ్టీ వెల్లడించింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ స్కీమ్ నిర్దిష్ట పరిమితి వరకు కట్, పాలిష్ చేసిన వజ్రాలను సుంకం-రహిత దిగుమతికి అనుమతిస్తుంది. వజ్రాల ప్రాసెసింగ్, విలువ జోడింపునకు భారత్‌ను కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్ అర్హతగల ఎగుమతిదారులు గత మూడు సంవత్సరాల నుండి వారి సగటు టర్నోవర్‌లో 5 శాతం వరకు 10 శాతం విలువ జోడింపు అవసరంతో వజ్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. -
ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం చైనా నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 300 బిలియన్ డాలర్లుగా ఉంటే, భారత్‌నుంచి కేవలం 5 బిలియన్ డాలర్లే ఉన్నట్టు వెల్లడించారు. కనుక రానున్న సంవత్సరాల్లో భారత్ నుంచి ఈ–కామర్స్ ఎగుమతులను 50–100 బిలియన్ డాలర్లకు చేర్చే సామర్థ్యాలున్నట్టు వివరించారు. టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్, రత్నాభరణాల వంటి వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను (ఎఫ్ఎంజీ) సమీకరించే సామర్థ్యం ఉన్న కంపెనీలు ఈ–కామర్స్ ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను సమీకరించే చక్కని నెట్వర్క్, లాజిస్టిక్స్ సదుపాయాలు, గోదాముల వసతులు అవసరమన్నారు. ఈ కామర్స్ ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించగా.. త్వరలో ఆయా కంపెనీలతో డీజీఎఫ్టీ సమావేశం కానున్నట్టు చెప్పారు. 4–5 రోజుల్లో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ‘‘ఏ అగ్రిగేటర్ అయినా లేదా సంస్థ.. ఫాస్ట్ మూవింగ్ ఈ–కామర్స్ గూడ్స్ అయిన టెక్స్టైల్స్, రత్నాభరణాలు, చేనేత ఉత్పత్తులు, ఆయు‹Ù, వెల్నెస్ ఉత్పత్తులను డిమాండ్‌కు అనుగుణంగా డెలివరీ చేయగలిగే సామర్థ్యాలు ఉంటే ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు’’అని వివరించారు. ఈ తరహా ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు తగిన సామర్థ్యాలు షిప్‌రాకెట్, డీహెచ్ఎల్ సంస్థలకు ఉన్నట్టు చెప్పారు. -
110 సంస్థలకు అనుమతులు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 110 సంస్థలకు కేంద్రం అనుమతినిచి్చంది. యాపిల్, డెల్, లెనొవొ, హెచ్‌పీ ఇండియా సేల్స్, అసూస్ ఇండియా, ఐబీఎం ఇండియా, షావోమీ టెక్నాలజీ ఇండియా, శాంసంగ్ ఇండియా ఎల్రక్టానిక్స్ మొదలైనవి వీటిలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అనుమతుల కోసం మొత్తం 111 దరఖాస్తులు వచి్చనట్లు వివరించారు. అయితే, ’నిరాకరణ జాబితా’లో ఉన్న ఒక హైదరాబాద్ సంస్థకు మాత్రం అనుమతి లభించలేదని పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్దిష్ట ఐటీ హార్డ్‌వేర్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అనుమతులకు లోబడి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలి్పంచింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆథరైజేషన్ విధానం 2024 సెపె్టంబర్ వరకు అమల్లో ఉంటుంది. అక్టోబర్ 31న పరిశ్రమ వర్గాలతో సమావేశమైన డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. ’నిరాకరణ జాబితా’లో ఉన్న సంస్థలకు అనుమతులు లభించవు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఎగుమతి నిబంధనలను పాటించని సంస్థలు, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి. ఐటీ హార్డ్‌వేర్ సంబంధ దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 8.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు సహా పర్సనల్ కంప్యూటర్లు దిగుమతయ్యాయి. అత్యధికంగా చైనా (5.11 బిలియన్ డాలర్లు), సింగపూర్ (1.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (807 మిలియన్ డాలర్లు) నుంచి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులు దిగుమతవుతున్నాయి. -
ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు
న్యూఢిల్లీ: బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. నేపాల్, మలేషియా, ఫిలిప్పైన్స్, సీషెల్స్, కామెరూన్, ఐవొరీ కోస్ట్, రిపబ్లిక్ ఆఫ్ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిమాణాల్లో ఎగుమతి చేయవచ్చని సూచించింది. నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు దేశాలకు 10,34,800 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని పేర్కొంది. నేపాల్‌కు 95,000 టన్నులు, కామెరూన్‌కు 1,90,000 టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1,42,000, రిపబ్లిక్ ఆఫ్ గినియాకు 1,42,000, మలేíÙయాకు 1,70,000, ఫిలిప్పైన్స్కు 2,95,000 టన్నుల తెల్లబియ్యం ఎగుమతులకు అనుమతి మంజూరు చేసింది. యూఏఈ, సింగపూర్ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. -
నవంబర్ నుంచి కంప్యూటర్లపై ఆంక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీల దిగుమతులపై విధించిన ఆంక్షల అమలును మూడు నెలలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఎల్రక్టానిక్స్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలంటే నవంబర్ 1 నుంచి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి. కాగా, లైసెన్స్ కలిగిన కంపెనీలు మాత్రమే ఈ పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఉత్తర్వులు వెంటనే అమలులోకి తీసుకువస్తున్నట్టు ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కంప్యూటర్లలో అంతర్గత భద్రత లొసుగులతో కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల డేటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో తప్పనిసరి లైసెన్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
ల్యాప్‌టాప్ దిగుమతి నిబంధనలకు సమయం ఉంది - ఇదిగో క్లారిటీ!
Laptop Import Norms: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ కంప్యూటర్ల దిగుమతిపై విధించిన ఆంక్షలు వెంటనే అమలులోకి రావని, వీటిని అమలు చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్.. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం, రవాణాలో ఉన్న లేదా ఇప్పటికే ఆర్డర్ చేసిన షిప్మెంట్లను దృష్టిలో ఉంచుకుని, ఈ పరివర్తన వ్యవధి ఎంత వరకు ఉంటుందనేది ఖచ్చితంగా త్వరలోనే వెల్లడవుతుంది కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' ఒక ట్వీట్లో తెలిపారు. ఐటి హార్డ్‌వేర్ కోసం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) స్కీమ్ కింద దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగానే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి ప్రభుత్వం గురువారం లైసెన్సింగ్ అవసరమని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. వీరికి తిరుగులేదండోయ్! Q: Why has the @GoI_MeitY finalized new norms for import of IT hardware like Laptops, Servers etc? Ans: There will be a transition period for this to be put into effect which will be notified soon. Pls read 👇 https://t.co/u5436EA0IG — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) August 4, 2023 చైనా, కొరియా నుంచి ఈ వస్తువుల దిగుమతులను తగ్గించడానికి కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే మన దేశంలో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను అమ్మకానికి తీసుకురావాలని యోచిస్తున్న కంపెనీలు తమ ఇన్‌బౌండ్ షిప్మెంట్ల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందటం తప్పనిసరి. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ ప్రకారం, ఏడు రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై HSN కోడ్ 8471 కింద పరిమితులు విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంక్షలు విధించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని, ప్రాథమికంగా మన పౌరుల భద్రత పూర్తిగా రక్షించబడటానికని ఒక అధికారి వెల్లడించారు. -
కలర్ టీవీల దిగుమతులపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ: కలర్ టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి! ఎందుకంటే కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా దేశీయ తయారీని ప్రోత్సహించడంతోపాటు.. చైనా నుంచి వచ్చి పడుతున్న నిత్యావసరం కాని వస్తువులకు కళ్లెం వేయడమే కేంద్రం నిర్ణయం వెనుక ఉద్దేశ్యంగా ఉంది. ఇప్పటి వరకు కలర్ టెలివిజన్లను స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) విభాగం ప్రకటన జారీ చేసింది. 32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలోని తెరలు కలిగిన టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి వస్తాయి. నియంత్రణతో ఇకపై వీటిని దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొదాల్సిందే. -
పసిడి ఎగుమతులపై నిషేధం
-
పసిడి ఎగుమతులపై నిషేధం
♦ 22 క్యారెట్ల స్వచ్ఛతపైన ♦ కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 22 క్యారెట్లలోపు స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగల బంగారం ఉత్పత్తులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వపు తాజా నిషేధం బంగారం ఎగమతులపై ప్రభావం చూపబోదని, అంతర్జాతీయ మార్కెట్లో 22 క్యారెట్లపైన స్వచ్ఛతగల బంగారం వస్తువులకు డిమాండ్ చాలా తక్కువగానే ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) వివరించింది. దక్షిణ కొరియా నుంచి దేశంలోకి బంగారం దిగుమతులు బాగా పెరిగాయని దేశీ బంగారు ఆభరణాల వర్తకులు ఆందోళన చెందుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. -
బంగారు ఆభరణాల ఎగుమతులపై నిషేధం
న్యూఢిల్లీ : 22 క్యారెట్ ప్యూరిటీ కలిగిన బంగారు ఆభరణాలు, మెడలియన్స్, ఇతర ఆభరణాల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. బుధవారం జారీచేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. విదేశీ వాణిజ్య పాలసీ(2015-20) సవరణ ప్రకారం 8 క్యారెట్ నుంచి గరిష్టంగా 22 క్యారెట్ వరకు బంగారం కలిగి ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర ఆర్టికల్స్‌ను మాత్రమే దేశీయ టారిఫ్ ఏరియా, ఎక్స్‌పోర్టు ఓరియెంటెడ్ యూనిట్లు, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్కులు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు, బయో టెక్నాలజీ పార్కుల నుంచి ఎగుమతి చేయడానికి అనుమతి ఉంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) చెప్పింది. దీని ప్రకారం 22 క్యారెట్ ప్యూరిటీ కంటే ఎక్కువ మెటల్ కలిగి ఉన్న బంగారం ఆభరణాలు, మెడలియన్స్, ఇతర ఆర్టికల్స్‌ను ఎగుమతి చేయడానికి ఏ ఎగుమతిదారుడికి అనుమతి లేదని పేర్కొంది. కేవలం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు బంగారమున్న ఆభరణాలు షిప్ చేసే ఎగుమతిదారులకు మాత్రమే ప్రోత్సహాకాలు అందుబాటులో ఉంటాయని కూడా డీజీఎఫ్టీ తెలిపింది. కానీ కొంతమంది ఎగుమతిదారులు 22 క్యారెట్ ప్యూరిటీ కలిగిన బంగారు వస్తువులకు కూడా ప్రోత్సహాకాలను అందుకుంటున్నారని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ అధికారులు పేర్కొంటున్నారు. -
నక్క తోలుపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఉన్ని దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్స్, షూ, బెల్ట్స్ వంటి వస్తువుల తయారీకి విరివిగా వినియోగించే నక్క తోలు, మొసలి చర్మాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్ వస్తువుల తయారీ కోసమే జంతువులను యథేచ్ఛగా వధిస్తున్నారన్న వాదనతో ఏకీభవిస్తూ నక్క తోలు, మొసలి చర్మాల దిగుమతిపై నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖలో అంతర్భాగమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) ఈ మేరకు జనవరి 3న నోటిఫికేషన్ జారీచేసింది. మొసలి చర్మంతో తయారయ్యే హ్యాండ్‌బ్యాగులు, షూ, బెల్ట్, పర్స్లాంటి వస్తువులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక నక్క తోలుతో తయారయ్యే ఉన్ని దుస్తుల ధారణ గొప్ప ఫ్యాషన్‌గా కొనసాగుతున్న విషయం విదితమే. విచ్చలవిడిగా సాగుతోన్న జంతువధను, వాటితో తయారయ్యే వస్తువుల వాడకంపై స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ.. ఆందోళనకారులకు మద్దతు పలకడమేకాక, జంతు చర్మాల దిగుమతిపై నిషేధం విధించాలని కోరుతూ వాణిజ్య, పరిశ్రమల శాఖకు పలు మార్లు లేఖలు రాశారు. దీంతో విదేశాల నుంచి వాటి దిగుమతిని డీజీఎఫ్టీ నిషేధించింది. దేశీయంగా ఈ నిషేధం చాలా కాలం నుంచే అమలులోఉంది. -
కాకినాడకు డీజీఎఫ్టీ
భానుగుడి (కాకినాడ) : విదేశీ వస్తువుల దిగుమతులు, స్వదేశీ వస్తువుల ఎగుమతి వంటి వ్యాపార కార్యకలాపాలను కాకినాడ సీపోర్టు నుంచి నిర్వహించేందుకు, విదేశీ వర్తకాన్ని కాకినాడ నుంచి నేరుగా సాగించేందుకు ప్రతిష్టాత్మక డీజీఎఫ్టీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారన్ ట్రేడ్) రీజనల్ కార్యాలయం త్వరలో కాకినాడలో ఏర్పాటుకానున్నటు ఎంపీ తోట నరసింహం తెలిపారు. బుధవారం కాకినాడలో తన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సంస్థ ఏర్పాటుకు సంబం«ధించి విషయాలను వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధీనంలో పనిచేసే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 36 రీజినల్ కార్యాలయాలున్నాయని, కాకినాడ 37వది అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్యాకేజింగ్ స్టాండర్స్‌కు అనుగుణంగా జిల్లా విద్యార్థులకు ప్యాకేజింగ్ రంగంలో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్‌ను, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అధీనంలో పనిచేసే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)ను కాకినాడలో త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 53 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి 70 శాతం నిధులను ప్రభుత్వం సమకూరుస్తుండగా, 30 శాతం స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాయన్నారు. జిల్లాలో వంద పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు దివాన్‌చెరువు గ్రామానికి చెందిన చత్రాతి రామచంద్రుడు మహాలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. రూ.వంద కోట్లతో కాకినాడ సిటీ, పోర్టు రైల్వేస్టేçÙన్ల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపినట్టు ఆయన తెలిపారు.