దాని ప్రకారమే వార్డులు, జీపీల వారీ ఓటరు లిస్ట్ తయారు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను యథావిధిగా పరిగణనలోకి తీసుకొని వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ముసా యిదా ఓటరులిస్టు తయారు చేయాలని అధికారు లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదే శించారు. ముసాయిదా జాబితాలను వచ్చేనెల 6న గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని సూచించా రు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణ పురో గతిపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ ఈసీ) కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్థసారథి సమీక్షించారు.
జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డీపీవో, డీఎల్పీవోలు, అసెంబ్లీ నియో జకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబి తాల ప్రచురణ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాల న్నారు. ఈ ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు జరిగితే వచ్చేనెల 13వ తేదీ వరకు సంబంధిత ఎంపీడీవోలు, డీపీవోలకు రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పారు.
సవరించిన తుది ఓటర్ల జాబితాను వచ్చేనెల 21న ప్రచు రించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లు జీపీ ఓటర్ల జాబితాలో చేర్చు కోవాలన్నా, ఎవరైనా ఓటరును జీపీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలున్నా, వారు నిర్దేశించిన ఫారాలలో సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజి స్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఓటరు జాబితా తయారీ తర్వాత, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితరాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఎస్‌ఈసీ తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్‌ను పార్థసారథి ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment