
సాక్షి, జైపూర్: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహన దారులను బెంబేలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో రికార్డు స్థాయిలనుచేరుతున్నాయి. ఇప్పటికే జైపూర్‌లో పెట్రోలు ధర రూ.100 మార్క్‌ను టచ్ చేసింది. తాజాగా 100 రూపాయలను అధిగమించి వినియోగదారుల గుండెల్లో బాంబు పేల్చింది. వరుసగా 9వ పెంపు నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర బుధవారం (ఫిబ్రవరి 17) రూ .100.13 పలుకుతోంది. డీజిల్ ధర లీటరుకు 92.13 రూపాయలుగా ఉంది. పెట్రోలు ధరకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక ధర. (భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్ ధర)
Comments
Please login to add a commentAdd a comment