వైఎస్సార్ జిల్లా జిల్లా కేంద్రం కడప నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో ఆదివారం రాత్రి దొంగలు ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు.
కడప: వైఎస్సార్ జిల్లా జిల్లా కేంద్రం కడప నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో ఆదివారం రాత్రి దొంగలు ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన దొంగలు మొదట దానిని తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
అది ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ను ఊడబెరికే ప్రయత్నం చేశారు. అదికూడా సాధ్యపడకపోవడంతో పలాయనం చిత్తగించారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు.