ఒక్క ప్రమాదం.. ఆరు కార్లు ధ్వంసం | Six Cars Destroyed In An Accident On Nidamanoor National Highway | Sakshi
Sakshi News home page

ఒక్క ప్రమాదం.. ఆరు కార్లు ధ్వంసం

Published Sun, Apr 10 2022 1:25 PM | Last Updated on Sun, Apr 10 2022 1:56 PM

Six Cars Destroyed In An Accident On Nidamanoor National Highway  - Sakshi

రామవరప్పాడు: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. గన్నవరం నుంచి విజయవాడ వైపుగా వస్తున్న ఓ కారు నిడమానూరు జాతీయ రహదారి వంతెన సమీపంలో వచ్చే సరికి డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో దాని వెనుకగా వస్తున్న 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కార్లను ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పక్కకు తీయించారు.   

(చదవండి: భయంకరమైన యాక్సిడెంట్‌: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement