Sudden Attack
-
ఒక్క ప్రమాదం.. ఆరు కార్లు ధ్వంసం
రామవరప్పాడు: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. గన్నవరం నుంచి విజయవాడ వైపుగా వస్తున్న ఓ కారు నిడమానూరు జాతీయ రహదారి వంతెన సమీపంలో వచ్చే సరికి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుకగా వస్తున్న 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కార్లను ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పక్కకు తీయించారు. (చదవండి: భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు) -
వృద్దురాలిపై సడన్ గా దాడి చేసిన ఆవు
-
మావో పంజా
సాక్షి, హైదరాబాద్/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించిన మావోయిస్టులు ఆకస్మిక దాడి చేసి 17 మంది జవాన్లను బలితీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాలోని చింతగుఫా ఏరియాలో మీన్పా అడవుల్లో నక్సల్ కమాండర్ హీడ్మా, వినోద్, దేవా శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో 250 నుంచి 300 డీఆర్జీ (జిల్లా రిజర్వ్ గార్డులు), ఎస్టీఎఫ్ (స్పెషల్‌టాస్క్‌ఫోర్స్) జవాన్లతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు వారికి తారసపడ్డారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్లో 17 మంది జవాన్లు మరణించగా, 14 మంది గాయపడ్డారు. దాదాపు 8 గంటలపాటు కాల్పులు.. వేసవి రావడంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ ఏడాది కూడా ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా మావోయిస్టుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపులు మొదలుపెట్టారు. చింతగుఫా సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో దాదాపు 300 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు ముగించుకుని తిరిగి వస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య శనివారం మధ్యాహ్నం 12.40 నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 8 గంటలపాటు వందలాది రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో గాయపడ్డ 14 మందిని హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఎన్కౌంటర్ దట్టమైన అటవీ ప్రాంతంలో జరగడం, రాత్రి వరకు కొనసాగడంతో 17 మంది జవాన్ల జాడ తెలియకుండాపోయింది. ఆదివారం డ్రోన్ల సాయంతో గాలించగా.. ఆ 17 మంది విగతజీవులుగా కనిపించారు. అనంతరం బలగాలు ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. అమరులైన జవాన్లు వీరే.. :డీఆర్జీ విభాగం కానిస్టేబుళ్లు హేమంత్‌దాస్, లిబ్రూరాం, సోయం రమేష్, వంజెం నాగేష్, మడకం మాసా, పొడియం లక్మా, మడకం ఇడమా, వంజం నితేంద్రం, అసిస్టెంట్ కానిస్టేబుళ్లు గంధం రమేష్ , ఉయికా కమిలేష్, పొడియం ముత్తా, ఉయికా దుర్బా, ఎస్టీఎఫ్ విభాగం కానిస్టేబుళ్లు సీతారాం రాశ్యా, హేమంత్‌బోయ్, అమర్జిత్ కల్లోజీ, అసిస్టెంట్ కానిస్టేబుళ్లు నారోద్ మితాడ్, మడకం ముచ్చు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లలో మావోలు... బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ధరించిన మావోయిస్టులు భారీ ఆయుధాలతో ఆకస్మికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు అంటున్నారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మావోయిస్టులకు తక్కువ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చనంటున్నారు. వారి ధీరత్వాన్ని మరచిపోం: మోదీ భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన ఘాతుకంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తున్నాను. ఈ దాడిలో అమరవీరులైన భద్రతా బలగాలకు అంజలిఘటిస్తున్నాను. వారు చూపిన ధీరత్వాన్ని ఎన్నటికీ మరచిపోం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. -
అస్సాం రైఫిల్స్‌పై మెరుపుదాడి
కోహిమా: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోయారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అబోయ్ ప్రాంతంలో గస్తీలో ఉన్న ఆరుగురు అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాపుకాసి దాడిచేశారు. దీంతో హవల్దార్ ఫతేసింగ్, సిపాయ్ హుంగ్నాగా కోన్యాక్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. మిగిలిన వారికీ తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయని అస్సాం రైఫిల్స్ పీఆర్వో వెల్లడించారు. గాయపడిన వారికి కోహిమా ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. అయితే ఇది నాగా తిరుగుబాటు దారుల పనేనని భావిస్తున్నారు. జవాన్ల ప్రతిఘటనలోనూ నాగా తిరుగుబాటుదారులు గాయపడి ఉండొచ్చని భావిస్తున్నట్లు పీఆర్వో తెలిపారు. -
ఏసీబీ దాడులు
- నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు - రూ.58,400 సొమ్ము స్వాధీనం నిడదవోలు : నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర, ఇన్స్పెక్టర్ విల్సన్ సిబ్బందితో కలిసి కార్యాలయంలో రిజిస్ట్రేషన్లకు సం బంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న నలుగురు డాక్యుమెంటు లేఖర్లను, సిబ్బందిని విచారించారు. వారి వద్ద ఉన్న రూ.58,400 సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ ఇన్స్పెక్టర్ కరణం రా జేంద్ర విలేకరులకు వివరాలు వెల్లడించారు. కార్యాలయంలో ప్రస్తు తం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా విధులను నిర్వహిస్తున్న ఆర్వీహెచ్ పాం డురంగ విఠల్ వద్ద రూ.15 వేలను, అనధికార లావాదేవీలను నిర్వహిస్తు న్న కలెక్షన్ మెన్ పార్థసారథి అలి యాస్ మోహన్ వద్ద ఉన్న రూ.23 వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు. డాక్యుమెంటు లేఖర్లు ఏసు రత్నం వద్ద రూ.2,224, వెంకట సూర్యప్రసాద్ వద్ద రూ.1,770, చినబాబు వ ద్ద రూ.14,940, విలపర్తి సత్యనారాయణ వద్ద రూ.1,410ను స్వాధీనం చేసుకున్నామని రాజేంద్ర తెలిపారు. 12 రిజిస్ట్రేషన్ చేయని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకు న్నామని చెప్పారు. ఇక్కడి అవినీతిపై పూర్తిస్థారుులో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు! - సెలవులో ఉన్నా కార్యాలయూనికి వచ్చిన సబ్ రిజిస్ట్రార్ - రూ.52 వేలు స్వాధీనం తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న సమాచారం మేరకు కార్యాల యంలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులలో నమో దు చేయకుండా కార్యాలయంలో ఉన్న రూ.52 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి ఆస్తినైనా.. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయినా రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు సమీపంలోని వట్లూరు గ్రామంలో గల 30 ఎకరాల భూమిని ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సంబంధిత వ్యక్తులు వచ్చా రు. ఆ భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఫిర్యాదు అందటంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్త్ను ఆర్.శ్రీనివాసరావు సెలవులో ఉండగా, కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.శేఖర్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన వద్ద రూ.80 మాత్రమే ఉన్నట్టు రికార్డుల్లో నమోదు కాగా, రూ.52 వేల నగదు అదనంగా ఉండటంతో ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సెలవులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు కార్యాల యంలో ఉండటం విశేషం. వట్లూరు భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సెలవులో ఉన్న రిజిస్ట్రార్ పాత్రపై ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయూలంటే ఆర్వోఆర్, అడంగల్, టైటిల్ డీడ్ ఉండాలని, వట్లూరు భూములకు ఎలాంటి దస్తావేజులు లేకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయూల్సి ఉందన్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న శేఖర్‌కు, సిబ్బందికి మధ్య అంతరాలు ఉన్నట్టు తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. రిజి స్ట్రేషన్ చేయించుకునే వారినుంచి మామూళ్ల రూపంలో తీసుకునే మొత్తాలను కిందిస్థారుు సిబ్బందికి పంచని కారణంగా విభేదాలు పెరిగినట్టు తెలుస్తోందన్నారు. సోమవారం 30 రిజిస్ట్రేషన్లు జరిగాయని, వీటి నిమిత్తం రూ.52 వేల రూపాయలు అనామతుగా వచ్చినట్టుగా భావిస్తున్నామన్నారు. మొత్తం సమాచారాన్ని నివేదిక రూపంలో ఏసీబీ డెరైక్టర్ జనరల్‌కు పంపిస్తామని, అక్కడ నుంచి వచ్చే ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని డీఎస్పీ పేర్కొన్నారు. తనిఖీల్లో ఏసీబీ సీఐ యూజె విల్సన్ సిబ్బంది పాల్గొన్నారు. సొమ్ములు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో సొమ్ము చెల్లించాల్సిన పనిలేదని డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎవరైనా సొమ్ము అడిగితే తమను సంప్రదించాలని కోరారు. ఇలాంటి సమాచారం ఉంటే తన నంబర్ 94404 46157 లేదా 94404 46158, సీఐ నంబర్ 94404 46159కు ఫోన్ చేయూలని సూచించారు.