ఏసీబీ దాడులు
- నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
- రూ.58,400 సొమ్ము స్వాధీనం
నిడదవోలు : నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర, ఇన్‌స్పెక్టర్ విల్సన్ సిబ్బందితో కలిసి కార్యాలయంలో రిజిస్ట్రేషన్లకు సం బంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న నలుగురు డాక్యుమెంటు లేఖర్లను, సిబ్బందిని విచారించారు. వారి వద్ద ఉన్న రూ.58,400 సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ ఇన్‌స్పెక్టర్ కరణం రా జేంద్ర విలేకరులకు వివరాలు వెల్లడించారు.
కార్యాలయంలో ప్రస్తు తం ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా విధులను నిర్వహిస్తున్న ఆర్‌వీహెచ్ పాం డురంగ విఠల్ వద్ద రూ.15 వేలను, అనధికార లావాదేవీలను నిర్వహిస్తు న్న కలెక్షన్ మెన్ పార్థసారథి అలి యాస్ మోహన్ వద్ద ఉన్న రూ.23 వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు. డాక్యుమెంటు లేఖర్లు ఏసు రత్నం వద్ద రూ.2,224, వెంకట సూర్యప్రసాద్ వద్ద రూ.1,770, చినబాబు వ ద్ద రూ.14,940, విలపర్తి సత్యనారాయణ వద్ద రూ.1,410ను స్వాధీనం చేసుకున్నామని రాజేంద్ర తెలిపారు. 12 రిజిస్ట్రేషన్ చేయని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకు న్నామని చెప్పారు. ఇక్కడి అవినీతిపై పూర్తిస్థారుులో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.