
కోహిమా: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోయారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అబోయ్ ప్రాంతంలో గస్తీలో ఉన్న ఆరుగురు అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాపుకాసి దాడిచేశారు. దీంతో హవల్దార్ ఫతేసింగ్, సిపాయ్ హుంగ్నాగా కోన్యాక్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. మిగిలిన వారికీ తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయని అస్సాం రైఫిల్స్ పీఆర్‌వో వెల్లడించారు. గాయపడిన వారికి కోహిమా ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. అయితే ఇది నాగా తిరుగుబాటు దారుల పనేనని భావిస్తున్నారు. జవాన్ల ప్రతిఘటనలోనూ నాగా తిరుగుబాటుదారులు గాయపడి ఉండొచ్చని భావిస్తున్నట్లు పీఆర్‌వో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment