![Speeding Car Jumped On To Road Side Grill In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/31/car.jpg.webp?itok=y96yW04l)
సాక్షి, హైదరాబాద్/ జయశంకర్ భూపాలపల్లి : ఎత్తులో ఉన్న జాతీయ రహదారిని ఎక్కటం కోసం వేగం పెంచటంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. సర్రున రోడ్లకు అడ్డంగా పరుగులు పెడుతూ.. సర్వీస్ రోడ్డుపై ఉన్న గ్రిల్‌పైకి ఎక్కింది. ఈ సంఘటన బుధవారం రాత్రి మేడ్చల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బావార్చి హోటల్ పక్కన ఉన్న ఓ కాలనీకి చెందని ఇద్దరు వ్యక్తులు బుధవారం రాత్రి కారులో వస్తున్నారు. జాతీయ రహదారిపైకి ఎక్కేచోట కొంత ఎత్తుగా ఉండటంతో డ్రైవర్ ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచాడు. దీంతో కారు అదుపుతప్పి, సర్రున రోడ్డు ఎక్కి జాతీయ రహదారి రెండు రోడ్లను దాటి సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న గ్రిల్ పైకి ఎక్కింది. ( కామారెడ్డి: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా)
కారు అదుపుతప్పిన మరో ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఓ కారు అదుపు తప్పి టేకుమట్ల, ఆశిరెడ్డిపల్లి గ్రామాల మధ్య హై లెవెల్ కల్వర్టు నిర్మాణం కోసం తీసిన గుంతలో బోల్తో పడింది. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment