
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని రుద్రారం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిపోయారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండీ క్యాష్ ఏటీఎంలో చోరీకి పాల్పడిన దుండగులు ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పఠాన్‌చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. గతంలో శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం గ్రామంలోనూ ఏటీఎం మిషిన్‌ను దొంగలెత్తుకెళ్లారు. అనంతరం జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పంటపొలాల్లో ఏటీఎం మిషన్‌ను పడేసి వెళ్లారు.
చదవండి : పొలాల్లో ప్రత్యక్షమైన ఏటీఎం మిషిన్
Comments
Please login to add a commentAdd a comment