
సాక్షి, సంగారెడ్డి: మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కృష్ణారెడ్డి పేట్ ఓఆర్‌ఆర్ దగ్గర కారులో ఆపస్మారక స్థితిలో ఉన్న మెడికో రచనా రెడ్డి(25)ని పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందింది.
మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి.. ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె మృతిపై అమీన్‌పూర్ పోలీసులు విచారణ చేపట్టారు