చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజల సౌలభ్యం కోసం గ్రామాల్లో మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకు నుంచి సొమ్ము విత్ డ్రా చేసేందుకు ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలకు తమ బ్యాంకు ద్వారా ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంలను అందుబాటులో ఉంచుతామన్నారు. (తగినంత నగదు ఉండేలా చూసుకోండి..)
ఇందుకోసం ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత సహకార సంఘ కార్యదర్శికి సమాచారం అందిస్తే వెంటనే మొబైల్ ఏటీఎంలను పంపిస్తామన్నారు. విజయవాడ, నూజివీడు డివిజన్లకు సంబంధించి 99496 88340, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లకు సంబంధించి 99496 88362కు ఫోన్ చేసి సమాచారం అందించిన వెంటనే మొబైల్ ఏటీఎంలను పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. (క్వార్టర్ @ 300)
చదవండి: అమ్మ ఎవరికైనా అమ్మే..!
చదవండి: అడ్మిన్.. తస్మాత్ జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment