kdcc bank
-
కేడీసీసీ బ్యాంక్‌లో దోపిడీకి యత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బ్యాంక్‌లోకి దొంగలు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జరిగిన సంఘటనపై ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆరా తీశారు. బ్యాంక్ అధికారులు, సీఐ మొగిలి తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ వద్ద భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు చేసేందుకు భవనానికి తూర్పు వైపున పలంచ కొట్టారు. దాని ద్వారా మొదటి అంతస్తుపైకి ఎక్కి.. అల్యూమినియం స్లైడింగ్ కిటికి నుంచి బ్యాంక్లోనికి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. మొదట సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కట్ చేశారు. అనంతరం బ్యాంక్‌లో ఉన్న రెండు షెట్టర్లను ఇనుపరాడుతో పైకెత్తి స్ట్రాంగ్‌రూం లాకర్‌ను కట్టర్‌తో తెరిచేందుకు ప్రయత్నించారు. తెరుచుకోకపోవడంతో అక్కడే ఉన్న ఫైళ్లను చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం బ్యాంక్‌ను తెరిచేందుకు వాచ్మెన్ అనిల్ వచ్చి పరిస్థితిని మేనేజర్ సంపూర్ణకు వివరించాడు. మేనేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ మొగిలి, ఎస్సై ప్రేమ్‌దీప్, క్లూస్‌టీం సభ్యులు, సీసీఎస్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగల వేలిముద్రలు సేకరించి, డాగ్స్క్వాడ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా బ్యాంక్‌లోకి ఇద్దరూ దొంగలు ప్రవేశించినట్లు సీఐ తెలిపారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు తలకు హెల్మెట్, చేతులకు గ్లౌస్లు ధరించారన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. బ్యాంక్‌లో భద్రత చర్యలు బ్యాంక్‌లో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్న రవీందర్రావు హుటాహుటిన ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. దొంగతనంపై మేనేజర్ సంపూర్ణ, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్యాంక్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉందని వినియోగదారులు, రైతులు ఆందోళనకు గురికావద్దని కోరారు. పూర్తి భద్రత వలయంలో బ్యాంక్‌ను నడిపిస్తున్నామని చెప్పారు. నూతన భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మధ్యాహ్నం నుంచి బ్యాంక్ లావాదేవీలు కొనసాగించారు. మేనేజర్ సంపూర్ణ, సిబ్బంది ఉన్నారు. – రవీందర్రావు, టెస్కాబ్ చైర్మన్ -
ఫోన్ చేస్తే చాలు.. ఇంటికే ఏటీఎం
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజల సౌలభ్యం కోసం గ్రామాల్లో మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకు నుంచి సొమ్ము విత్ డ్రా చేసేందుకు ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలకు తమ బ్యాంకు ద్వారా ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంలను అందుబాటులో ఉంచుతామన్నారు. (తగినంత నగదు ఉండేలా చూసుకోండి..) ఇందుకోసం ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత సహకార సంఘ కార్యదర్శికి సమాచారం అందిస్తే వెంటనే మొబైల్ ఏటీఎంలను పంపిస్తామన్నారు. విజయవాడ, నూజివీడు డివిజన్లకు సంబంధించి 99496 88340, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లకు సంబంధించి 99496 88362కు ఫోన్ చేసి సమాచారం అందించిన వెంటనే మొబైల్ ఏటీఎంలను పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. (క్వార్టర్ @ 300) చదవండి: అమ్మ ఎవరికైనా అమ్మే..! చదవండి: అడ్మిన్.. తస్మాత్ జాగ్రత్త! -
ఏసీబీ వలలో అవినీతి అధికారి
-
ఇదేం తీరు?
సాక్షి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కేడీసీసీబీ(ది కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్)లో పాలకవర్గం.. అధికారులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పదోన్నతులు కల్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఆగమేఘాల మీద దీనికి సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేసేశారు. నేడో రేపో ఇంటర్వ్యూలు చేపట్టి ప్రమోషన్లు ఇచ్చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇదీ విషయం కేడీసీసీబీలో ఏడుగురిని అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్లుగా అక్రమ పదోన్నతులు కల్పించేందుకు పాలకవర్గం, అధికార యంత్రాం గం సిద్ధమవుతోంది. ఇందుకు తమ అనుయానులను ఎంపిక చేసుకుని తంతు సాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పదోన్నతికి రూ.3 లక్షల వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎలాంటి పదోన్నతులైనా, ఉద్యోగ నియామకాలైనా వారి ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉంది. కానీ అలాంటి ప్రక్రియకు ఇక్కడ మంగళం పాడుతున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ ఆటలు సాగవనుకుని అడ్డగోలు యవ్వారానికి తెర తీసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కులను ఏమార్చి! పదోన్నతులకు అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగికి అసిస్టెంట్ మేనేజర్‌గా అనుభవం, పీజీ పూర్తవ్వాలి. అంతేగాక బ్యాంకింగ్‌కు సంబంధించి డిప్లొమా కోర్సు చేసుండాలి. డీసీఆర్ఎస్, కంప్యూటర్ డిప్లొమాకు ప్రత్యేకంగా మార్కులు కేటాయిస్తారు. ఇదంతా ఒకెత్తయితే.. ఇంటర్వ్యూలకు 15 మార్కులు కేటాయిస్తారు. ఇక్కడే అసలు కథ నడిపిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో తమకు అనుకూలమైన వారికి అధిక మార్కులు వేసి గట్టెక్కిం చేందుకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. గతంలో జరిగిన పదోన్నతుల్లో సైతం ఇదే తంతు జరిగింది. అర్హులకు అన్యాయం చేసి.. అనర్హులకు పెద్దపీట వేశారు. ఈ సారి అదే ప్రక్రియ కొనసాగించేందుకు వ్యూహం రచిస్తున్నారు. పదవీ కాలం ముగిసినా కొనసాగింపు? పదోన్నతుల ఇంటర్వ్యూ బోర్డులో ముగ్గురు సభ్యులుంటారు. కేడీసీసీబీ చైర్మన్, సీఈఓ, ప్రొఫెషనల్ డైరెక్టర్ ఉంటారు. ఇందులో ప్రొఫెషనల్ డైరెక్టర్‌కు ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. అనంతరం ఆ పదవిలో కొనసాగేందుకు అర్హత ఉండదు. కానీ ఇక్కడ మాత్రం పదవీ కాలం ముగిసినా అలాగే కొనసాగుతున్నారు. పదవీ కాలం ముగియడంతో ప్రొఫెషనల్ డైరెక్టర్‌ను తొలగించాలని నబార్డ్ నుంచి రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు అందాయి. రిజిస్ట్రార్ సైతం పాలకవర్గానికి సూచించినా.. తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న తలంపుతో ఏడాదిన్నర కాలంగా అలాగే కొనసాగిస్తున్నారు. చైర్మన్ రాజీనామావిషయమేంటి? ప్రస్తుతం కేడీసీసీబీ చైర్మన్‌గా టీడీపీకి చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. సాధారణంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న వారు నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేయడం ఆనవాయితీ. 2004లో కౌంటింగ్ రోజున అప్పటి కేడీసీసీబీ చైర్మన్ సైతం రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు రాజీనామా చేసిన దాఖలాలు సైతం లేకపోలేదు. కానీ ప్రస్తుత కేడీసీసీబీ పాలకవర్గానికి మాత్రం ఇది వర్తించదనుకున్నారో ఏమో నేటికీ రాజీనామా చేయకపోవడం గమనార్హం. -
రుణాల మంజూరులో కేడీసీసీ బ్యాంకు రెండోస్థానం
నంద్యాల: రైతులకు రుణాలు అందించడంలో రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రెండో స్థానంలో ఉందని బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆయన స్థానిక బ్రాంచ్‌లో గురువారం ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి ఏటీఎం ఇదేనని మరో 10ఏటీఎంలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అందులో భాగంగా 23న శిరివెళ్లలో ఒకటి ప్రారంభిస్తామన్నారు. రైతులకు రుణాలు ఇవ్వడం, రికవరీ చేయడంలో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల తర్వాత కర్నూలు ముందంజలో ఉందన్నారు. రైతులకు నగదు రహిత లావాదేవీల కోసం తమ బ్యాంక్ ఇచ్చే రూపేకార్డులు ఇతర బ్యాంకుల్లోనూ చెల్లుబాటు అవుతాయన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు షేక్‌అహమ్మద్ హుసేన్, డైరెక్టర్లు కొండారెడ్డి, ప్రతాపరెడ్డి, సీఈఓ రామాంజనేయులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, ఐఓబీ మేనేజర్ నాగపూర్ణిమా, బ్రాంచ్ మేనేజర్ తులశీశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
పావలా కోడికి..
సాక్షి ప్రతినిధి, కర్నూలు : పావలా కోడికి రూపాయి మసాలా చందంగా ఉంది కర్నూలు జిల్లా కేంద్ర సహకార(కేడీసీసీ) బ్యాంకు వ్యవహారం. రూ.60 లక్షలతో నిర్మించిన బిల్డింగ్‌కు.. ఏకంగా కోటి రూపాయలతో మరమ్మతులు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం నిర్వహించిన పాలక మండలి(బోర్డు) సమావేశంలో కేడీసీసీబీ ఆమోదముద్ర కూడా వేసింది. బిల్డింగ్ మరమ్మతులకు సహకార అభివృద్ధి నిధుల(సీడీఎఫ్) నుంచి కోటి రూపాయలను ఉపయోగిం చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆప్కాబ్‌కు కేడీసీసీబీ ఇప్పటికే లేఖ రాసింది. అనుమతి లభించిన వెంటనే మరమ్మతు పనులుకు టెండర్లు ఆహ్వానించేందుకు రంగం సిద్ధమయింది. 30 ఏళ్లు కాకుండానే.. కేడీసీసీబీని వాణిజ్య బ్యాంకుల తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ మరమ్మతులను చేపడుతున్నట్టు కేడీసీసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు వరకు బ్యాంకును విస్తరించేందుకు మరమ్మతులు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. బ్యాంకు నిధులు ఒక్క రూ పాయి కూడా ఉపయోగించమని.. సీడీఎఫ్ కింద జిల్లాకు వచ్చిన కోటి 60 లక్షల రూపాయల్లో.. కోటి రూపాయలను వినియోగించనున్న ట్టు స్పష్టం చేశారు. అయితే, బిల్డింగ్ నిర్మించి 30 ఏళ్లు కూడా పూర్తికాకుండానే.. పూర్తిస్థాయిలో మరమ్మతులను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బిల్డింగ్ నిర్మాణ వ్యయానికి మించి మరమ్మతులకు వెచ్చించాల్సిన అవసరం ఏముందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా టెండర్లు పిలవలేదు కేడీసీసీబీని వాణిజ్య బ్యాంకు తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ మరమ్మతు పనులను చేపట్టాలని భావిస్తున్నాం. ఇందుకోసం బ్యాంకు నిధులను ఒక్క పైసా వినియోగించం. సీడీఎఫ్ కింద రూ.1.60కోట్లు ఉన్నాయి. ఈ నిధులను ఉపయోగించుకోకపోతే వెనక్కు వెళ్లిపోతాయి. అయినా బిల్డింగ్‌ను పూర్తిగా పడగొట్టి కట్టడం లేదు. కేవలం మరమ్మతులు చేయించాలని నిర్ణయించాం. అనుమతి కోసం ఆప్కాబ్‌కు లేఖ రాశాం. మరమ్మతు పనులను ఓపెన్ టెండర్ల ద్వారా చేపడతాం. ఇందులో రహస్యమేమీ లేదు. - మల్లిఖార్జున రెడ్డి,కేడీసీసీబీ చైర్మన్ -
అక్రమాలకు ‘సహకారం’
రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడా ల్సిన సహకారం సంఘాల్లో కొన్ని దారితప్పాయి. తమ లక్ష్యాలను మరచి పాలకవర్గాలు అక్రమాలకు తెరలేపాయి. ఇందుకు జిల్లా కేంద్రంలోని కేంద్ర బ్యాంక్ కూడా ‘చే’యూతనందిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా పంచభక్ష పరమాన్నం అందుతుందన్న చందంగా మారింది కేడీసీసీ బ్యాంక్ పనితీరు. ఖరీఫ్ సీజన్లో పంట రుణాల పంపిణీకి సంబంధించి ఆప్కాబ్ నుంచి జిల్లాకు బడ్జెట్ విడులైంది. దీనిని సహకార సంఘాలకు కేటాయించటంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగిల్ విండోలకే ఈ నిధులను పెద్దఎత్తున మళ్లించారు. అర్హతలేని, అక్రమాలకు పాల్పడిన వాటికి సైతం అడ్డగోలుగా కేటాయించారు. జిల్లాలో 95 సింగిల్ విండోలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) నుంచి రూ.19.89 కోట్లు నిధులు విడుదల చేసింది. సింగిల్‌విండోల రికవరీ శాతాన్ని బట్టి సంఘాలకు వీటిని పంపిణీ చేయాలి. అవకతవకలు లేకుండా, సక్రమంగా ఆడిట్ జరుగుతూ అభివృద్ధి పథంలో రాణిస్తున్న సంఘాలకు అదనపు బడ్జెట్ కేటాయించవచ్చు. అయితే ఇటువంటి నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్లు నిధులను మళ్లించారు. అర్హతలేని సహకార సంఘాలకే ప్రాధాన్యం.. జిల్లాలో అర్హతలేని సహకార సంఘాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని వాటికే పెద్దపీట వేశారు. అందులో వెల్దుర్తి సింగిల్ విండోకు రూ.61.19 లక్షలు, క్రిష్ణగిరి సహకార బ్యాంక్‌కు రూ.33 లక్షలు, మారెళ్లకు రూ.50 లక్షలు, పత్తికొండకు రూ.54.30 లక్షలు, మద్దికెర, బురుజుల చెరో రూ.25 లక్షల చొప్పున మంజూరు చేశారు. అదే విధంగా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ సహకార బ్యాంక్‌కు రూ.33 లక్షలు, కోడుమూరుకు రూ.38 లక్షలు, నంద్యాల పరిధిలోని దీబగుంట్లకు రూ.34 లక్షలు, గోపవరానికి రూ.34 లక్షలు, గోస్పాడుకు రూ.36 లక్షలు, గడివేములకు రూ.34లక్షల చొప్పున మంజూరు చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన సహకార సంఘాలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్ముక్కై గెలుచుకున్న పత్తికొండ సహకార బ్యాంకుకూ అత్యధిక నిధులు కేటాయించటం గమనార్హం. ఇందులో క్రిష్ణగిరి సొసైటీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్ పూర్తికాకపోవటం, విజిలెన్స్ విచారణ జరుగుతున్నప్పటికి ఈ సహకార సంఘానికి నిధులు మంజూరు చేశారు. బురుజుల సహకార సంఘం ఒకే గ్రామానికి చెందినది. ఇక్కడ గతంలో రూ.50 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయనే విమర్శలు ఉన్నాయి. అటువంటి సంఘానికీ భారీగా నిధులు మంజూరు చేయటం కేడీసీసీ బ్యాంక్ పాలక వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ పరిధిలోని ఉప్పరపల్లి సొసైటీకి నిధులు ఇవ్వటంలో తిరకాసుపెట్టింది. ‘రికవరీ శాతం ప్రకారం రూ.18లక్షలు ఇస్తాం మీరెవరికైనా పంచుకోండి. అదనపు బడ్జెట్ నిధులను మా ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకుంటాం. అందుకు మీరు సంతకం చేయాలి’ అని షరతు పెట్టటంతో ఆ చైర్మన్ అసలు బడ్జెట్టే వద్దని చెప్పేసినట్లు తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్లకు కొన్నిచోట్ల ఒక్క రూపాయికూడా మంజూరు చేయలేదు. ఆళ్లగడ్డ పరిధిలోని చాగలమర్రి, ఓబులంపల్లి, ఆదోని పరిధిలోని బదినేహాల్, చిన్నతుంబళం, ఎమ్మిగనూరు పరిధిలోని కడిమెట్ల సహకార సంఘాలనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ అడ్డగోలు నిధుల పందేరంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రికవరీని బట్టే నిధుల మంజూరు సహకార సంఘాలకు రికవరీలను బట్టే నిధులు మంజూరు చేశాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘాలకు రుణాలు ఇవ్వలేదు. పూర్తిగా నిధులు మంజూరు చేయలేదంటే ఆ సంఘాల వారు 27, 28 లోపు రిజిస్టర్ చేసుకుని ఉండరు. నిధుల కేటాయింపులో మేం పార్టీలను దృష్టిలో పెట్టుకోలేదు. -డీసీసీబీ సీఈఓ వీవీ సుబ్బారెడ్డి -
సీమాంధ్రులు క్షమించరు
పత్తికొండ/తుగ్గలి, న్యూస్‌లైన్ : నిరసనలతో సీమాంధ్ర భగ్గుమంటున్నా పదవులు పట్టుకుని వేలాడుతున్న కేంద్ర మంత్రులను ప్రజలను క్షమించబోరని వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్యయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా ఉధ్యమాలు చేస్తున్న వారిపై మీసాలు మెలేసి తొడగొట్టడం, న్యాయవాదులపై చెప్పులతో దాడి చేయించిన మంత్రి టీజీ వెంకటేశ్‌కు తగదన్నారు. కర్నూలు పట్టణ ప్రజలు కన్నెర్ర చేస్తే మంత్రి వెంకటేశ్‌కు అడ్రాస్ లేకుండా పోతుందని అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రకటన చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసే మొదటి వ్యక్తి తానేనని చెప్పుకున్న కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఇంతవరకు తన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. సమైక్య వాదులకు వైఎస్ఆర్సీపీ నిత్యం అండగా ఉండటమే కాకుండా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తోందని చెప్పారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యులు ప్రహ్లాదరెడ్డి, ఎర్రగుడి రామచంద్రారెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ నాయకుడు శ్రీరంగడు, పార్టీ స్థానిక నాయకులు దామోదరాచారి, నాగేష్, మోహన్‌రెడ్డి, ఎద్దులదొడ్డి మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. విశాంత్రి గదుల ప్రారంభం తుగ్గలి మండలం ఉపర్లపల్లె గ్రామ సమీపంలోని నలివేలి సుంకలమ్మ ఆలయ భక్తుల సౌకర్యార్థం ఎర్రగుడికి చెందిన రాముడు, నారాయణమ్మ, సుధాకర్, ప్రసాద్ కలసి రూ.3 లక్షలతో రెండు రూములను నిర్మించారు. వాటిని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్యయకర్త కోట్లహరిచక్రపాణిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్‌చెర్మైన్ రామచంద్రారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భఃగా వారిని శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. 5