పత్తికొండ/తుగ్గలి, న్యూస్‌లైన్ : నిరసనలతో సీమాంధ్ర భగ్గుమంటున్నా పదవులు పట్టుకుని వేలాడుతున్న కేంద్ర మంత్రులను ప్రజలను క్షమించబోరని వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్యయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా ఉధ్యమాలు చేస్తున్న వారిపై మీసాలు మెలేసి తొడగొట్టడం, న్యాయవాదులపై చెప్పులతో దాడి చేయించిన మంత్రి టీజీ వెంకటేశ్‌కు తగదన్నారు. కర్నూలు పట్టణ ప్రజలు కన్నెర్ర చేస్తే మంత్రి వెంకటేశ్‌కు అడ్రాస్ లేకుండా పోతుందని అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రకటన చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసే మొదటి వ్యక్తి తానేనని చెప్పుకున్న కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఇంతవరకు తన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. సమైక్య వాదులకు వైఎస్‌ఆర్‌సీపీ నిత్యం అండగా ఉండటమే కాకుండా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తోందని చెప్పారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కమిటీ సభ్యులు ప్రహ్లాదరెడ్డి, ఎర్రగుడి రామచంద్రారెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ నాయకుడు శ్రీరంగడు, పార్టీ స్థానిక నాయకులు దామోదరాచారి, నాగేష్, మోహన్‌రెడ్డి, ఎద్దులదొడ్డి మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
విశాంత్రి గదుల ప్రారంభం
తుగ్గలి మండలం ఉపర్లపల్లె గ్రామ సమీపంలోని నలివేలి సుంకలమ్మ ఆలయ భక్తుల సౌకర్యార్థం ఎర్రగుడికి చెందిన రాముడు, నారాయణమ్మ, సుధాకర్, ప్రసాద్ కలసి రూ.3 లక్షలతో రెండు రూములను నిర్మించారు. వాటిని వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్యయకర్త కోట్లహరిచక్రపాణిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్‌చెర్మైన్ రామచంద్రారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భఃగా వారిని శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
5
సీమాంధ్రులు క్షమించరు
Published Wed, Sep 18 2013 1:51 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement