
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దండగులు అపహరించుకు వెళ్లిన ఏటీఎం మిషన్ ఆచూకీ లభించింది. కంది మండలం చేర్యాల గ్రామ శివారులో ఇండి క్యాష్ ఏటీఎం మిషన్‌ను పోలీసులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి పక్కనున్న ఓ షటర్‌లో రెండు ఇండిక్యాష్ ఏటీఎంలలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఓ ఖాతాదారుడు ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లగా అక్కడ ఒకటే ఏటీఎం మిషన్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. కాగా దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 2,27,000 నగదు ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment