indicash atm
-
మాయమైన ఏటీఎం మిషన్ లభ్యం
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దండగులు అపహరించుకు వెళ్లిన ఏటీఎం మిషన్ ఆచూకీ లభించింది. కంది మండలం చేర్యాల గ్రామ శివారులో ఇండి క్యాష్ ఏటీఎం మిషన్‌ను పోలీసులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి పక్కనున్న ఓ షటర్లో రెండు ఇండిక్యాష్ ఏటీఎంలలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఓ ఖాతాదారుడు ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లగా అక్కడ ఒకటే ఏటీఎం మిషన్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. కాగా దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 2,27,000 నగదు ఉందని పోలీసులు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇండీక్యాష్ ఏటీఎంలు @ 1,500
హైదరాబాద్: టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ ‘టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ (టీసీపీఎస్ఎల్)కు చెందిన ఇండీక్యాష్ ఏటీఎంల సంఖ్య తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1,500ల మైలురాయికి చేరింది. ఏపీలోని గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ వద్ద ఈ 1,500వ ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల వినియోగాన్ని పెంచాలనే తమ లక్ష్యాన్ని తాజా మైలురాయి ప్రతిబింబిస్తోందని పేర్కొంది. కాగా కంపెనీకి దేశవ్యాప్తంగా 8,500 ఇండీక్యాష్ ఏటీఎంలు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 15,000లకు తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది. -
రూ.5 వేలు డ్రా చేస్తే.. 50 వేలు వచ్చాయి!
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో ఘటన కందుకూరు : బ్యాంకు ఏటీఎంలో కార్డు పెట్టి, ఎంత డబ్బు అవసరమో వివరాలు నమోదు చేస్తే అంతే మొత్తంలో నగదు రావడం సాధారణం. కానీ.. శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో మాత్రం రూ. 5 వేలు డ్రా చేద్దామనుకుంటే రూ.50 వేలు, రూ.4 వేలు బదులు రూ.20 వేలు, రూ.వెయ్యి డ్రా చేసిన వారికి రూ. 5 వేలు వచ్చాయి. కాగా.. రూ.వెయ్యి పైన డ్రా చేసిన వారికే ఇలా అధిక మొత్తంలో నగదు వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇలా డబ్బు డ్రా చేసినవారు పలువురికి చెప్పడంతో ఏటీఎం వద్ద అంతా క్యూ కట్టారు. ఇలా ఐదారు మందికి పైగా నగదు డ్రా చేసిన తర్వాత ఏటీఎంలో డబ్బు అయిపోవడంతో పలువురు నిరాశగా వెనుతిరిగారు. ఈ విషయమై సీఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. తమకెలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఏటీఎం ధ్వంసం... నగదు చోరీ
మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. టాటా కంపెనీకి చెందిన ఇండిక్యాష్ ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు రూ.2 లక్షల మేర నగదు చోరికి గురైనట్టు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసలు విచారణ చేస్తున్నారు. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
వైఎస్ఆర్ జిల్లా : వైఎస్ఆర్ జిల్లాలోని అలంకాన్పల్లెలో ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. శనివారం అర్ధరాత్రి ఇండిక్యాష్ ఏటీఎం కేంద్రంలోకి చొరబడి యంత్రాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోకవడంతో దాన్ని ధ్వంసం చేసి తీసుకొచ్చి బయట పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించడంతోపాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోంది.