రూ.5 వేలు డ్రా చేస్తే.. 50 వేలు వచ్చాయి! | Indicash ATM cause sensation | Sakshi
Sakshi News home page

రూ.5 వేలు డ్రా చేస్తే.. 50 వేలు వచ్చాయి!

Published Fri, May 6 2016 1:14 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రూ.5 వేలు డ్రా చేస్తే.. 50 వేలు వచ్చాయి! - Sakshi

రూ.5 వేలు డ్రా చేస్తే.. 50 వేలు వచ్చాయి!

రంగారెడ్డి జిల్లా కందుకూరులోని టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో ఘటన

 కందుకూరు : బ్యాంకు ఏటీఎంలో కార్డు పెట్టి, ఎంత డబ్బు అవసరమో వివరాలు నమోదు చేస్తే అంతే మొత్తంలో నగదు రావడం సాధారణం. కానీ.. శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో మాత్రం రూ. 5 వేలు డ్రా చేద్దామనుకుంటే రూ.50 వేలు, రూ.4 వేలు బదులు రూ.20 వేలు, రూ.వెయ్యి డ్రా చేసిన వారికి రూ. 5 వేలు వచ్చాయి.

కాగా.. రూ.వెయ్యి పైన డ్రా చేసిన వారికే ఇలా అధిక మొత్తంలో నగదు వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇలా డబ్బు డ్రా చేసినవారు పలువురికి చెప్పడంతో ఏటీఎం వద్ద అంతా క్యూ కట్టారు. ఇలా ఐదారు మందికి పైగా నగదు డ్రా చేసిన తర్వాత ఏటీఎంలో డబ్బు అయిపోవడంతో పలువురు నిరాశగా వెనుతిరిగారు. ఈ విషయమై సీఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. తమకెలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement