ATM Machine Theft
-
డబ్బు విత్డ్రాకావట్లేదని ఏటీఎమ్‌నే ఎత్తుకెళ్లారు!
ఆగ్రా: ఏటీఎమ్‌లో డబ్బు డ్రా కాలేదనీ మిషన్‌ను కారులో యంత్రాన్ని ఎత్తుకెళ్లారు! ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీకి గురైన ఏటీఎం ఉన్న గదిలో యంత్రం తప్ప ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సమీపంలో అమర్చిన కెమెరాల ఫుటేజీని పోలీసులు స్కాన్ చేస్తున్నారని, పోలీసులు వచ్చేలోపే ఏటీఎంను కారులో ఎక్కించుకుని దుండగులు పారిపోయారని తెలిపారు. ఏటీఎంలో 8 లక్షల 30 వేల రూపాయలు ఉన్నాయని ఎస్ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. నిజానికి దుండగులు మొదట ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నించారు. విఫలమవ్వడంతో యంత్రాన్ని కారులో తమతోపాటు తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: Omicron variant of COVID-19: లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు -
ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లు హ్యాక్!!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు గడచిన రెండేళ్లలో మూడు ‘ఏటీఎం గ్యాంగు’ల్ని పట్టుకున్నారు. హరియాణా– రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన వీరంతా డబ్బు డ్రా చేసిన సమయంలో మెషీన్‌ను ఆపేసి కథ నడిపారు. ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ మాత్రం వీటిని తలదన్నేలా వ్యవహరించింది. ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లను హ్యాక్ చేసి పని కానిచ్చింది. అయిదుగురిని పట్టుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ ముఠాకు సాంకేతిక సహకారం హైదరాబాద్‌కు చెందిన కమల్ అందించినట్లు గుర్తించారు. దీంతో ఇతడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందాన్ని సిటీకి పంపారు. నలుగురు సభ్యులతో ముఠా.. ఉత్తరప్రదేశ్‌లోని బాండ జిల్లాకు చెందిన షానవాజ్ అలీ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) పూర్తి చేసి ఢిల్లీలో స్థిరపడ్డాడు. ఇతడికి 2015లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన జమీర్ షేక్‌తో పరిచయమైంది. అప్పట్లో నలుగురు సభ్యులతో ఓ ముఠాను కలిగి ఉన్న జమీర్ ఉత్తరాఖండ్‌తో పాటు యూపీ, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏటీఎంలను హ్యాక్ చేయడం ద్వారా తెరిచి అందులోని డబ్బు కాజేశారు. షానవాజ్ అయిదో మెంబర్ అయ్యాడు. అప్పట్లో హ్యాకింగ్‌కు అవసరమైన కోడ్‌ను వీరికి జార్ఖండ్‌లోని జామ్తారకు చెందిన వారు అందించారు. ఉత్తరాఖండ్‌లో వరుసపెట్టి నేరాలు చేసిన ఈ ముఠాను ఆ ఏడాది సెప్టెంబర్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. ఈ కేసులో బెయిల్ పొంది బయటకు వచ్చిన షానవాజ్ తానే గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో ముంబైకి చెందిన జమీర్ షేక్ (కోడింగ్ డిప్లొమా చదివాడు), సాగిర్, మహ్మద్ ఉమర్, మెహ్రాజ్ (బీసీఏ గ్రాడ్యుయేట్) సభ్యులుగా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఏర్పాటు ఈ ముఠా కొత్త ఏటీఎంనూ హ్యాక్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి హైదరాబాద్ వాసి కమల్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇతగాడు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అక్కడి ఓ పబ్‌లో వీరికి పరిచయమయ్యాడు. కమల్ డార్క్ నెట్ నుంచి ఏటీఎం మెషీన్ల హ్యాకింగ్ మాల్వేర్ సమకూర్చుకున్నాడు. దీన్ని యూఎస్బీ డ్రైవ్‌లో వేసి షానవాజ్‌కు అందించాడు. ఈ డ్రైవ్‌ను మిషన్‌కు అనుసంధానించే ముఠా అందులోకి మాల్వేర్ పంపేది. దీని ప్రభావంతో ఆ మెషీన్ ప్రధాన సర్వర్‌తో సంబంధాలు కోల్పోయేది. అదే సమయంలో ఈ మాల్ వేర్ ఓ కోడ్‌ను సృష్టించి కమల్ పొందుపరిచిన మెయిల్ ఐడీకి చేరవేసేది. హైదరాబాద్‌లోనే ఉండి దాన్ని అధ్యయనం చేసే ఇతగాడు పాస్‌వర్డ్‌గా మార్చి షానవాజ్ గ్యాంగ్‌కు ఫోన్లో చెప్పేవాడు. దీన్ని ఎంటర్ చేయడం ద్వారా ముఠా మెషీనన్ రీబూట్ అయ్యేలా చేస్తారు. ఆ సమయంలో డబ్బు డ్రా చేయడంతో అది ఖాతాదారుడి లెక్కల్లోకి రాదు. ఈ పంథాలో షానవాజ్ గ్యాంగ్ ఢిల్లీ, యూపీ, ఘజియాబాద్‌ల్లో కొన్నాళ్లుగా 200 ఏటీఎంలను కొల్లగొట్టింది. ఇలా కాజేసినదాంట్లో కమల్‌కు 5% ముట్టేది. వీరి కోసం ఘజియాబాద్ పోలీసులు 5 నెలల క్రితం స్వాట్ టీమ్‌ను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌లో ఉన్నాడని.. మూడు నెలల క్రితం నోయిడాలో వీరికి చిక్కిన షానవాజ్ లంచం ఎర చూపి తిప్పించుకున్నాడు. రూ.20 లక్షల నగదుతో పాటు ఎస్యూవీ వాహనాన్ని స్వాట్ టీమ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత తన ముఠాతో కలిసి కొన్ని నేరాలు చేశాడు. గత నెల ఆఖరి వారంలో ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు షానవాజ్ సహా అయిదుగురిని పట్టుకున్నారు. వీరి విచారణలోనే నోయిడా ఉదంతం బయటపడింది. దీంతో స్వాట్ టీమ్‌కు చెందిన ఇద్దరిని ఘజియాబాద్ పోలీసులు విధుల నుంచి తొలగించారు. షానవాజ్‌ను లోతుగా విచారించిన సైబర్ సెల్ కమల్ వ్యవహారం గుర్తించింది. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తేలడంతో ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ పంథాలో ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
మాయమైన ఏటీఎం మిషన్ లభ్యం
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దండగులు అపహరించుకు వెళ్లిన ఏటీఎం మిషన్ ఆచూకీ లభించింది. కంది మండలం చేర్యాల గ్రామ శివారులో ఇండి క్యాష్ ఏటీఎం మిషన్‌ను పోలీసులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి పక్కనున్న ఓ షటర్లో రెండు ఇండిక్యాష్ ఏటీఎంలలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఓ ఖాతాదారుడు ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లగా అక్కడ ఒకటే ఏటీఎం మిషన్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. కాగా దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 2,27,000 నగదు ఉందని పోలీసులు తెలిపారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో చోరీకి యత్నం
-
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో చోరీకి యత్నం
సాక్షి, రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలో ఓ దుండగుడు భారీ చోరీకి యత్నించాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం మిషన్‌ను బద్దలుకొట్టి నగదును దోచుకునేందుకు ప్రయత్నించి, విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో సైరన్ మోగడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై, ఏటీఎం మిషన్ వద్దకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తమిళనాడుకు చెందిన మని మారన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఏటీఎం మిషన్ నుంచి నగదు పోలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. కాగా నిందితుడు 2007లో తిరుపతిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మని మారన్‌ను విచారణ జరుపుతున్నారు. -
ఏకంగా ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు
జైపూర్ : రాజస్థాన్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎంతలా అంటే.. ఏటీఎంలో క్యాష్ కాదు.. ఏకంగా ఏటీఎం మెషీన్నే ఎత్తుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ బుండిలోని సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. డబ్బును తీసుకెళ్లడం కాదు.. ఏటీఏం మెషీన్‌ను ఎత్తుకెళ్లాలన్న ప్లాన్ వారిని చూస్తే అర్థమవుతోంది. చాలా శ్రమించి ఏటీఎం మెషీన్‌ను గట్టిగా అటూఇటూ కదిపారు. ఆపై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ఎంచక్కా ఏటీఎం మెషీన్‌ను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిపోయారు. ఏటీఎంలోని సీసీ టీవీ కెమెరాల్లో ఈ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు -
ఏటీఎం దొంగలు.. పోలీసులకు సవాల్
వాషింగ్టన్: టెక్నాలజీ నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలాంటి నేరాలు జరిగినా ఇట్టే పట్టేస్తున్నారు పోలీసులు. అయితే అర్కన్సాస్ పట్టణ పోలీసులకు మాత్రం ఓ చోర్ బ్యాచ్ పెద్ద సవాల్నే విసిరింది. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లి అవాక్కయ్యేలా చేసింది. ఆగష్టు 16న జరిగిన ఈ దొంగతనం వీడియోను కాన్వే పోలీసులు రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఓ పెద్ద ట్రక్కుతో ఏటీఎం సెంటర్‌ను పగలకొట్టుకుంటూ వెళ్లిన నిందితులు మిషన్‌తో సహా ఊడపీకేశారు. ఆపై దానిని అదే వాహనానికి ఉన్న ఉన్న క్రేన్ సాయంతో ఎత్తుకెళ్లిపోయారు. ఉదయం డ్యూటీకి వచ్చిన ఓ బ్యాంకు సిబ్బంది అక్కడ జరిగిన భీభత్సాన్ని గుర్తించి చోరీ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. చోరికి గురైన మెషీన్ లో ఎంత డబ్బు ఉన్నదన్న విషయంపై బ్యాంకు అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. ఏదైనా నిర్మాణ రంగానికి చెందిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.