
జైపూర్ : రాజస్థాన్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎంతలా అంటే.. ఏటీఎంలో క్యాష్ కాదు.. ఏకంగా ఏటీఎం మెషీన్‌నే ఎత్తుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ బుండిలోని సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. డబ్బును తీసుకెళ్లడం కాదు.. ఏటీఏం మెషీన్‌ను ఎత్తుకెళ్లాలన్న ప్లాన్ వారిని చూస్తే అర్థమవుతోంది. చాలా శ్రమించి ఏటీఎం మెషీన్‌ను గట్టిగా అటూఇటూ కదిపారు. ఆపై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ఎంచక్కా ఏటీఎం మెషీన్‌ను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిపోయారు. ఏటీఎంలోని సీసీ టీవీ కెమెరాల్లో ఈ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏకంగా ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు
Comments
Please login to add a commentAdd a comment