
సాక్షి, రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలో ఓ దుండగుడు భారీ చోరీకి యత్నించాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం మిషన్‌ను బద్దలుకొట్టి నగదును దోచుకునేందుకు ప్రయత్నించి, విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో సైరన్ మోగడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై, ఏటీఎం మిషన్ వద్దకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తమిళనాడుకు చెందిన మని మారన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఏటీఎం మిషన్ నుంచి నగదు పోలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. కాగా నిందితుడు 2007లో తిరుపతిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మని మారన్‌ను విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment