RupeeRecordLow దేశీయ కరెన్సీ రూపాయి అమెరికా డాలరు మారకంలో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇటీవల బలహీనంగా ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే 83కి పడిపోయిన తరువాత మరింత పతనాన్ని నమోదు చేసింది. ఆగస్ట్ 17, గురువారం అక్టోబర్ నాటి రికార్డు కనిష్ట స్థాయి 83.29ని స్థాయికి దిగజారింది. అయితే శుక్రవారం ఆరంభంలో కొద్దిగా పుంజుకుని 83.11వద్ద కొనసాగుతోంది.మునుపటి ముగింపు 83.15 నుంచి 83.02 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గురువారం 20 పైసలు క్షీణించి డాలర్‌తో కనిష్ట స్థాయి 83.15 వద్ద రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది.
ఈ పతనం ఎందుకు
రూపాయిపై పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మున్ముందు ఆల్ టైమ్ కనిష్టానికి కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతోపాటు, డాలర్‌లో ఇటీవలి స్పైక్ మరియు ట్రెజరీ ఈల్డ్‌ల నేపథ్యంకూడా పనిచేస్తోంది. మరోవైపు చైనీస్ యువాన్ పతనం, ఎగుమతి పోటీతత్వంపై ఆందోళనల కారణంగా దేశీయ కరెన్సీనెగిటివ్‌గాఉందనిన మోతీలాల్ ఓస్వాల్‌లోని రీసెర్చ్ - కమోడిటీస్ & కరెన్సీల వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అన్నారు. ఆగస్టు 11, 2023న విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ నెలలో భారతదేశపు IIP 3.7 శాతం పడిపోయింది, ఇది మేలో 5.2 శాతంగా ఉంది. అలాగే ఆహార ధరల సెగ కారణంగా జూలై రీటైల్ ఇన్‌ఫ్లేషన్ 7.44శాతం వద్ద భారీగా పెరిగింది. ( 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?)
చైనా యువాన్ క్షీణత
చైనా యువాన్ పతనం స్థానిక రూపాయిపై కూడా ప్రభావం చూపింది. యువాన్ ఈ వారం 0.6శాతం మరియు ఈ సంవత్సరం 5.3శాతం క్షీణించింది. దేశం యొక్క విస్తారమైన ఆస్తి రంగంలో పెరుగుతున్న రుణ సంక్షోభం , ఆర్థిక పునరుద్ధరణ గురించి ఆందోళనలు యువాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ ఎవర్ గ్రాండే దివాల ప్రకటించడం, యూఎస్‌లోని అస్తుల రక్షణనిమిత్తం అక్కడి కోర్టును ఆశ్రయించడంమరింత ఆందోళన రేకెత్తించింది. (సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం)
చమురు సెగ
మరోవైపు ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.07శాతం పెరిగి 84.18కి డాలర్ల వద్దకు చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) బ్యారెల్‌కు 0.26శాతం పెరిగి 80.60 డాలర్ల స్థాయికి చేరింది. చేరుకుంది.
దేశీయంగా, భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) నికర రూ.1,510.86 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) నికర రూ.313.97 కోట్ల షేర్లను విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment