Record Low
-
ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..ఈ పతనం ఎందాక?
RupeeRecordLow దేశీయ కరెన్సీ రూపాయి అమెరికా డాలరు మారకంలో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇటీవల బలహీనంగా ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే 83కి పడిపోయిన తరువాత మరింత పతనాన్ని నమోదు చేసింది. ఆగస్ట్ 17, గురువారం అక్టోబర్ నాటి రికార్డు కనిష్ట స్థాయి 83.29ని స్థాయికి దిగజారింది. అయితే శుక్రవారం ఆరంభంలో కొద్దిగా పుంజుకుని 83.11వద్ద కొనసాగుతోంది.మునుపటి ముగింపు 83.15 నుంచి 83.02 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గురువారం 20 పైసలు క్షీణించి డాలర్‌తో కనిష్ట స్థాయి 83.15 వద్ద రికార్డు క్లోజింగ్‌ను నమోదు చేసింది. ఈ పతనం ఎందుకు రూపాయిపై పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మున్ముందు ఆల్ టైమ్ కనిష్టానికి కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతోపాటు, డాలర్లో ఇటీవలి స్పైక్ మరియు ట్రెజరీ ఈల్డ్‌ల నేపథ్యంకూడా పనిచేస్తోంది. మరోవైపు చైనీస్ యువాన్ పతనం, ఎగుమతి పోటీతత్వంపై ఆందోళనల కారణంగా దేశీయ కరెన్సీనెగిటివ్గాఉందనిన మోతీలాల్ ఓస్వాల్‌లోని రీసెర్చ్ - కమోడిటీస్ & కరెన్సీల వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అన్నారు. ఆగస్టు 11, 2023న విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ నెలలో భారతదేశపు IIP 3.7 శాతం పడిపోయింది, ఇది మేలో 5.2 శాతంగా ఉంది. అలాగే ఆహార ధరల సెగ కారణంగా జూలై రీటైల్ ఇన్ఫ్లేషన్ 7.44శాతం వద్ద భారీగా పెరిగింది. ( 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?) చైనా యువాన్ క్షీణత చైనా యువాన్ పతనం స్థానిక రూపాయిపై కూడా ప్రభావం చూపింది. యువాన్ ఈ వారం 0.6శాతం మరియు ఈ సంవత్సరం 5.3శాతం క్షీణించింది. దేశం యొక్క విస్తారమైన ఆస్తి రంగంలో పెరుగుతున్న రుణ సంక్షోభం , ఆర్థిక పునరుద్ధరణ గురించి ఆందోళనలు యువాన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ ఎవర్ గ్రాండే దివాల ప్రకటించడం, యూఎస్‌లోని అస్తుల రక్షణనిమిత్తం అక్కడి కోర్టును ఆశ్రయించడంమరింత ఆందోళన రేకెత్తించింది. (సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం) చమురు సెగ మరోవైపు ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.07శాతం పెరిగి 84.18కి డాలర్ల వద్దకు చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) బ్యారెల్‌కు 0.26శాతం పెరిగి 80.60 డాలర్ల స్థాయికి చేరింది. చేరుకుంది. దేశీయంగా, భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) నికర రూ.1,510.86 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) నికర రూ.313.97 కోట్ల షేర్లను విక్రయించారు. -
ఫ్లాట్ ముగింపు, రూపాయి రికార్డ్ కనిష్టం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రెండు రోజుల వరుస లాభాలకు చెక్ పెట్టాయి. ఆరంభ లాభాలను కోల్పోయి వారాంతంలో ఫ్లాట్‌గా ముగిసాయి. అయితే సెన్సెక్స్ 200 పాయింట్లు పడి 58014 స్థాయిని తాకింది. చివర్లో బాగా పుంజుకుని సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 58191 వద్ద, నిఫ్టీ 17పాయింట్లు క్షీణించి 17314 వద్ద స్థిరపడ్డాయి. టాటా, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎంఅండ్ఎం టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. టైటన్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి చేరింది. ఏకంగా 54 పైసల నష్టంతో 82.32 ఆల్ టైం కనిష్టం వద్ద ముగిసింది. గత సెషన్లో 81.88 వద్ద క్లోజ్ అయింది. -
ఆల్ టైం కనిష్ట స్థాయికి రూపాయి పతనం
-
ఆకాశానికి డాలర్, పాతాళానికి రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరింత పతనమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 40 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 81.93ని తాకింది. ప్రస్తుతం 36 పైసలు కోల్పోయి 81.88 వద్ద కనొసాగుతోంది. డాలర్ బుధవారం సరికొత్త గరిష్టాలకు ఎగబాకడంతో దేశీయ కరెన్సీ కొత్త రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం, ట్రెజరీ దిగుబడులు పెరగడం వల్ల కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయిని అధిగమించింది. ద్రవ్యోల్బణ కట్టడికోసం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న వడ్డీ పెంపు నిర్ణయం డాలరుకు బలాన్నిస్తోంది. ఇదీ చదవండి : StockMarketOpening: మరింత కుదేలవుతున్న మార్కెట్లు -
2022 ఆరంభం నుంచి రూపాయి ఎన్నిసార్లు, ఎంత పతనమైందంటే!
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనానికి చేరుతున్న రూపాయి గురువారం వరుసగా నాల్గవ సెషన్లో ఆల్ టైం కనిష్టాన్ని టచ్ చేసింది. 79.90 వద్ద కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం కనిష్ట స్థాయి 79.66ను తాకి, చివరికి రికార్డు కనిష్ట స్థాయి 79.62 వద్ద ముగిసింది. అంతేకాదు సమీప కాలంలో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 82 కి పడిపోవచ్చని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలు దేశీయ కరెన్సీని అతలాకుతలం చేశాయి. ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా వార్ తరువాత రూపాయి ఏకంగా 27 సార్లు అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి ఐదుసార్లు కొత్త జీవిత కాల కనిష్ట స్థాయిని తాకింది. 2022 ప్రారంభంలో డాలరకు 74 వద్ద ఉన్న రూపాయి డాలర్‌తో పోలిస్తే రూపాయి 6.4 శాతం నష్టపోయి 80 స్థాయికి చేరేందుకు అతి సమీపంలో ఉంది. మరోవైపు ఆరు కరెన్సీల గ్రీన్‌బ్యాక్‌ను కొలిచే డాలర్ ఇండెక్స్ సోమవారం 20 సంవత్సరాల గరిష్ట స్థాయి 107.74కి పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ డేటా తెలుపుతోంది. ఇకవైపు ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, భారత కరెన్సీపై మరింత ఒత్తిడి పెంచుతోంది. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందన్న ఆందోళనలు, ద్రవ్యోల్బణం గణాంకాలు ఊహించిన దానికంటే భిన్నంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ పాలసీ మరింత కఠినంకానుందన్న అంచనాలు మధ్య డాలరుపై ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. బుధవారం నాటి డేటా ప్రకారం జూన్‌లో అమెరికా వినియోగదారుల ధరల సూచిక 9.1 శాతంతో 41ఏళ్ల గరిష్టానికి పెరిగింది. ప్రపంచమాంద్య భయాలు, యూరప్‌లో ఇంధన సంక్షోభం తీవ్రతరం, దేశీయంగా కరెంట్ ఖాతా లోటు లాంటివి రూపాయిని దెబ్బ తీస్తున్నాయి. రూపాయి పతనం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ పతనాన్ని అడ్డుకోలే పోతున్నాయి. రూపాయిని రక్షించేందుకు బంగారం దిగుమతులపై పన్ను, స్పాట్ అండ్ ఫ్యూచర్స్ ఫారెక్స్ మార్కెట్లలో జోక్యం, ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను నేరుగా పెంచడానికి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం రుపీ సెటిల్మెంట్ విధానాన్నిఇటీవల ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆగని రూపాయి ‘రికార్డు’ పతనం: ఆర్బీఐ ఏమందంటే
అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారిస్తుందని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర పేర్కొన్నారు. అయితే రూపాయి విలువ ఏ స్థాయిలో స్థిరపరచాలన్న అంశంపై ఎటువంటి లక్ష్యాన్ని ఆర్బీఐ నిర్ధేశించుకోలేదని ద్రవ్య విధాన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా గడచిన రెండు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) రుణాలపై వసూలు చేసే వడ్దీరేటు రెపోను 90 బేసిస్ పాయింట్ల పెంచిన (0.40 శాతం, 0.90 శాతం) సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీలో పాత్ర కూడా సభ్యులు. ఈ నేపథ్యంలో ‘‘భారత్ ఎకానమీపై అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ప్రభావం’’ అన్న అంశంపై ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు పాత్ర వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిశీలిస్తే... ►రూపాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. డాలర్ ఎక్కడ ఉంటుందో అమెరికా ఫెడ్‌కి కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచి్చతంగా చెప్పాలి. మేము రూపాయి స్థిరత్వం కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో పురోగతి ఉంటుందని ఆర్బీఐ విశ్వసిస్తోంది. రూపాయి విలువ స్థిరీకరణపై లక్ష్యం ఏదీ లేదుకానీ, తీవ్ర ఒడిదుడుకులను నివారించడనికి మాత్రం సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ► రూపాయి విలువ క్షీణతను పరిశీలిస్తే, ప్రపంచంలోని పలు దేశాల కరెన్సీలకన్నా తక్కువ స్థాయిలోనే మన కరెన్సీ క్షీణత ఉంది. 600 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వల శక్తి నుంచి పొందిన ప్రయోజనం ఇది. ►రూపాయి–రూబుల్ చెల్లింపు విధానం విషయానికి వస్తే, ప్రభుత్వం ఏది నిర్ణయించినా రిజర్వ్ బ్యాంక్ దానిని నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశం. ►2021-22 మూడవ త్రైమాసికంలో (2021 అక్టోబర్-డిసెంబర్ మధ్య) 2.6 శాతంలో భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (దేశంలోకి వచ్చి-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) సంబంధిత కాలం స్థూల దేశీయోత్పత్తిలో 2.6 శాతంగా ఉంది. నాల్గవ త్రైమాసికంలో ఇది 1.5 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఒడిదుడుకులను ఎదుర్కొనే విషయంలో భారత్ పటిష్ట స్థాయిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ► 2021-22లో కరెంట్ అకౌంట్‌లోటు నామమాత్రంగా 1.2 శాతంగానే ఉంది. భౌగోళిక సవాళ్లు, వాణిజ్య సంబంధ అండకులు, దిగుమతుల డిమాండ్ పెరుగుదల వంటి పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ విదేశీ నిల్వలు పటిష్ట స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని క్యాడ్ తెలియస్తోంది. ►ఇతర దేశాలతో పోలి్చతే భారత్ ద్రవ్య పరపతి విధానం ఇంకా సరళతరంగానే ఉంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు దిగివస్తుందని భావిస్తున్నాం. తదుపరి నెలల్లో మరింత దిగివస్తుందన్నది అంచనా. ప్రస్తుత పరిస్థితులు, కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల ఆధారంగా (బేస్‌లైన్) ఈ అంచనాలను వెలువరిస్తున్నాం. ► ప్రపంచం ద్రవ్యోల్బణం సవాళ్లలో ఉన్న నేపథ్యంలో...ప్రస్తుతం దాని కదలికలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. స్థూలంగా స్థాయిలను నిర్ధేశించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ► ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ‘కఠినంగా‘ ఉంటుంది. అయితే భవిష్యత్ ద్రవ్యోల్బణం పథాన్ని నిర్దేశించు కోవడంలో భారతదేశం విజయం సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. తద్వారా ద్రవ్యోల్బణంపై యుద్ధంలో విజయం సాధిస్తుందని భావిస్తున్నాము. ద్రవ్యోల్బణంపై అందోళన అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ ఈ నెల ప్రారంభ పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దుమీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తోంది. దీంతోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉంది. ఇది ఖరీఫ్ పంట దిగుబడికి దోహదపడే అంశం. ఆయా అంశాల నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటురిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటుందని భావిస్తోంది. మొదటి త్రైమాసికంలో 7.5 శాతం, రెండవ త్రైమాసికంలో 7.4 శాతం, మూడవ త్రైమాసికంలో 6.2 నమోదయ్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసింది. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ మధ్య జరిగే పాలసీ సమీక్షలో కూడా రెపో రేటు పెంపు ఉంటుందన్న అంచనాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు మరో ఒక శాతం పెరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. రూపాయి పతనం ఇదిలావుండగా, డాలర్ మారకంలో రూపాయి చరిత్రాత్మక పతనం రికార్డులు కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే ఒకపైసా క్షీణించి 78.33 వద్ద ముగిసింది. రూపాయి గురువారం ముగింపు 78.32. శుక్రవారం ట్రేడింగ్‌లో 78.20 వద్ద ప్రారంభమైంది. 78.19ని చూసినా ఆ స్థాయికి మించి బలపడలేదు. ఇంట్రాడేలో 78.35ను కూడా చూసింది. చివరకు పైనా నష్టంతో 78.33 వద్ద ముగిసింది. తద్వారా ఇంట్రాడే, ముగింపుల్లో రూపాయి శుక్రవారం చరిత్రాత్మక కొత్త కనిష్టాలను చూసింది. రూపాయి వరుస పతనం ఇది ఎనిమిదవ వారం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపు కనబడని పరిస్థితి, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు ధోరణి, దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల బలహీన ధోరణి, విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకం దారులుగా కొనసాగడం వంటి అంశాలు రూపాయి రెండు నెలల పతన ధోరణికి కారణం. విదేశీ మారకద్రవ్య నిల్వలు @ 591 బిలియన్ డాలర్లు వారం వారీగా 6 బిలియన్ డాలర్ల డౌన్ కాగా, భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూన్ 17వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో (జూన్ 10) ముగిసిన వారంతో పోలి్చచూస్తే 6 బిలియన్ డాలర్లు తగ్గి 591 బిలియన్ డాలర్లకు చేరింది. జూన్ 10తో ముగిసిన వారంలోకూడా అంతక్రితం వారంతో పోల్చితే ఫారెక్స్ దాదాపు 4 బిలియన్ డాలర్లకుపైగా తగ్గడ గమనార్హం. ఆర్బీఐ తాజాగా శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 10వ తేదీతో ముగిసిన వారంలో డాలర్లు అధికంగా ఉండే ఫారెన్ కరెంట్ అసెట్స్ (ఎఫ్సీఏ) 5.362 బిలియన్ డాలర్లు తగ్గి, 526.882 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 258 మిలియన్లు తగ్గి 40.584 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) నిధులు మొత్తం 233 మిలియన్ డాలర్ల తగ్గి 18.155 బిలియన్లకు తగ్గాయి. ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూడా 17 మిలియన్ డాలర్లు తగ్గి 4.968 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఇన్వెస్టర్లకు షాక్..నాలుగోవంతు సంపద మటాష్!
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ విలువ దారుణ స్థితికి చేరింది. మార్కెట్ వాల్యుయేషన్‌లో నాలుగో వంతు తుడిచిపెట్టుకుపోయింది. విశ్లేషకుల అంచనాలకు, భయాలకు అనుగుణంగానే షేరు మరింత దిగజారి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. అమ్మకాల ఒత్తిడితో ఎల్ఐసీ షేర్ ధర గురువారం మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐపీవో ఇష్యూ ధర 949 రూపాయలతో పోలిస్తే దాదాపు 25 శాతం కుప్పకూలింది. మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయిన దగ్గరినుంచి కేవలం నాలుగు సెషన్లలో మాత్రమే లాభపడిన షేరు ధర ఆల్ టైం లో రూ.720 టచ్ చేసింది. ప్రస్తుతం 723.20 వద్ద కొనసాగుతోంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,00,242 కోట్లకు చేరింది. ఒక దశలోమార్కెట్ క్యాప్ దాదాపు 4.6 లక్షల కోట్లకు పడిపోయింది. దలాల్ స్ట్రీట్‌లో షేరు విలువ రూ. 1.4 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడంతోపెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. -
రికార్డు కనిష్టానికి నేచురల్ గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సహజ వాయువు రేటును కేంద్ర ప్రభుత్వం 25 శాతం మేర తగ్గించింది. దీనితో యూనిట్ (ఎంబీటీయూ) రేటు ధర 1.79 డాలర్లకు దిగివచ్చింది. ఇది రికార్డు కనిష్ట స్థాయి. విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ మొదలైన వాటికి ఉపయోగించే గ్యాస్ రేటును అక్టోబర్ 1 నుంచి 1.79 డాలర్లకు తగ్గిస్తున్నట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) వెల్లడించింది. ఇప్పటిదాకా దీని రేటు 2.39 డాలర్లుగా ఉంది. ఏడాది కాలంలో గ్యాస్ రేటును తగ్గించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా 26 శాతం మేర కోత విధించడంతో ధర 2.39 డాలర్లకు తగ్గింది. మరోవైపు, సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును సైతం యూనిట్‌కు 5.61 డాలర్ల నుంచి 4.06 డాలర్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సహజ వాయువు ధరను ప్రతి ఆర్నెల్లకోసారి .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న ప్రభుత్వం సవరిస్తోంది. గ్యాస్ ఎగుమతి దేశాలైన అమెరికా, కెనడా, రష్యాల్లోని రేట్లను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. -
లాక్డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం
సాక్షి, ముంబై: కరోనా వైరస్, దేశవ్యాప్త లాక్డౌన్ తయారీ రంగంపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. ఏప్రిల్ మాసంలో మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. లాక్డౌన్ కారణంగా తయారీ, ఇతర సేవల రంగాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో భారత్ తయారీ రంగ యాక్టివిటి ఏప్రిల్‌లో రికార్డు కనిష్ట పతనాన్ని చవిచూసింది. పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 27.4గా నమోదైంది. ఇది గత నెల (మార్చి)లో 51.8గా ఉంది. కోవిడ్-19 కట్టడిలో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపుతో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడం ఇందుకు కారణమైనట్లు పీఎంఐ సర్వే తెలిపింది. అంతేకాదు 15 సంవత్సరాల క్రితం ఐహెచ్ఎస్ మార్కిట్ డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుండి భారత్ పీఎంఐ డాటా ఇంత స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 55.3 కంటే చాలా తక్కువ. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా లాక్డౌన్, ఎగుమతి ఆర్డర్ల పతనంతో పాటు ఉత్పాదక ఉత్పత్తిలో అపూర్వమైన సంకోచానికి దారితీసిందని సోమవారం విడుదల చేసిన నెలవారీ నిక్కీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) సర్వే తెలిపింది. తగ్గిన డిమాండ్ ఏప్రిల్‌లో కొత్త వ్యాపారాలు రికార్డు స్థాయిలో కుప్పకూలిపోయాయని, సంస్థలు తమ సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించాయని సర్వే వెల్లడించింది. వచ్చే 12 నెలల కాలానికి వ్యాపార సెంటిమెంట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మార్చిలో ఇటీవలి కనిష్ట స్థాయి నుండిపెరిగింది. దీంతో కోవిడ్-19 ఉపశమించి, లాక్డౌన్ పరిమితులు సడలించిన తరువాత డిమాండ్ తిరిగి పుంజుకుంటుందనే ఆశా భావం వ్యక్తమవుతోంది. కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగాలాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలైనాయి. ప్రస్తుతం మూడవ దశ లాక్ డౌన్ మే 17వ తేదీవరకు కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు, వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోయాయి. తయారీ ప్లాంట్లు మూత పడ్డాయి. దీంతో ఆటో కంపెనీల విక్రయాలు శూన్యంగా మిగిలాయి. ప్రస్తుతం కొన్ని ఆంక్షలతో కొన్ని సేవలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. -
ఆల్ టైం కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. మంగళవారం ఆరంభంలో 76.79 వద్ద బలహీనపడిన రూపాయి, అనంతరం డాలరు మారకంలో 30 పైసలు తగ్గి 76.83 కు చేరుకుంది. ముడి చమురు రికార్డు పతనం, దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు వెయ్యి పాయింట్లు కుప్పకూలడంతో రూపాయి మరోసారి భారీగా నష్టపోతోంది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.53 వద్ద స్థిరపడింది. అటు డాలరు 100 స్థాయి మార్కును అధిగమించడంతో పెట్టుబడిదారులు రూపాయిలో అమ్మకాలకు దిగారని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగి 100.15 కు చేరుకుంది. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం) చరిత్రలో మొదటిసారిగా యుఎస్ ముడి ఫ్యూచర్స్ మైనస్ లోకి పడిపోయింది. చమురు డిమాండ్ పతనం, కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ వారంలో కార్పొరేట్ ఆదాయాల ప్రకటన, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక నష్టం అంచనాలతో పెట్టుబడిదారుల అప్రమత్తత కొనసాగుతుందని పేర్కొంది. డబ్ల్యుటిఐ ముడి చమురు ఫ్యూచర్స్ రికార్డు పతనాన్ని నమోదు చేయగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.78 శాతం పడిపోయి బ్యారెల్‌కు 25.37 డాలర్లకు చేరుకుంది. అంతేకాకుండా, కరోనా కేసులు గణనీయంగా పెరగడం ఆర్థికవ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళన ఉధృతమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 24.81 లక్షలకు పైగా కేసులు నమోదుగా భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 18,600 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా) -
ముడి చమురు ధర రికార్డు పతనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో ముడి చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో ముడిచమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతున్న అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో మైనస్‌లోకి వెళ్లిపోయాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర ఏకంగా మైనస్ 38 శాతం కుప్పకూలింది. ఇలా జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కోలుకుని 1.10 డాలర్ల వద్ద ఉంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు ధర (మే ఫ్యూచర్స్) గత శుక్రవారం ఒక్క బ్యారెల్‌కు 18.27 డాలర్ల వద్ద ముగిసింది. సోమవారం ఒక దశలో 220 శాతం (40 డాలర్లకు) పైగా నష్టంతో మైనస్ 28 డాలర్లకు పడిపోయింది. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్లో డబ్ల్యూటీఐ చమురు 1983 ఏప్రిల్ నుంచి ట్రేడవడం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అత్యధిక కనిష్ట ధర. కాగా జూన్ డబ్ల్యూటీఐ కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ మాత్రం 22.25 బ్యారెల్ వద్ద ట్రేడ్ అవుతోంది. మే, జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ల ధరల తేడా (స్ప్రెడ్) భారీగా (40 డాలర్లకు మించి) ఉండటం విశేషం. రెండు వరుస నెలల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ల ధరల తేడా ఈ రేంజ్లో ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి. మే డబ్ల్యూటీఐ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లు నేడు(మంగళవారం) ఎక్స్పైర్ అవుతాయి. ఇక బ్రెంట్ క్రూడ్ 6 శాతం(1.76 డాలర్లు) క్షీణించి 26.32 డాలర్లకు చేరింది. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం) కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్, లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. దీంతో డిమాండ్ భారీగా క్షీణించి, నిల్వలు పేరుకు పోతూ వచ్చాయి. దీనికితోడు సౌదీ అరేబియా , రష్యా మధ్య ధరల యుద్ధం కారణంగా ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నెల ప్రారంభంలో రోజుకు దాదాపు 10 మిలియన్ బారెల్స్ ఉత్పత్తిని తగ్గించే ఒప్పందం కుదుర్చుకోవడంతో కాస్త ఈ వివాదం సద్దుమణిగాయి. అయితే లాక్డౌన్పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో డిమాండ్ ఏ మాత్రం పుంజుకోక, చమురు సంస్థలు మిగులు సరఫరాను నిల్వ చేయడానికి ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్న పరిస్థితి. -
76.80 స్థాయికి పడిపోయిన రూపాయి
సాక్షి,ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి బలహీనతకు అంతం లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనంతో కుదేలవుతున్న రూపాయి గురువారం మరోసారి రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో 36 పైసలు నష్టంతో 76.80 స్థాయిని తాకింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 76.75 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆపై ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 76.80కి చేరింది. బుధవారం 76.44 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర (బ్రెంట్ ఫ్యూచర్స్) 1.44 శాతం పెరిగి బ్యారెల్ కు 28.09 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళన నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనంగా వుంది. అలాగే డాలరు బలం కూడా రూపాయి బలహీనతకు కారణమని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా భారతదేశంలో ఇప్పటివరకు 12,380 కేసులు నమోదయ్యాయి. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది.. -
మరో రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరో రికార్డు కనిష్టానికి పతనమైంది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే కొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ప్రారంభంలో 23 పైసల లాభంతో 76.11వద్ద కొనసాగింది. అనంతరం లాభాలన్నీ ఆవిరై పోయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 76.55 స్థాయికి పతనమైంది. బుధవారం 76.34 వద్ద ముగిసింది. డాలర్ సూచీ కీలకమైన గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే 100.17వద్ద ఫ్లాట్‌గా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి దేశీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య రూపాయి పతనం కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సెన్సెక్స్ 960 పాయింట్లు పైగా లాభంతో ట్రేడవుతోంది. కాగా భారతదేశంలో ఇప్పటివరకు 5,700 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 15 లక్షలకు పైగా పెరిగింది. చదవండి : లాభాల ప్రారంభం : ఫార్మా జోరు రుణాలపై వడ్డీరేటును తగ్గించిన హెచ్డీఎఫ్సీ -
రికార్డు కనిష్టానికి బంగారం దిగుమతులు
సాక్షి, ముంబై : కరోనా వ్యాధిని అడ్డుకునేందుకు విధించిన దేశ వ్యాప్త లాక్ డౌన్ బంగారం దిగుమతులపై కూడా భారీ ప్రభావాన్ని చూపింది. దీంతో దేశీయంగా బంగారం దిగుమతులు మార్చిలో రికార్డు కనిష్టానికి పడిపోయాయి. వార్షిక ప్రాతిపదికన 73 శాతానికి పైగా పడిపోయిన పసిడి దిగుమతి ఆరున్నర ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే బంగారానికి రెండో అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్‌కు మార్చి నెలలో దిగుమతులు ఏకంగా 73 శాతం పడిపోయాయి. వాల్యూ పరంగా మార్చి దిగుమతులు దాదాపు 63 శాతం తగ్గి 1.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2019 మార్చిలో 93.24 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది మార్చిలో కేవలం 25 టన్నులకు పడిపోయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆరున్నర సంవత్సరాల్లో ఇదే అతితక్కువ దిగుమతి. కోవిడ్ -19 (కరోనా) మహమ్మారి వేగంగా విస్తరింస్తుండటంతో దాదాపు ప్రపంచమంతా లాక్డౌన్ పరిస్థితుల్లోకి వెళ్లిపోవడం, అంతర్జాతీయ రవాణా పూర్తిగా స్తంభించిపోవటంతో దిగుమతులపై ప్రభావం పడింది. అలాగే లాక్డౌన్ కారణంగా దేశంలో బంగారం దుకాణాలు మూత పడటం ఒకప్రధాన కారణమని బులియన్ వ్యాపారస్తులు తెలిపారు. చదవండి : దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్ -
కరోనా కాటు: రూపాయి పాతాళానికి
సాక్షి, ముంబై: డాలరు మారకంలో రూపాయి పాతాళానికి పడిపోయింది. వరుసగా అత్యంత కనిష్ట స్థాయికి దిగజారుతున్న దేశీయ కరెన్సీ సోమవారం మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. ఏకంగా 95 పైసలు క్షీణించి 76.15 వద్దకు చేరింది. ఇది చారిత్రక కనిష్టం. దేశంలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరగడం, దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 75.90 కు క్షీణించింది. శుక్రవారం అమెరికా డాలర్‌తో 75.20 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారి కారణంగా ప్రపంచ, దేశీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నందున పెట్టుబడిదారులలో ఆందోళన చెందుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 390 కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 400 కేసులు నమోదు కావడం ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న ఆంచనాలు వ్యాపించాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.74 శాతం పడిపోయి బ్యారెల్‌కు 26.24 డాలర్లకు చేరుకుంది. ఆరు కరెన్సీల గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.52 శాతం తగ్గి 102.28 వద్దకు చేరుకుంది. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల దిగుబడి 6.31 శాతంగా ఉంది. కాగా దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ దాదాపు మూడు వేల పాయింట్లు, నిఫ్టీ 842 పాయింట్లు (10 శాతం లోయర్ సర్క్యూట్ ) పతనం కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపి వేశారు. చదవండి: మీరే అసలైన హీరో.. కరోనాపై పోరుకు రూ.100కోట్లు -
రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీపై కూడా కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపుతోంది. డాలరుతో మారకంలో రూపాయి తొలిసారి 75 మార్క్ కిందికి పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం రూపాయి తొలుత 74.95 వద్ద ప్రారంభమైంది. బుధవారం ముగింపు 74.25తో పోలిస్తే ఇది 70 పైసల నష్టం. అనంతరం మరింత దిగజారి ఏకంగా 81 పైసలు(1.1 శాతం) 75.08 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక కనిష్టం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలు, ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ముడిచమురు, కరెన్సీలను సైతం దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం డాలరుతో మారకంలో రూపాయి 74.50 వద్ద రికార్డ్ కనిష్టాన్ని తాకింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ తాజాగా 100ను సైతం అధిగమించడంతో దేశీ కరెన్సీ బలహీనపడినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. బుధవారం రూపాయి నామమాత్రంగా 2 పైసలు నీరసించి 74.26 వద్ద నిలవగా.. మంగళవారం సైతం ఇదే ధోరణిలో 74.28 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 277 పాయింట్ల లాబంతో, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతోనూ కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ కనిష్టం నుంచి 2000, నిఫ్టీ 600, నిఫ్టీ బ్యాంకు 2100 పాయింట్లు పుంజుకోవడం విశేషం. -
జపాన్ను వణికిస్తున్న‘జనాభా’
టోక్యో: అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన జపాన్ దేశం జనాభా విషయంలో మాత్రం వెనకబడుతోంది. 2019 ఏడాదిలో మరోసారి అత్యంత కనిష్ట జననాల రేటును నమోదు చేసింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో తక్కువ జననాల రేటు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 లో దేశంలో జన్మించిన శిశువుల సంఖ్య 8లక్షల 64వేలకు పడిపోయింది. 1899లో నివేదికలు గణించడం ప్రారంభమైనప్పటి నుంచి అతి తక్కువ అని ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా నవజాత శిశువుల సంఖ్య 2018 నుంచి 54 వేలకు పడిపోయిందని నివేదిక అంచనా వేసింది. 2019లో మరణాల సంఖ్య 1.376 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. జపాన్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల శాతం పెరగడం పట్ల ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జనన శాతం తగ్గుదల ఇలాగే కొనసాగితే 2060 నాటికి జపాన్ జనాభా మూడో వంతు పడిపోతుందని ఆ దేశ సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతున్న ఏకైక దేశం జపాన్ కావడం గమనార్హం. జపాన్ దేశ జనాభాలో వృద్ధులు అధికం. 20శాతం ప్రజలు 65ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది. సంతానోత్పత్తి సమస్యలు కేవలం జపాన్ దేశానికే కాక జర్మనీ, యుఎస్, యుకే, సింగపూర్, ఫ్రాన్స్ దేశాలు 2030 సంవత్సారానికి సంతానలేమి సమస్యలు ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జననాల సంఖ్యను పెంచడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం ఉద్యోగుల పని గంటలను వారానికి 68 గంటల నుంచి 52 గంటలకు తగ్గించింది. సంతానోత్పత్తి రేటు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
72.25 స్థాయికి రూపాయి పతనం
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయ మరోసారి రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. సోమవారం మల్లీ పతనదిశగా పయనించిన రూపాయి ఇంట్రాడేలో 72.25 స్థాయికి పతనమైంది. డాలరుతో మారకంలో శుక్రవారం కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ , అప్పటి ముగింపు 71.66 తో పోలిస్తే ప్రారంభంలోనే 32 పైసలు క్షీణించి ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 71.98 వద్ద ట్రేడ్ అయింది. తరువాత 72.08 కు పడిపోయింది. మునుపటి ముగింపుతో పోలిస్తే 42 పైసలు నష్టపోయింది. అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల నుండి బలమైనడాలర్ డిమాండ్ కారణంగా భారత రూపాయి, ఇతర ఆసియా కరెన్సీలతో పాటు దేశీయంగా ఒత్తిడి పెరిగింది. దీంతో 2019 ఆర్థిక సంవత్సరంలో 72.25 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోయింది. కాగా అక్టోబర్ 5, 2018 న రూ .74.07 వద్ద ఆల్ టైమ్ పతనం నమోదైంది. మరోవైపు చమురు ధరలు కూడీ క్షీణించాయి. అమెరికా ముడి చమురు కొత్త సుంకాలకు లోబడి ఉంటుందని చైనా ప్రకటించిన రెండు వారాల వ్యవధిలో అమెరికా ముడిచమురు కనిష్టానికి పడిపోయింది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.91 శాతం తగ్గి 58.80 డాలర్లకు చేరుకుంది. దేశీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలిపారు. ఆగస్ట్ నెలలో ఇప్పటివరకూ(1-23 మధ్య) ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో ఏకంగా రూ. 12,105 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, ఆగస్ట్‌లో రూపాయి 4.5 శాతం తిరోగమించింది. ఇది ఇలా వుంటే పుత్తడి, వెండి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరాయి. -
రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. డాలరు మారకంలో ఆరంభంలోనే 17పైసలు నష్టపోయిన రూపాయి మిడ్ సెషన్ తరువాత ఈ ఏడాదిలో అత్యంత కనిష్టాన్ని నమోదు చేసింది. 37 పైసలు నష్టపోయి 71.92 స్థాయికి చేరింది. ప్రస్తుతం 71.97 వద్ద కొనసాగుతూ రూపాయి 72 స్థాయి దిశగా కదులుతోంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, చములు ధరల క్షీణత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం రూపాయ రికార్డు పతనానికి కారణమని ట్రేడరు చెబుతున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు 440 పాయింట్లకు పైగా కుదేలయ్యాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లలో అమ్మకాలుకొనసాగుతున్నాయి. -
ఆల్ టైం కనిష్టానికి పాకిస్తాన్ కరెన్సీ
పాకిస్తాన్ కరెన్సీ రుపీ పాతాళానికి పడిపోయింది. డాలర్ మారకంలో 144 రూపాయిల కనిష్ట స్థాయికి చేరుకుంది పాక్ కరెన్సీ. శుక్రవారం ఒక్కరోజే భారీగా నష్టపోయిన రూపాయి ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. గురువారం రోజు డాలర్‌కు 134 పాక్ రూపాయిలకు చేరిన మారకం విలువ.. మరో 10 రూపాయలకు పైగా పతనమై చారిత్రక కనిష్టాన్ని తాకింది. మరోవైపు పాకిస్తాన్ కేంద్ర బ్యాంకు తన ప్రామాణిక వడ్డీరేట్లను 10శాతం పెంచింది.150బేసిస్ పాయింట్ల మేర సవరించిన కీలక వడ్డీరేట్లు డిసెంబరు 3నుంచి అమల్లోకి వస్తాయని శుక్రవారం వెల్లడించింది. అధిక కరెంట్ అకౌంట్ రేటు, ద్రవ్యలోటు ద్రవ్యోల్బణ ఒత్తిడి తదితర అంశాలను పరిశీలించాల్సి ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకటించింది. ప్రస్తుత అధ్వాన్న మార్కెట్ పరిస్థితుల్లో రోజురోజుకీ కరెన్సీ విలువ భారీగా పడిపోతోంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. మరోవైపు 2018-2019 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి సంబంధించి దేశ సగటు ద్రవ్యోల్బణం 5.9 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.5 శాతంగా ఉంది. -
రూపాయి పతనం
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ మరోసారి అత్యంత కనిష్ట స్థాయికి పతనమైంది. మంగళవారం ఆరంభంలో పాజిటివ్ నోట్‌తో ట్రేడ్అయినా ఆ తరువాత అమ్మకాలతో కుదేలైంది. బ్రెంట్ క్రూడ్ ధర మరోసారి 84 డాలర్లను అధిగమించడంతో తర్వాత అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో మిడ్‌సెషన్ తరువాత మంగళవారం మధ్యాహ్నం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 74.27 శాతానికి పడిపోయింది. దిగుమతిదారులనుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ పుంజుకోవడం, ద్రవ్య లోటు పెరగడం, పెట్టుబడుల ఉపసంహరణలు దేశీయ కరెన్సీపై భారం పెరగడంతో ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించింది. -
ఆల్ టైం కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: శీయ కరెన్సీ రూపాయి ఎనలిస్టులు అంచనావేసినట్టుగానే మరో రికార్డుపతనానికి దిగజారింది. సోమవారం ఆరంభంలోనే నష్టాలను చవిచూసిన రూపాయి తాజాగా మరింత పతనమైంది. డాలరు మారకంలో 14పైసలు క్షీణించి 74 స్థాయికి పతనమైంది. ప్రస్తుతం 74.06 వద్ద కొనసాగుతోంది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలోనే 300పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనంతరం 200 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం కీలక సూచీలు రెండూ ఫ్లాట్గాకొనసాగుతున్నాయి. -
రూపాయికి ఆర్బీఐ షాక్
-
రూపాయికి ఆర్బీఐ షాక్
ముంబై : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లను సర్ప్రైజ్ చేస్తూ.. రెపో రేటును యథాతథంగా ఉంచడం రూపాయిని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం వెంటనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 74 కు పతనమైంది. డాలర్ మారకంలో రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకింది. నేడు ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలరు మారకంలో రూపాయి భారీగా నష్టపోయింది. గత కొన్ని రోజులుగా కూడా రూపాయి ఈ విధంగానే ట్రేడవుతూ వస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో, రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రూపాయిని కాపాడటానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోతుంది. తాజాగా ఆర్బీఐ పాలసీ అయినా రూపాయి విలువను కాపాడుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా ఫెడ్ రేట్లు పెంచడంతో, విదేశీ నిల్వలు తరలిపోకుండా ఉండేందుకు.. రెపోను ఆర్బీఐ పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రూపాయి విలువను పెంచేందుకు ఎలాంటి ప్రకటన చేయకుండా.. రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు అనూహ్య ప్రకటన చేసింది. -
మరో చారిత్రక కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరో చారిత్రక కనిష్టాన్ని తాకింది. డాలరు మారకంలో వరసగా పతనమవుతూ వస్తున్న రూపాయి బుధవారం భారత మార్కెట్లో మొదటిసారి 73 స్థాయికి పతనమైంది. సోమవారం నాటి ముగింపు 72.91తో పోలిస్తే 81 పైసలు నష్టపోయిన రూపాయి 73.30వద్ద కొనసాగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 175 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ కూడా 60 పాయింట్లు నష్టపోయింది.