సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా రెండో రోజూ నేల చూపులు చూస్తోంది. డాలరుతో మారకంలో మరోసారి సరికొత్త కనిష్ట రికార్డును సృష్టించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే నీరసించిన రూపాయి 23 పైసలు(0.3 శాతం) పతనమై 70.82ను తాకింది. ఇది ఆల్ టైం కనిష్టం. కాగా నిన్న( బుధవారం) ఇంట్రాడేలో 54 పైసలు(0.8 శాతం) పతనమైంది. 70.65వద్ద రికార్డు పతననాన్ని నమోదు చేసింది. బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి రూపాయి మారకపు విలువ 49 పైసలు(0.7 శాతం) కోల్పోయి 70.59 వద్ద ముగిసింది. తద్వారా డాలరుతో మారకంలో రూపాయి విలువ పాతాళానికి చేరింది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి క్షీణించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ డాలరుతో మారకంలో రూపాయి 9.5 శాతం పతనంకావడం గమనార్హం!
ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువను భారీగా ప్రభావితం చేస్తున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారల్ తాజాగా 76 డాలర్ల సమీపానికి చేరగా, న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 68.6 డాలర్ల వద్ద ఉంది. అటు దేశీయంగానూ జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం రూపాయిని దెబ్బతీస్తుందని విశ్లేషకుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment