
సాక్షి, ముంబై: శీయ కరెన్సీ రూపాయి ఎనలిస్టులు అంచనావేసినట్టుగానే మరో రికార్డుపతనానికి దిగజారింది. సోమవారం ఆరంభంలోనే నష్టాలను చవిచూసిన రూపాయి తాజాగా మరింత పతనమైంది. డాలరు మారకంలో 14పైసలు క్షీణించి 74 స్థాయికి పతనమైంది. ప్రస్తుతం 74.06 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలోనే 300పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనంతరం 200 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం కీలక సూచీలు రెండూ ఫ్లాట్‌గాకొనసాగుతున్నాయి.