సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరింత పతనమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 40 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 81.93ని తాకింది. ప్రస్తుతం 36 పైసలు కోల్పోయి 81.88 వద్ద కనొసాగుతోంది. డాలర్ బుధవారం సరికొత్త గరిష్టాలకు ఎగబాకడంతో దేశీయ కరెన్సీ కొత్త రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం, ట్రెజరీ దిగుబడులు పెరగడం వల్ల కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయిని అధిగమించింది. ద్రవ్యోల్బణ కట్టడికోసం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న వడ్డీ పెంపు నిర్ణయం డాలరుకు బలాన్నిస్తోంది.
ఇదీ చదవండి : StockMarketOpening: మరింత కుదేలవుతున్న మార్కెట్లు
Comments
Please login to add a commentAdd a comment